India Defence Ranking: వాస్తవానికి ప్రపంచ ఆర్థిక శక్తిగా అమెరికా ఉంది. తర్వాత స్థానంలో చైనా ఉంది. రష్యా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ జాబితాలో ఇండియా వచ్చి చేరింది. ఆర్థికంగా బలోపేతమైన స్థానంలో ఉంది. ఇప్పుడు డిఫెన్స్ రంగంలో కూడా భారత్ సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఏకంగా చైనా కు దిమ్మ తిరిగే విధంగా షాకిచ్చింది.
కొంతకాలం గా డిఫెన్స్ రంగంలో భారత్ అనేక రకాలుగా ప్రయోగాలు చేస్తోంది. కొత్త కొత్త ఆయుధాలను రూపొందిస్తుంది. వివిధ దేశాలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటున్నది. తన ఆయుధ శక్తిని ఇటీవల కాలంలో ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ప్రదర్శించింది. పాకిస్తాన్ లో ఉగ్రవాద శిబిరాల మీద దాడులు చేసింది. ఖచ్చితమైన లక్ష్యాల మీద దాడులు చేసి భారత్ తన స్థాయిని నిరూపించుకుంది. అయితే ఇక్కడితోనే భారత్ ఆగిపోవడం లేదు. ఏకంగా ప్రపంచ ఆయుధ శక్తులుగా వెలుగొందుతున్న అమెరికా, రష్యా తర్వాత భారత్ స్థానాన్ని సంపాదించుకుంది.
భారతస్థాయిని డబ్ల్యూడిఎంఎంఏ సంస్థ తన వార్షిక ర్యాంకింగ్ ల ద్వారా ప్రకటించింది. ఈ జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉండడం విశేషం. ఆధునికీకరణ.. లాజిస్టికల్ మద్దతు.. పరస్పరంగా చేసే దాడులు.. రక్షణ సామర్థ్యాలు వంటి ఆధారంగా ఈ రేటింగ్ ఇచ్చింది. ప్రత్యేకమైన మిషన్, ప్రత్యేకమైన బాంబర్ దళం, సిఏఎస్ శిక్షణ.. వంటి వాటిని డబ్ల్యూ డి ఎం ఎం ఏ పరిధిలోకి తీసుకుంది. ఇందులో అత్యధికంగా టీవీఆర్ స్కోర్ 242.9. దీనిని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సాధించింది. ఆ తర్వాత స్థానంలో రష్యా ఉంది. రష్యా తర్వాత భారత్ కొనసాగుతోంది.
టీవీఆర్ రేటింగ్స్ ప్రకారం చూసుకుంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 242.9 పాయింట్లు తో మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో యునైటెడ్ స్టేట్స్ నేవీ విభాగం కొనసాగుతోంది. నేవీ విభాగానికి 142.4 టీవీఆర్ రేటింగ్ ఉంది. తర్వాత స్థానంలో 114.2రేటింగ్ తో రష్యన్ వైమానిక దళం కొనసాగుతోంది.. 112.6 టీవీఆర్ రేటింగ్ తో యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ కొనసాగుతోంది. 85.3 టీవీఆర్ రేటింగ్ తో యునైటెడ్ స్టేట్స్ మెరైన్స్ కొనసాగుతోంది. భారత వైమానిక దళం 64.9 టివిఆర్ రేటింగ్ తో ఆరవ స్థానంలో కొనసాగుతోంది.. వాస్తవానికి దేశాల ప్రకారం చూసుకుంటే అమెరికా మొదటి స్థానంలో.. రష్యా రెండవ స్థానంలో.. ఇండియా మూడో స్థానంలో ఉంది. 63.8 టివిఆర్ రేటింగ్ తో చైనా నాలుగో స్థానంలో.. ర్యాంకు పరంగా ఏడవ స్థానంలో ఉంది.
కొంతకాలంగా డిఫెన్స్ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతోంది. రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ ను పూర్తిగా ఆధునికరిస్తోంది. కొత్త కొత్త ఆయుధాలను.. యుద్ధ విమానాలను.. మిస్సైల్స్ ను తయారు చేస్తోంది. అందువల్లే ఇండియా మూడో స్థానంలో ఉంది. ఇదే రేంజ్ గనక కొనసాగిస్తే భారత్ రష్యా స్థానాన్ని ఆక్రమించే అవకాశం ఉందని డిఫెన్స్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.
