https://oktelugu.com/

China: ఫోన్‌ పక్కన పెట్టు.. రూ.లక్ష పట్టు.. ఫోన్‌ అవాయిడింగ్‌ ఛాలెంజ్‌

మనిషి జీవితంలో ఫోన్‌ ఇప్పుడు నిత్యావసర వస్తువు అయింది. కాదు కాదు.. అంది లేకుంటే ఉండలేని పరిస్థితికి తెచ్చింది. చాలా మంది ఫోన్‌కు బానిసయ్యారు. అనేక సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 10, 2024 / 09:02 AM IST

    China(1)

    Follow us on

    China: ఫోన్‌.. ఇప్పుడు మన జీవితంలో ఒక భాగం. మన శరీరంలోకి ఒక పార్టుగా మారిపోయింది. ఫోన్‌ లేకుంటే జీవితం లేదు అనే స్థితికి వచ్చాం. చాలా మంది ఫోన్‌ కొనివ్వ లేదని ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అంతలా మనుషులు ఫోన్‌కు బానిసయ్యారు. ఫోన్‌ అడిక్షన్‌ నుంచి బయటకు రావడం చాలా కష్టంగా మారుతోంది. నేడు చిన్న పిల్లలు కూడా ఫోన్‌ లేకుండా పాలు తాగడం లేదు. అన్నం తినడం లేదు. ఇలాంటి పరిస్థితి మనల్ని మరింత ప్రామాదంలోకి నెడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అందరికీ ఫోన్‌ అలవాటు చేసిన చైనా.. తమ దేశ పౌరులను ఫోన్‌ అడిక్షన్‌ నుంచి బయటపడేసేందకు యత్నిస్తోంది. ఇందు కోసం ఓపెన్‌ ఛాలెంజ్‌లు కండక్ట్‌ చేస్తోంది. ఈ క్రమంలో ఓ మహిళ 8 గంటలు ఫోన్‌కు దూరంగా ఉండి 10 వేల యువాన్లు గెలుచుకుంది.

    100 మందికి పోటీ..
    నవంబర్‌ 29న చాంగ్‌ కింగ్‌ మున్సిపాలిటీలోని ఓ సాపింగ్‌ సెంటర్‌లో 100 మందిని ఎంపిక చేశారు. వీరికి పోటీలు నిర్వహించారు. వీతు మకు కేటాయించిన సమయంలో 78 గంటలు గడపాల్సి ఉంటుంది. పోటీకి ముందు వారి నుంచి మొబైల్‌ ఫోన్లు తీసుకున్నారు. ఐ ప్యాడ్, ల్యాఫ్‌టాప్‌తో సహా ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువుఉల తీసుకున్నారు. అత్యవసర సమయంలో కుటుంబంతో మాట్లాడే అవకాశం కల్పించారు.

    బెడ్‌పైనే ఉండాలి..
    పోటీ జరుగుతున్నంత సేపు కంటెస్టెంట్‌ బెడ్‌పైనే ఉండాలి. టాయిలెట్‌కు మాత్రం వెళ్లొచ్చు. పానీయాలు, భోజనం అక్కడే. పోటీదారులు నిద్రలోకి జారుకోకూడదు. ఎటువంటి ఆందోళన ప్రదర్శించొద్దు. ఇందుకోసం వారి నిద్ర, ఆందోళన స్థాయిలను పర్యవేక్షించేందుకు చేతి మణికట్టుకు పట్టీలు కట్టారు. చాలా మంది పోటీదారులు పుస్తకం చదవడం ద్వారా లేదా కళ్లు మూసుకుని విశ్రాంతి తీసుకోవడం ద్వారా సమయాన్ని గడిపారు. చివరకు డాంగ్‌ అనే మహిళ 100కి 88.99 స్కోర్‌ సాధించి ఛాంపియన్‌గా నిలిచింది.