https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : అధికారిక ఓటింగ్ లో మారిన లెక్కలు..అనూహ్యంగా దూసుకుపోతున్న ప్రేరణ..నిఖిల్, గౌతమ్ ఫ్యాన్స్ కి బిగ్ అలెర్ట్!

ఈ ఆదివారంతో బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. 15 వారాలు ఉత్కంఠ భరితంగా, ఎన్నో ఎమోషన్స్ మధ్య సాగిన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఆడియన్స్ ఎన్నో మధురమయిన జ్ఞాపకాలను మిగిలించింది.

Written By:
  • Vicky
  • , Updated On : December 10, 2024 / 09:15 AM IST

    Nikhil

    Follow us on

    Bigg Boss Telugu 8 : ఈ ఆదివారంతో బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. 15 వారాలు ఉత్కంఠ భరితంగా, ఎన్నో ఎమోషన్స్ మధ్య సాగిన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఆడియన్స్ ఎన్నో మధురమయిన జ్ఞాపకాలను మిగిలించింది. ప్రథమార్థం ఆశించిన స్థాయిలో లేకపోయినా, ద్వితీయార్థం మాత్రం అదిరిపోయింది. కానీ టాస్కుల విషయంలో మాత్రం సీజన్ 7 తో పోలిస్తే, సీజన్ 8 దరిదాపుల్లో కూడా లేదనే చెప్పాలి. రసవత్తరంగా సాగాల్సిన ‘టికెట్ టు ఫినాలే’ టాస్కులు కూడా చాలా సింపుల్ గా ఉన్నాయి. ఇదొక్కటే అభిమానులను నిరాశ పరిచిన విషయం. ఇది ఇలా ఉండగా ఈ సీజన్ టైటిల్ విన్నర్ అవ్వబోయేది నిఖిల్, గౌతమ్ మధ్యలో ఒకరే అనే విషయం దాదాపుగా ప్రతీ కంటెస్టెంట్ కి అర్థమైపోయింది. మిగిలిన కంటెస్టెంట్స్ కూడా తక్కువేం కాదు, వాళ్ళ వైపు నుండి ది బెస్ట్ ఇచ్చారు కానీ, జనాలు వీళ్ళిద్దరిలో ఒకరినే టైటిల్ విన్నర్ చేసే ఉద్దేశ్యంలో ఉన్నారని సోషల్ మీడియా లో జరిగే ఓటింగ్స్ ని చూస్తే అర్థం అవుతుంది.

    సోషల్ మీడియా ఓటింగ్స్ ప్రకారం చూస్తే యూట్యూబ్ లో నిఖిల్ డామినేషన్ ఒక రేంజ్ లో ఉండగా, ఇంస్టాగ్రామ్, వెబ్ సైట్స్, ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి వాటిల్లో గౌతమ్ టాప్ లో ఉన్నాడు. అయితే కేవలం సోషల్ మీడియా ఓటింగ్స్ ని చూసి ఒక అంచనాకి రాలేము. నబీల్, ప్రేరణ లను తక్కువ అంచనా వేస్తే నిఖిల్, గౌతమ్ అభిమానులు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే నబీల్ కి సైలెంట్ ఓటింగ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉంది. మన తెలుగు ఆడియన్స్ అతనికి తక్కువ ఓట్లే వేస్తుండొచ్చు గాక, కానీ నబీల్ కి నార్త్ ఇండియా లో ఒక రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇంస్టాగ్రామ్ లో ఆయన అప్లోడ్ చేసే వీడియోస్ కి లక్షల సంఖ్యలో లైక్స్, వ్యూస్ అందించేది వాళ్ళే. వాళ్ళ వైపు నుండి నబీల్ కి ఒక రేంజ్ ఓటింగ్ పడుతుంది.

    టాప్ 3 స్థానం లోకి మాత్రమే కాదు, నబీల్ టాప్ 2 లోకి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ప్రేరణ ని కూడా నిఖిల్, గౌతమ్ ఫ్యాన్స్ తక్కువ అంచనా వేయకూడదు. ఈమెకు ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇన్ని వారాలు ఆమె హౌస్ లో కొనసాగితే ఒక్కసారి కూడా ఆమె డేంజర్ జోన్ లోకి రాలేదంటే ఆమె రేంజ్ ఆడియన్స్ లో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దానికి తోడు ఎంతో మంది అబ్బాయిలను, అమ్మాయిలను దాటుకొని ఫినాలే వీక్ లోకి అడుగుపెట్టిన ఏకైక మహిళ ప్రేరణ మాత్రమే. అబ్బాయిలతో సమానంగా టాస్కులు ఆడిన ఏకైక కంటెస్టెంట్. ఈమెకి కూడా నిఖిల్, గౌతమ్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా ఓటింగ్ పడుతుంది. కాబట్టి గౌతమ్, నిఖిల్ అభిమానులు మా వాడే టైటిల్ గెలుస్తాడు అని నిర్లక్ష్యం చేస్తే మాత్రం కథ అడ్డం తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, కాబట్టి తస్మాత్ జాగ్రత్త.