Humanity Emotional Story: ఎవడు ఎక్కడికి పోతే నాకేంటి.. నేను బాగున్నానా లేదా.. నా ఫ్యామిలీ బాగుందా లేదా.. ఇదిగో ఇలానే ఉంది సగటు మనిషి ఆలోచన తీరు. మనదేశమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ను ఇదే పరిస్థితి. అందువల్లే పరోపకారం తగ్గిపోయి.. వ్యక్తిగత స్వార్థం మాత్రమే రాజ్యమేలుతోంది. ఇటువంటి రోజుల్లో కూడా కొంతమంది దీపశిఖలాగా వెలుగుతున్నారు. అంధకారం విస్తరించిన సమాజంలో తాము దేదీప్యమానంగా వెలుగులు పంచుతున్నారు.
అది చైనా.. అన్హుయి అనే రాష్ట్రంలో సాన్హు అనే వ్యక్తి అక్కడ ఒక బార్బీ క్యూ స్టాల్ నిర్వహిస్తూ ఉంటాడు. ప్రతిరోజు ఆ చుట్టుపక్కల వారికి ఆ బార్బీ క్యూ స్టాల్ లోనే ఆకలి తీరుతుంది. అయితే ఒక రోజు ఆ స్టాల్ మూతపడింది. గోడ మీద చిన్నపాటి నోటీసు అంటించారు. కుటుంబ కారణాలవల్ల స్టాల్ మోస్తున్నట్టు అతడు అందులో పేర్కొన్నాడు. అయితే సోషల్ మీడియాలో మాత్రం సాన్హు ఒక పోస్ట్ పెట్టాడు. మూడు సంవత్సరాల ఒక బిడ్డకు ల్యూకే మియా క్యాన్సర్ సోకిందని, తాను స్టెమ్ సెల్ ఇవ్వడానికి సిద్ధమైనట్టు అతడు అందులో పేర్కొన్నాడు. అందువల్లే తనకు నష్టం వస్తున్నప్పటికీ జీవనాధారమైన స్టాల్ మూస్తున్నట్టు ప్రకటించాడు. అతడు ఆ స్టాల్ మూసేయడం వల్ల 20వేల యువాన్ల నష్టం వస్తుంది. అయినప్పటికీ దానిని భరించడానికి అతడు సిద్ధమయ్యాడు.
సాన్హు సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెట్టిన తర్వాత.. అది అక్కడ పెను ప్రకంపనలను సృష్టించింది. ఆ తర్వాత అతడు ఆ మూడేళ్ల బిడ్డకు స్టెమ్ సెల్ ఇవ్వడానికి వెళ్లిపోయాడు. స్టెమ్ సెల్ దానమనేది అత్యంత క్లిష్టమైన విధానం. రక్త పరీక్షలలో గ్రూపులు కచ్చితంగా మ్యాచ్ కావాలి. కణాల తయారీని పెంచడానికి కొన్ని రోజులు సూది మందులు కూడా వేసుకోవాలి. కొన్ని సందర్భాలలో చిన్న చిన్న సర్జరీలు కూడా చేస్తారు. ఇలా సాన్హు దాదాపు 13 రోజులపాటు హాస్పిటల్ లోనే ఉండాల్సి వచ్చింది. శారీరకంగా ఇబ్బంది పడ్డాడు. స్టాల్ కూడా మోసివేయడంతో ఆర్థికంగా ఒత్తిడి ఎదుర్కొన్నాడు.. కానీ ఇక్కడే అతడు ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ఎందుకంటే సాహూ తాను స్టెమ్ సెల్ దానం చేస్తున్నప్పుడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కదిలించింది. ఏకంగా లక్షల మంది అతని స్టాల్ ముందుకు వచ్చారు..
అతడు మంచితనాన్ని గుర్తించి చాలామంది సోషల్ మీడియాలో అభినందించారు. హాస్పిటల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత సాన్హు మల్లి తన స్టాల్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాడు. అతడు మంచి మనసును మెచ్చుకుంటూ చాలామంది అక్కడికి వచ్చారు. స్టాల్ ముందు పడి కాపులు కాశారు. ఆ దృశ్యాన్ని చూసి అతడు తట్టుకోలేకపోయాడు. కొందరైతే అతనికి ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. అయితే జనం భారీగా రావడంతో వారందరికీ రెడ్ క్రాస్.. ఇంకా కొన్ని సంఘాలు ముందుకు వచ్చాయి. వారందరికీ భోజనాలు పెట్టాయి..
సాన్హు మంచితనం కారణంగా చాలామంది అతడి స్టాల్ ముందుకు వచ్చారు. అతడిని అభినందించారు. ఆర్థికంగా సహాయం కూడా చేస్తామని అన్నారు.. అయితే అతడు ఆ ఆర్థిక సహాయాన్ని తీసుకోవడానికి ఒప్పుకోలేదు. ఇటువంటి సన్నివేశాలు మనిషి తనాన్ని గొప్పగా చూపిస్తాయి. మానవత్వానికి సరికొత్త అర్ధాన్నిస్తాయి. ఒక మనిషిని ఇతర జంతువుల నుంచి వేరు చేసేది కరుణ.. జాలి.. దయ మాత్రమే. అవి కోల్పోవడం వల్లే మనిషి కూడా మృగాల కంటే హీనంగా మారుతున్నాడు. ఇలాంటప్పుడే సాన్హు లాంటి వ్యక్తులు మానవత్వానికి ప్రతీకగా నిలుస్తూ ఉంటారు.
