Himachal Pradesh flood: మనుషులు కొంతమేర మాత్రమే చూస్తారు. కొంత పరిధిలో శబ్దాలు మాత్రమే వినగలుగుతారు. కాని జంతువులు అలా కాదు. వాటికి దృష్టి బాగా ఉంటుంది. శబ్దాలు కూడా అత్యంత చిన్నవి కూడా వినిపిస్తుంటాయి. అందువల్లే ఏమాత్రం అలికిడి కలిగినా వెంటనే స్పందిస్తాయి. ఈ జంతువుల జాబితాలో శునకాలు ముందు వరుసలో ఉంటాయి. ఎందుకంటే శునకాలకు ఏం జరిగినా వెంటనే తెలుస్తుంది. అవి చిన్న చిన్న దృశ్యాలను కూడా చూడగలవు. అత్యంత చిన్న చిన్న శబ్దాలను కూడా వినగలవు. అంతే కాదు ప్రకృతిలో కనిపించే ప్రతీప శక్తులను కూడా శునకాలు గుర్తిస్తాయి. వెంటనే అవి అరుస్తాయి.. ఆ అరుపులను చాలామంది తేలికగా తీసుకుంటారు. కానీ అవి అరుపులు కాదు ప్రమాదానికి ముందు కుక్కలు అందించే సంకేతాలు. అటువంటి సంకేతాలను ప్రమాదంగా భావించిన ఓ గ్రామస్తులు వెంటనే అప్రమత్తమయ్యారు.. ప్రాణాలను దక్కించుకున్నారు.
Also Read: ఛీ.. ఏం బతుకులు రా బై.. ఇంకా ఎందుకు అమెరికా ను పట్టుకొని వేలాడుడూ!(వీడియో)
హిమాలయాలకు దగ్గరగా ఉండే హిమాచల్ ప్రదేశ్లో ప్రస్తుతం విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల వల్ల ఆ రాష్ట్రం మొత్తం తీవ్రంగా నష్టపోయింది. ముఖ్యంగా భారీ వర్షాల వల్ల మండి జిల్లా తీవ్రంగా నష్టపోయింది. మండి జిల్లాలోని సియతి గ్రామంలో గత నెల 30న భారీగా వర్షం కురిసింది.. అర్ధరాత్రి సమయంలో ఒక పెద్ద కొండచరియ ఒక్కసారిగా విరిగింది.. అదే సమయంలో ఆ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి భవనంలోని రెండవ అంతస్తులో ఒక శునకం నిద్రపోతున్నది. అంతే ఒకసారి గా ఆ శునకం లేచింది. విపరీతంగా అరవడం ప్రారంభించింది. అదే సమయంలో విస్తారంగా వర్షం కురుస్తోంది. కుక్క అరుస్తున్న శబ్దానికి ఆ వ్యక్తి లేచాడు. కుక్క అరవడంతో.. ఆ వ్యక్తి దాని దగ్గరికి వెళ్ళాడు. పైకి వెళ్లి చూడగా రెండవ అంతస్తు గోడకు పగుళ్లు దర్శనమిచ్చాయి. అంతేకాదు ఇంట్లోకి వరద నీరు రావడం కూడా ప్రారంభమైంది. దీంతో అతడు ఆ కుక్కను కిందికి తీసుకెళ్లాడు. గ్రామస్తులందరిని లేపాడు. బరంత కూడా సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారు. అలా వారు దూరంగా వెళ్లడం వల్ల కొండ చరియ ఒక్కసారిగా విరిగింది. అది విరిగిపోవడం వల్ల ఇళ్లు మొత్తం ధ్వంసమయ్యాయి. కేవలం కొన్ని గృహాలు మాత్రమే దెబ్బతిని ఉండదు..
గ్రామంలో గృహాలు మొత్తం దెబ్బతినడంతో అక్కడి ప్రజలు మొత్తం తియంబాలా అనే గ్రామంలో ఉన్న నైనా దేవి ఆలయంలో ఉంటున్నారు. వర్షం వల్ల మొత్తం కోల్పోవడంతో వారంతా తీవ్రమైన దుఃఖంలో ఉన్నారు. ఇక కొంతమంది అధికమైన రక్తపోటుతో ఇబ్బంది పడుతున్నారు.. ఆరోజు ఆ కుక్క అరవడం వల్ల ఆ గ్రామానికి చెందిన వారంతా సురక్షితమైన ప్రాంతానికి వెళ్లిపోయారు. తద్వారా 63 మంది తమ ప్రాణాలు కాపాడుకున్నారు. లేకపోతే వారంతా కూడా చనిపోయేవారు.. ఆ కుక్క చేసిన సాయాన్ని ఆ గ్రామస్తులు మర్చిపోలేకపోతున్నారు. కుక్క అరవడం వల్లే తాము ప్రాణాలతో బయటపడ్డామని ఆ గ్రామానికి చెందిన వారంతా చెబుతున్నారు..
Also Read: అమెరికానే ముంచెత్తింది.. ఎన్నడూచూడని ఉపద్రవం
వర్షం వల్ల మండి జిల్లాలోని తునాగ్ ప్రాంతంలో ఉన్న ఆపరేటివ్ బ్యాంక్ ను వరద ముంచింది. ఇందులో ఉన్న బంగారం, నగదు ఏమైందనేది ఇంతవరకు తెలియ రాలేదు. బ్యాంకులో ఉన్న ఆభరణాలు, ఇతర వస్తువులు వరద నీటిలో కొట్టుకుపోకుండా గ్రామస్తులు పహారా కాస్తున్నారు. అవి దొంగల చేతిలో పడకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇక వర్షాల వల్ల ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు 70 మంది చనిపోయారు. పలువురు గల్లంతయ్యారు. ఈ రాష్ట్ర పరిధిలో ఉన్న పది జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం విశేషం. ప్రస్తుతం అక్కడ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరికొద్ది రోజులపాటు ఇలాగే వర్షాలు కురిసే అవకాశం ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు.
हिमाचल के नाहन में चंद पलों में ही भूस्खलन के चलते रोड पाताल में समा गयी । ईश्वर रहम कर..
Road goes down in a landslide after mountain cracks near Badwas, Nahan in Himachal Pradesh. pic.twitter.com/e5614HbnWs
— Srinivas BV (@srinivasiyc) July 30, 2021