Mahesh Babu’s daughter Sitara: మహేష్ బాబు(Super Star Mahesh Babu) కూతురు సితార(Sitara) కి సోషల్ మీడియా లో మంచి క్రేజ్ ఉంది అనే సంగతి అందరికీ తెలిసిందే. చేతిలో ఫోన్ పట్టుకొని సోషల్ మీడియా వాడడం నేర్చుకున్నప్పటి నుండే ఆమె ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లలో ఎంట్రీ ఇచ్చింది. సోషల్ మీడియా లో తనకు తోచిన విధంగా ఉంటూ, కేవలం మహేష్ బాబు అభిమానులను మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానుల మనసుల్ని కూడా దోచుకుంది. ఇక యూట్యూబ్ ఛానల్ లో అయితే ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలిసి చేసిన వీడియోస్ ని చూస్తే ఆశ్చర్యపోతారు. ఇంత చిన్న వయస్సు లో ఇంత తెలివి, టాలెంట్ ఎలా సాధ్యం అనిపిస్తాది. అయితే అప్పుడప్పుడు మహేష్ బాబు తన ట్విట్టర్,ఇన్ స్టాగ్రామ్ అకౌంట్స్ లో సితార డ్యాన్స్ వేసిన వీడియోస్ ని షేర్ చేస్తూ మురిసిపోతుంటాడు.
సితార చాలా అద్భుతంగా డ్యాన్స్ చేస్తుందే అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేసేవాళ్ళు. ఆమెకు డ్యాన్స్ నేర్పించింది మరెవరో కాదు, ఆనీ మాస్టర్(Aane Master). ఈమె బిగ్ బాస్ సీజన్ 5 లో ఒక కంటెస్టెంట్ గా, ఈటీవీ లో ప్రసారమయ్యే ఢీ డ్యాన్స్ రియాలిటీ కి జడ్జీ గా మన తెలుగు ఆడియన్స్ కి బాగా సుపరిచితమే. ఈమె రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో సితార గురించి చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ ‘నేను రోజు సితార కి డ్యాన్స్ నేర్పించడానికి మహేష్ బాబు గారి ఇంటికి వెళ్తుంటాను. నన్ను పికప్ చేసుకోవడానికి ఖరీదైన బెంజ్ కారుని ప్రతీ రోజు పంపేవారు. ఆ బెంజ్ కారులో నేను తిరగడం చూసి అందరూ ఆనీ మాస్టర్ కారు అని అనుకునేవారు. కానీ అది నాది కాదు, మహేష్ బాబు సార్ వాళ్ళది’ అంటూ చెప్పుకొచ్చింది.
Also Read: శర్వానంద్ కి ఏమైంది? ఇక ఆయన నుండి సినిమాలు విడుదల అవ్వడం కష్టమేనా!
ఇంకా ఆమె మాట్లాడుతూ ‘నమ్రత గారు గౌతమ్ కి డ్యాన్స్ నేర్పించడానికి డ్యాన్స్ మాస్టర్స్ కోసం చూస్తున్నారు. నాకు ఈ విషయం తెలియగానే నేను చేస్తాను,నాకు ఆసక్తి ఉందని చెప్పాను. నమ్రత గారు ఓకే చెప్పి నన్ను తీసుకున్నారు. నేను గౌతమ్ కి డ్యాన్స్ నేర్పించేటప్పుడు సితార కూడా వచ్చేది. గౌతమ్ ఏది చేస్తే ఆమె కూడా అది క్యూట్ గా చేసేది. కానీ గౌతమ్ పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళిపోయాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను సితార పాపకు డ్యాన్స్ మాస్టర్ గా కొనసాగుతూ వస్తున్నాను. సుమారుగా నాలుగున్నర ఏళ్ళ నుండి ఆ పాప నా దగ్గర డ్యాన్స్ నేర్చుకుంటుంది’ అంటూ చెప్పుకొచ్చింది ఆనీ మాస్టర్. సితార పాపకు తన తండ్రికి ఉన్నట్టుగానే మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందని కూడా చెప్పుకొచ్చింది. ఇంకా ఆమె ఏమి మాట్లాడిందో ఈ క్రింది వీడియో లో చూడండి.