Syrian Assad : సిరియా అధ్యక్షుడు అసద్ దేశం విడిచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అతడు తన పరిపాలన కాలంలో సిరియాలో చేయని ఆకృత్యం లేదు. పైశాచికానికి సరికొత్త అర్ధాన్ని ఇచ్చేలాగా అసద్ సిరియాలో పరిపాలన సాగించాడు. అయితే ఇప్పుడు అతడు చేసిన దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారికి అసద్ చుక్కలు చూపించాడు. బతికి ఉండగానే ప్రత్యక్షంగా నరకాన్ని పరిచయం చేశాడు.. తరుణ్ వ్యతిరేకించే వారికోసం ఏకంగా సైద్నాయ మిలటరీ జైలు ఏర్పాటు చేశాడు. అయితే ఆ జైల్లో పనిచేసిన అధికారులు మరింత దారుణంగా ప్రవర్తించేవారు. ఎంత వికృతమైన చర్యలకు పాల్పడ్డారు. అసద్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఒక కీలక అధికారి చేసిన ఆకృత్యాలు మామూలువి కావు. అసద్ ఏర్పాటుచేసిన టైగర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ విభాగంలో తలాల్ దకాక్ అనే అధికారి కీలకంగా పనిచేసేవాడు. జైల్లో ఉన్న ఖైదీలను అతడు తీసుకెళ్లి తాను పెంచుకునే సింహానికి బలి ఇచ్చేవాడు. తనకు ఏమాత్రం ఎదురు తిరిగినా సహించేవాడు కాదు. ఎదురు తిరిగిన వారందరినీ సింహానికి బలి ఇచ్చేవాడు. దకాక్ పైసాచికం సిరియా తిరుగుబాటుదారులకు ముందే తెలియడంతో.. వారు సిరియా దేశాన్ని సొంతం చేసుకున్న తర్వాత.. దకాక్ ను బహిరంగంగానే ఉరి తీసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారికంగా ఎటువంటి ప్రకటన లేకపోయినప్పటికీ.. అతడిని చంపేశారని తెలుస్తోంది.. ద కాక్ లాంటి అధికారులను అడ్డం పెట్టుకొని అసద్ ప్రభుత్వం యంత్రాంగంపై విపరీతమైన పట్టు సాధించాడు. అసద్ అండ చూసుకొని దకాక్ రాజ్యాంగేతర శక్తిగా ఎదిగాడు.
జూ నుంచి సింహాన్ని తీసుకొచ్చాడు
అసద్ అండదండలు ఉండడంతో దకాక్ జంతు ప్రదర్శనశాల నుంచి ఒక సింహాన్ని తీసుకొచ్చాడు. దానికి విచారణ ఖైదీలను ఆహారంగా వేసేవాడు. అంతేకాదు సొంతంగా ఒక నీర సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నాడు. తన అధికారాన్ని ఉపయోగించుకుని అరాచకాలను ఇష్టారాజ్యంగా చేశాడు. హత్యలకైతే లెక్కేలేదు. అవయవ రవాణా.. అపహరణ.. ఆయుధాల తయారీ.. దొడ్డిదారిలో విక్రయం వంటి దుర్మార్గాలకు పాల్పడ్డాడు. అయితే దకాక్ ను బహిరంగంగా ఉరి తీసినట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో హమా ప్రాంతానికి చెందిన ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. రోడ్ల మీదికి వచ్చి నినాదాలు చేస్తున్నారు. ద కాక్ చిత్రపటాలను దహనం చేస్తున్నారు.
నాయకత్వ మార్పిడి సాధ్యమవుతుందా
తిరుగుబాటుదారులు సిరియా మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నప్పటికీ.. ఆ గ్రూపుల మధ్య సఖ్యత లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో నాయకత్వ మార్పిడి ఎలా ఉంటుందనేది అంతుపట్టడం లేదు. అయితే వారంతా ఒకే తాటి పైకి రావాలని సిరియా రెబల్ నాయకుడు జులాని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అవి ఎంత మేరకు సఫలీకృతమవుతాయనేది అంతుచిక్కడం లేదు. తిరుగుబాటుదారులు సిరియాలో ప్రస్తుతం పోలీసులు, ఆర్మీ చేసిన విధులను నిర్వహిస్తున్నారు. దేశం మొత్తం పహారా కాస్తున్నారు. తాము ఎటువంటి హాని తలపెట్టబోమని ప్రజలకు హామీలు ఇస్తున్నారు. సిరియా తిరుగుబాటుదారుల సొంతమైనప్పటికీ ఇస్లామిక్ చట్టం ప్రకారం అక్కడ నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంత చిన్న విషయం కాదని తెలుస్తోంది.