https://oktelugu.com/

BGT Australia vs India 2024 : వాన దంచి కొడుతుంటే.. టెంట్ల కింద వెచ్చగా పండగ చేసుకున్నారు..

భారత్, ఆస్ట్రేలియా జట్లు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తలపడుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టులలో చేరొక మ్యాచ్ లో విజయం సాధించాయి.

Written By:
  • NARESH
  • , Updated On : December 15, 2024 / 08:31 AM IST

    India

    Follow us on

    Australia vs India మూడవ టెస్ట్ బ్రిస్బేన్ వేదికగా శనివారం మొదలైంది. వర్షం వల్ల తొలిరోజు ఆట సాగలేదు. కేవలం 80 బంతులు మాత్రమే టీమిండియా బౌలర్లు వేయగలిగారు. రోజంతా వర్షం కురవడంతో ఆట నిర్వహించడానికి వీలుపడలేదు. డ్రెస్సింగ్ రూమ్ లో ఉండి ఉండి చిరాకు పుట్టిందేమో.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పలుమార్లు బౌండరీ లైన్ వద్దకు వచ్చాడు. ప్రేక్షకులను పలకరించి వెళ్లిపోయాడు. ఆ తర్వాత డగ్ ఔట్ ఏరియాలో వెళ్లి కూర్చున్నాడు. వర్షం మైదానాన్ని హోరెత్తిస్తుంటే.. ఒక బృందం మాత్రం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరించింది. వర్షాన్ని ఆస్వాదిస్తూ.. మద్యం తాగుతూ.. కాల్చిన కోడి మాంసాన్ని తింటూ ఎంజాయ్ చేసింది. ఈ బృందంలో ఆస్ట్రేలియా, భారత జట్లను అభిమానించే ప్రేక్షకులు ఉన్నారు. వర్షం ఏ మాత్రం తగ్గకపోవడంతో వారు తగ్గేది లేదన్నట్టుగా విందు వినోదాల్లో మునిగిపోయారు. వీకెండ్ కావడం.. అందులోనూ వర్షం కురుస్తుండడంతో చాలామంది గబ్బా మైదానానికి పోటెత్తారు. ఇక ఈ వర్షంలో స్టేడియానికి వచ్చిన ఓ వ్యక్తి చేతిలో గ్రిల్ పెట్టుకుని.. కోడి మాంసాన్ని కాల్చుతున్నాడు. ఆ మాంసాన్ని ఎర్రగా కాల్చి.. వాటికి సాస్ అంటించి ప్లేట్లలో వచ్చిన ప్రేక్షకులకు పెట్టి ఇస్తున్నాడు. అక్కడికి వచ్చిన ప్రేక్షకులు ఆ మాంసాన్ని ఆవురావు మంటూ లాగించారు. వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోయినప్పటికీ.. గ్రిల్ ద్వారా మాంసాన్ని విక్రయించే వ్యక్తి వ్యాపారం మాత్రం జోరుగా సాగింది. పలుమార్లు వర్షం తగ్గినప్పటికీ.. మళ్లీ జోరు అందుకుంది. దీంతో ప్రేక్షకులకు తీవ్ర నిరాశ ఎదురయింది. కానీ ఆ వర్షం కురుస్తున్న సమయంలో వచ్చిన ప్రేక్షకులు ఎర్రగా కాల్చిన మాంసాన్ని తింటూ.. మద్యం తాగుతూ ఆ వాతావరణంలో ఆస్వాదించారు.

    ఒక చేత్తో మద్యం గ్లాసు.. మరో చేత్తో చికెన్ తొడ ముక్కతో సందడి చేశారు. శనివారం గబ్బా మైదానంలో వారు చేసిన హడావిడి అంతంత కాదు. ఎర్రగా కాల్చిన కోడి మాంసం కోసం అక్కడి ప్రేక్షకులు క్యూ కట్టారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అన్నట్టు గ్రిల్ చికెన్ అందరికీ లభించలేదు. కొంతమంది క్యూలో ఉన్నప్పటికీ దక్కకపోవడంతో నిరాశతో వెనుతిరి గారు. ” వాతావరణం చాలా చల్లగా ఉంది. వర్షం అదే తీరుగా కురుస్తోంది. ఇలాంటి సందర్భంలో వేడివేడిగా ఏదైనా తింటే పంటికి భలే ఉంటుంది. అలాంటి దానికోసమే ఇప్పటిదాకా ఎదురు చూసాం. కానీ మా వంతు వచ్చేసరికి కాల్చిన కోడి మాంసం అయిపోయింది. ఇక చేసేది ఏమీ లేక నిరాశతో వెను తిరగాల్సి వచ్చింది. అటు మ్యాచ్ ప్రారంభం కాలేదు. ఇటు కాల్చిన కోడి మాంసం దొరకలేదు. ఒకవేళ ఆదివారం కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగితే గ్రిల్ కోడి మాంసం దుకాణాలు మరింత పెరుగుతాయి. మద్యం దుకాణాలు కూడా కిటకిటలాడుతాయని” నెటిజన్లు పేర్కొంటున్నారు.