Horoscope Today:గ్రహాల మార్పులో భాగంగా ఆదివారం ద్వాదశ రాశులపై ఆరుద్ర నక్షత్ర ప్రభావం ఉండనుంది. ఇదే రోజు లక్ష్మీయోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశుల వ్యాపారులకు అపారమైన ధన లభించే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారు ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి:
ఈ రాశి వారు మాటలను అదుపులో ఉంచుకోవాలి. సాధ్యమైనంతవరకు వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగులు అదనపు ఆదాయంకోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. వ్యాపారులు శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
వృషభరాశి:
కుటుంబ సభ్యులతో గొడవలు ఉండే అవకాశం. కొందరు వ్యక్తులకు దూరంగా ఉండడమే మంచిది. వ్యాపారులు రిస్క్ తో కూడిన పనులు చేస్తారు. కానీ ఇవి లాభిస్తాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
మిథున రాశి:
ప్రియమైనవారితో సంతోషంగా ఉంటారు.విలువైన వస్తువులు ఇదివరకే దొంగిలించబడితే అవి నేడు లభ్యమవుతాయి. ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఖర్చులు చేయాలి. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది.
కర్కాటక రాశి:
చిరు వ్యాపారులకు ఈరోజు అనుకూల వాతావరణం ఉంటుంది. అదనపు ఆదాయం పెరిగే అవకాశం. సాయంత్రం స్నేహితులతో సరదాగా ఉంటారు. జీవిత భాగస్వామి కోసం సమయాన్ని వెచ్చిస్తారు.
సింహా రాశి:
విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం తప్పనిసరి. బంధువుల్లో ఒకరి నుంచి ధన సాయం అందుతుంది. వాహనాలపై ప్రయాణం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలు జరిపేవారు ఆచితూచి వ్యవహరించాలి.
కన్యరాశి:
ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా పొందుతారు. ఉద్యోగులకు తోటివారి మద్దతు ఉంటుంది. పాత బకాయిలు ఉంటే నేటితో పూర్తవుతాయి. దీనివల్ల సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
తుల రాశి:
అనవసర వివాదాల్లో జోక్యం చేసుకోకుండా ఉండాలి. ఉద్యోగులకు కార్యాలయాల్లో వివాదం ఉంటే వెంటనే సమస్య పరిష్కరించుకోవాలి. కొన్ని పనుల వల్ల అపారమైన ప్రయోజనాలు పొందుతారు.
వృశ్చిక రాశి:
ఉద్యోగులు అదనపు ఉపాధి పొందుతారు. కుటుంబ సభ్యుల మద్దతుతో కొన్ని పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. వివాహం చేసుకోవాలని అనుకునేవారికి శుభఫలితాలు ఉంటాయి. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు ఉంటుంది.
ధనస్సు రాశి:
సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. కొందరు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఏ పని మొదలు పెట్టినా కచ్చితంగా విజయం అవుతుంది.
మకర రాశి:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాల్ల పాల్గొంటారు. కుటుంబంతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. సాయంత్రం ఆహ్లాదకరమైన వాతావరణంలో గడుపుతారు. మానసికంగా ఒత్తిడితో ఉంటారు.
కుంభ రాశి:
వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. రాజకీయాల్లో ఉండేవారికి ఈరోజు అనుకూల సమయం. సాయంత్రం జీవిత భాగస్వామితో కలిసి ఉల్లాసంగా ఉంటారు. విహార యాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు.
మీనరాశి:
ఓ సమాచారం సంతోషాన్ని కలిగిస్తుంది. కొందరు శత్రువులు ఇబ్బంది పెట్టే అవకాశం. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. మాటలను అదుపులో ఉంచుకోవాలి. బంధువుల్లో ఒకరితో వాగ్వాదం ఉంటుంది.