TikTok : సాంకేతిక విప్లవంలో భాగంగా ఆన్‌డ్రాయిడ్(Andraid) ఫోన్ అందుబాటులోకి రావడంతో సోషల్ మీడియా యాప్స్ అనేకం పుట్టుకొస్తున్నాయి. అవసరాలకు అనుగుణంగా రోజుకో యాప్ ఆవిష్కరిస్తున్నారు. ఎవరి అవసరానికి అనుగుణంగా వారి యాప్స్ ఉపయోగిస్తుండగా కొన్ని యాప్స్ మాత్రం అందరూ వాడుతున్నార. వాటినే షోషల్ యాప్స్(Social aaps) అంటున్నారు. అలాంటి వాటిలో ఫేస్బుక్, వాట్సాప్, చాట్ జీపీటీ, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషోతోపాటు అనేక ఈకామర్స్ యాప్స్ ఉన్నాయి. అయితే ఎంటర్టైన్మెంట్ యాప్స్‌కు వచ్చే సరికి చైనా రూపొందించిన టిక్‌టాక్((Ticktok) చాలా పాతది. దీనిని చాలా దేశాలు నిషేధించాయి. చైనా ఈ యాప్ సహాయంతో రహస్యంగా డేటా సేకరిస్తుందన్న ఆరోపణలు రావడంతో భారత్ కూడా టిక్‌టాక్‌ను నిషేధించింది. అమెరికాలో కూడా దీనిని నిషేధించారు. అయితే కొత్తగా అధ్యక్ష ఆధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్.. టిక్‌టాక్‌పై నిషేధం ఎత్తివేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్(Elan musk) ఈ చైనా యాప్ టిక్‌టాక్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్నారు. చైనాకు చెందిన బైటాడ్యాన్స్ ఆధ్వర్యంలోని టిక్‌టాక్ అమెరికా(America) కార్యకలాపాలను కొనుగోలు చేయవచ్చనే వార్తలు వస్తున్నాయి. అమెరికాలో జాతీయ భద్రత, డేటా గోప్యతపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో బైట్యాన్స్ యూఎస్ కార్యకలాపాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌ను స్థానికంగా నిషేధించినట్లు కథనాలు వస్తున్నాయి. అయితే దీనిపై తుది నిర్ణయం రాలేదు.
అమెరికా ఆంక్షలు..
చైనాకు చెందిన బైటాడ్యాన్స ఆధ్వర్యంలోని టిక్‌టాక్‌ను 2025, జనవరి 19 నాటికి అమెరికాకు చెందిన ఓ కంపెనీకి విక్రయించాలనేలా గతంలో ఆంక్షలు విధించారు. లేదంటే ఈ యాప్‌పై నిషేధం విధించే అవకాశం ఉంది. ఈ నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలంటే టిక్‌టాక్ అమెరికా ఉన్నత న్యాయస్థానాన్ని ఇటీవల అభ్యర్థించింది. 2025, జనవరి 10న వాదనలు వినడానికి న్యాయస్థానం అంగీకరించింది. తుది తీర్పు రావాల్సి ఉంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Elon musk is going to buy tiktok
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com