Homeఎంటర్టైన్మెంట్Sankranthiki Vasthunam Twitter Talk: సంక్రాంతికి వస్తున్నాం ట్విట్టర్ టాక్ : వెంకటేష్ మూవీ హిట్టా...

Sankranthiki Vasthunam Twitter Talk: సంక్రాంతికి వస్తున్నాం ట్విట్టర్ టాక్ : వెంకటేష్ మూవీ హిట్టా ఫట్టా? ఆడియన్స్ తెల్చేశారు!

Sankranthiki Vasthunam Twitter Talk: 2025 సంక్రాంతి కానుకగా మూడు బడా చిత్రాలు విడుదలయ్యాయి. రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీకి మిక్స్డ్ టాక్ దక్కించుకుంది. దిల్ రాజు నిర్మించిన ఈ భారీ బడ్జెట్ మూవీ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు అనేది ప్రేక్షకుల అభిప్రాయం. రెండు రోజుల వ్యత్యాసంతో డాకు మహారాజ్ మూవీ విడుదల చేశారు. బాలకృష్ణ హీరోగా దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డాకు మహారాజ్ కొంత మెరుగైన టాక్ సొంతం చేసుకుంది. గేమ్ చేంజర్ కంటే బెటర్ అనే వాదన వినిపిస్తుంది.

ఈ క్రమమంలో వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. వెంకటేష్-అనిల్ రావిపూడిలది హిట్ కాంబినేషన్. ఎఫ్ 2, ఎఫ్ 2చిత్రాలతో వారు మంచి విజయాలు నమోదు చేశారు. మూవీ ప్రచారం కోసం వెంకటేష్ బాగా కష్టపడ్డారు. వినూత్నంగా సినిమాను జనాల్లోకి తీసుకెళ్లారు. సాంగ్స్, ట్రైలర్ సైతం ఆకాట్టుకోగా విపరీతంగా బుకింగ్స్ జరిగాయి.

మరి ప్రేక్షకుల అంచనాలు సినిమా అందుకుందా… అంటే, అవుననే మాట వినిపిస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం పక్కా పండగ చిత్రం అంటున్నారు. అనిల్ రావిపూడి తన మార్క్ కామెడీ, ఎమోషన్, యాక్షన్ కలగలిపి తెరకెక్కించాడట. వెంకటేష్ ఎనర్జీ, కామెడీ టైమింగ్ అద్భుతం అట. ఇద్దరు హీరోయిన్స్ తో వెంకటేష్ కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి తమ పాత్రల్లో సహజంగా నటించారట. భీమ్స్ పాటలు మరో హైలెట్ అంటున్నారు.

ఈ సినిమాలో కొన్ని మైనస్ లు కూడా ఉన్నాయి. కామెడీ వర్క్ అవుట్ అయినప్పటికీ అక్కడక్కడ విసుగు పుట్టిస్తుంది. కథలో పెద్దగా దమ్ము లేదు. నిర్మాణ విలువలు నాసిగా ఉన్నాయని అంటున్నారు. మొత్తంగా ఒకసారి చూసి ఎంజాయ్ చేయవచ్చని అంటున్నారు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి దిల్ రాజు నిర్మాత. ఇక డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాల్లో విన్నర్ ఎవరో తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular