Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీSpacex Starship: ఉదయం అమెరికా వెళ్లి.. సాయంత్రం రావచ్చు.. జస్ట్ అరగంటలో.. ఇంపాజిబుల్‌ జర్నీని పాజిబుల్‌...

Spacex Starship: ఉదయం అమెరికా వెళ్లి.. సాయంత్రం రావచ్చు.. జస్ట్ అరగంటలో.. ఇంపాజిబుల్‌ జర్నీని పాజిబుల్‌ చేస్తున్న ప్రపంచ కుబేరుడు!

Spacex Starship: అమెరికా అధ్యక్ష ఎన్నికలపై మొన్నటి వరకు చర్చ జరిగింది. ఎన్నికలు ముగిశాయి. అధ్యక్షుడుగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికయ్యాడు. ట్రంప్‌ విజయంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ కీలక పాత్ర పోషించారు. దీంతో ట్రంప్‌ తన గెలుపులో భాగస్వామి అయిన మస్క్‌తోపాటు, భారతీయ అమెరికన్‌ వివేక్‌ రామస్వామికి కీలక బాధ్యతలు అప్పగించారు. ఇక ఇప్పుడు మస్క్‌ కొత్త ఆవిష్కరణపై చర్చ జరుగుతోంది. ప్రపంచంలో అమెరికా నుంచి ఎక్కడికైనా గంటలోపూ ప్రయాణించే మిషన్‌ ప్రారంభించారు. అందరూ ఇంపాజిబుల్‌ నుకునే ఈ జర్ని.. పాజిబుల్‌ అంటున్నారు ఎలాన్‌ మస్క్‌. మస్క్‌ తొందరపడి ఏదీ అనరు. అన్నారంటే.. చేసి తీరుతారు. మరి ఈ స్పీడ్‌ జర్నీ కోసం మస్క్‌ త్వరలోనే ఒక రాకెట్‌ రూపొందిస్తున్నారు. అంతర్జాతీయ ప్రయాణంలో ఇది ఒక విప్లవాత్మక టెక్నాలజీ కాబోతోంది. మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానుంది. అదే స్టార్‌ షిప్‌. దీనిసాయంతో ప్రయాణికులు ప్రపంచంలో ఎక్కడికైనా 30 నుంచి 40 నిమిషాల్లో ట్రావెల్‌ చేయవచ్చని మస్క్‌ పేర్కొంటున్నారు. మరి ఈ పరిజ్ఞానం అందుబాటులోకి వస్తే.. జర్నీ ఎలా ఉంటుందో చూద్దాం.

స్టార్‌ షిప్‌ ఇలా..
మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ రూపొందిస్తున్న ఈ టెక్నాలజీ వామనం స్టార్‌ షిప్‌ త్వరలో అందుబాటులోకి రానుంది. దీనిని దాదాపు 395 అడుగుల పొడవుతో తయారు చేస్తున్నారు. ఇందులో ఒకేసారి వెయ్యి మంది ప్రయాణించవచ్చు. భూ కక్ష్య దాకా వెళ్లి.. తర్వాత గమ్యస్థానానికి చేరుకుంటంది. దీంతో నిమిషాల్లో ప్రయాణం పూర్తవుతుంది. సాధారణంగా ఢిల్లీ నుంచి అమెరికాలోని న్యూయార్క్‌ నగరానికి విమానం ద్వారా చేరుకోవడానికి 16 గంటల సమయం పడుతుంది. కానీ స్టార్‌ షిప్‌ అందుబాటులోకి వస్తే కేవలం 30 నిమిషాల్లో చేరుకోవచ్చు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. సాధ్యమే అంటున్నారు మస్క్‌. మరి కొన్నేళ్లలోనే దీనిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు.

ఎయిర్‌లైన్స్‌ మూతే..
స్టార్‌ షిప్‌ అందుబాటులోకి వస్తే జర్నీ వేగం పెరగడం ఖాయం. అదే సమయంలో విమానాలు, విమానాశ్రయాల నిరుపయోగంగా మారతాయి. అయితే స్టార్‌ షిప్‌ రాకెట్‌ ప్రయోగం, లాంచింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలి. అన్నీ ఉంటేనే స్టార్‌షిప్‌ అందుబాటులోకి వస్తుంది. అయితే స్టార్‌షిప్‌ కార్యరూపం దాల్చడానికి చాలా ఏళ్లు పట్టే అవకాశం ఉంది.

స్టార్‌ షిప్‌తో ఫ్యూచర్‌ ఇలా

ఢిల్లీ టూ అమెరికా 30 నిమిషాలు

లాస్‌ఏంజెల్స్‌ టు టొరంటో – 24 నిమిషాలు

ఢిల్లీ టు శాన్‌ఫ్రాన్సిస్కో – 30 నిమిషాలు

న్యూయార్క్‌ టు షాంఘై, హాంకాంగ్‌ – 39 నిమిషాలు..

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular