https://oktelugu.com/

Donald Trump : ట్రంప్ పాలనలో అమెరికన్లకు చుక్కలే.. మస్క్, వివేక్ వింత ప్రకటనలతో హీట్

ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిలను కేబినెట్‌లోకి తీసుకున్నప్పటి నుంచి వారు ఇష్టారీతిన స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. తాజాగా.. రామస్వామి ఓ సమావేశంలో విచిత్రమైన ప్రకటన చేశారు. ఆయన చేసిన ప్రకటనతో అమెరికా ఉద్యోగులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరినీ తీసేస్తామని ఆయన స్టేట్‌మెంట్ ఇచ్చారు.

Written By:
  • Srinivas
  • , Updated On : November 17, 2024 / 08:40 PM IST

    Trump Cabinet

    Follow us on

    Donald Trump :  అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి కూడ పోటీకి వచ్చారు. కొన్నినెలల పాటు ఆయన కూడా ప్రచారం చేశారు. ఆ తరువాత ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. ట్రంప్‌నకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. రామస్వామికి అమెరికాలో రోవాంట్ సైన్సెస్ అనే బయోటెక్ కంపెనీ ఉంది. ఇటీవల అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన ట్రంప్ వెంటనే రామస్వామిని తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. వివేక్ రామస్వామితోపాటే ఎలన్ మస్క్‌ను కూడా తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. వీరి కోసం కొత్త పదవులను ప్రవేశపెట్టారు. ఎన్నికలకు ముందు వీరు సహకరించడంతో వారికి ట్రంప్ ముందుగానే ప్రయరిటీ ఇచ్చారు.

    ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిలను కేబినెట్‌లోకి తీసుకున్నప్పటి నుంచి వారు ఇష్టారీతిన స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. తాజాగా.. రామస్వామి ఓ సమావేశంలో విచిత్రమైన ప్రకటన చేశారు. ఆయన చేసిన ప్రకటనతో అమెరికా ఉద్యోగులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరినీ తీసేస్తామని ఆయన స్టేట్‌మెంట్ ఇచ్చారు. ట్రంప్ తెచ్చింది ఉలి కాదు రంపం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉలితో అయితే అమెరికాను చెక్కవచ్చు.. రంపంతో అయితే కోసి పడేయవచ్చు అని సంచలన కామెంట్స్ చేశారు. మొత్తంగా ఉద్యోగులను తీసిపడేయడమే అనేది ఆయన ఉద్దేశంగా తెలుస్తోంది.

    రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్.. డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ అనే ఓ పదవిని సృష్టించారు. దానికి ట్రంప్ ఇద్దరిని ఇన్చార్జీలుగా నియమించారు. ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిలకు ఆ బాధ్యతలు అప్పగించారు. అయితే.. వీరు దీని ద్వారా డబ్బులు ఆదా చేస్తారట. అంతేకాదు.. వీరు ఒక్క డాలర్ కూడా జీతం తీసుకోకుండా పనిచేస్తారు. అలాగే.. జీతం తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులను నిరుద్యోగులుగా మార్చడానికి రెడీ అయిపోతున్నారు. లైఫ్‌లో తమకు ఇంకేమీ లేదు అన్నట్లుగా డోజ్‌లో పనిచేసేందుకు ఉద్యోగులు కావాలని ఇప్పటికే మస్క్ ప్రకటించారు. కానీ.. జీతం మాత్రం ఒక్క డాలర్ కూడా ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. ఇంకా పూర్తిస్థాయిలో అధికారం చేపట్టక ముందే ఈ ఇద్దరి నుంచి ఇలాంటి ప్రకటనలు రావడంతో ట్రంప్ పాలనపై అప్పుడే అమెరికన్లలో భయం మొదలైంది. అప్పుడే ట్రంప్ పాలనలో నరకం అంటే ఏం చూపిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. వచ్చే నెలలో వైట్ హౌస్‌లోకి వెళ్లనున్న ట్రంప్.. మొదటి నుంచి భయపెడుతున్నారని అమెరికా ప్రజలు చర్చించుకుంటున్నారు. నిజంగానే ఈ నాలుగేళ్లలో నరకం అంటే చూపిస్తారేమో అన్నట్లుగా భయాందోళన చెందుతున్నారు. వీరి వైఖరి సైతం అమెరికాన్లకు భయం అంటే ఏంటో తెలిసేలా చేసేలా ఉన్నారని టాక్ నడుస్తోంది. కమలా హారిస్‌ను కాదని గెలిపించినందుకు ముందు ముందు ఎలాంటి కష్టాలు వస్తాయోనని అక్కడి ప్రజలు భయపడిపోతున్నారట. అయితే.. వీరిద్దరి ప్రకటనలతో ట్రంప్‌కు సంబంధం ఉన్నదా లేదా అనేది కూడా క్లారిటీ లేదు. ట్రంప్ సూచనల మేరకే వారు ఈ ప్రకటనలు చేస్తున్నారా.. అసలు ఈ విషయం ఆయనకు నోటీసులో ఉన్నదా లేదా అని కూడా తెలియకుండా ఉంది.