https://oktelugu.com/

Pushpa 2 The Rule : బన్నీకి హిందీ రాలా.. బీహార్ లో ఇంగ్లీష్ లోనే ‘జుకేంగా నహీ’.. స్పీచ్ లో తిప్పలు

నా హిందీ కొంచెం తప్పుగా ఉంది ఏమనుకోండి క్షమించండి. నడుస్తుది కదా.. ఇలా ఉన్నా అంటూ ఇంగ్లీషులో స్పీచ్ మొదలు పెట్టారు అల్లు అర్జున్.

Written By:
  • Rocky
  • , Updated On : November 17, 2024 / 08:44 PM IST

    Allu Arjun Pushpa 2 The Rule speech

    Follow us on

    Pushpa 2 The Rule : సినీ ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప-2 ట్రైలర్ విడుదలైంది. 2:45 సెకన్ల నిడివి గల ట్రైలర్ ఇరగదీసింది. ట్రైలర్ మాస్ జనాలకు పునకాలు తెప్పిస్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ యాక్టింగ్ ఇరగదీశాడని ట్రైలర్‌ను చూస్తే అర్ధం అవుతోంది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్ కాదు.. వైల్డ్ ఫైర్ అంటూ ట్రైలర్ చివర్లో వచ్చిన డైలాగ్ హైలెట్‌ అయిపోయింది. ఇక పుష్ప అంటే నేషనల్ కాదు..ఇంటర్నేషనల్ అంటూ చెప్పే డైలాగ్ కూడా ఆకట్టుకుంది. మాస్ ర్యాంపేజ్‌తో ట్రైలర్ అదరగొట్టేసింది. ట్రైలర్‌ అందరినీ ఆకట్టుకునేలా కట్ చేయడంలో సుకుమార్ సక్సెస్ అయ్యారు. ట్రైలర్‌లో లెక్కల మాస్టర్ లెక్కలు కనిపిస్తున్నాయి. మొదటి పార్ట్‌లో చివర్లో కనిపించిన ఫహద్ ఫాసిల్ , రెండో పార్ట్‌లో మాత్రం ఫుల్ లెంగ్త్‌ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. మొదటి పార్ట్‌లో పుష్ప లవర్‌గా కనిపించిన రష్మికా, రెండో పార్ట్‌లో ఆయన భార్యగా కనిపించనున్నారు. ఇక రెండో పార్ట్‌లో జగపతి బాబు రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నారు. సునీల్, అనసూయ, రావు రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దాదాపు రూ. 400 వందల కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

    సినిమా లోకం మొత్తం కూడా పుష్ప-2 సినిమా కోసం అతృతుగా ఎదురు చూస్తోంది. అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప మొదటి పార్ట్ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిన విషయమే. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు నార్త్ ఆడియోన్స్ ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాకు గానూ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ హీరో అవార్డు సైతం దక్కించుకున్నారు. జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా అల్లు అర్జున్ నిలిచారు. బన్నీ తన మ్యానరిజంతో, యాక్టింగ్‌తో పుష్పను పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టేశాడు. నార్త్ ఆడియెన్స్‌కు పుష్ప బాగా ఎక్కేసింది. అందుకే పుష్ప అక్కడ వంద కోట్లు కొల్లగొట్టేసింది. దీంతో ‘పుష్ప-2’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను కంటిన్యూ చేయాలనే నేడు పాట్నలో ట్రైలర్ లాంట్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతే కాకుండా భారీ జనసందోహం నడుమ పుష్ప 2 ది రూల్ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు.

    ఈ క్రమంలో అల్లు అర్జున్ హిందీ బాష రాక ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. అక్కడి వారంతా హిందీ వారే కాబట్టి ఆ భాషలో కాకుండా ఇంగ్లీషులో స్పీచ్ ఇచ్చారు. అది కూడా కొన్ని నిమిషాలే. దీంతో ఎంతో ఆశగా ఆయన స్పీచ్ విందామని వచ్చిన ఆడియెన్స్ నిరుత్సాహానికి గురయినట్లు తెలుస్తోంది. ఇంతకీ కొన్ని నిమిషాలు మాట్లాడిన అల్లు అర్జున్ ఏమన్నారంటే..‘‘ బీహార్ పవిత్ర భూమికి ప్రణామాలు. మొదటి సారి బీహార్ కు వచ్చాను. మీ ప్రేమ, మీ స్వాగతానికి చాలా చాలా కృతజ్నుడను. పుష్ప ఎప్పుడు తలవంచడు(జుకేంగా నహీ).. కానీ ఇప్పుడు మీ కోసం మొదటి సారి తలవంచుతున్నాను. థ్యాంక్యూ.. థ్యాంక్యు పాట్నా.. చాలా ప్రేమను ఇచ్చారు మీరు. థ్యాంక్యూ సో మచ్.. మీరెలా ఉన్నారు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నారా.. ఇప్పుడు వైల్డ్ ఫైర్. నా హిందీ కొంచెం తప్పుగా ఉంది ఏమనుకోండి క్షమించండి. నడుస్తుది కదా.. ఇలా ఉన్నా’’ అంటూ ఇంగ్లీషులో స్పీచ్ మొదలు పెట్టారు అల్లు అర్జున్. మీ ప్రేమ వల్లే ఈ సినిమా మోస్ట్ అవైటెడ్ మూవీగా మారిందన్నారు. ఇది నా ఒక్కడి వల్లే కాదు మీలాంటి ఎంతో మంది వల్ల ఈ సినిమా ప్రస్తుతం ఈ స్థాయిలో హైప్ తెచ్చుకుంది అన్నారు. ఏది ఏమైనా తెలుగులో ఇరగదీసే స్పీచ్ ఇచ్చే అల్లు అర్జున్ హిందీలో మాట్లాడడం రాక స్పీచ్ రెండు నిమిషాలకే ముగించాల్సి వచ్చింది.