Jagamerigina Satyam OTT release: మాస్ మహరాజ్ రవితేజ మేనల్లుడు ఓ సినిమా చేశాడనే విషయం కూడా తెలియదు చాలా మందికి. యంగ్ హీరో పేరు అవినాష్ వర్మ కాగా, అతడు నటించిన చిత్రం ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మంచి రేటింగ్ రాబట్టడం విశేషం..
Also Read: అర్జున్ దాస్.. ఇప్పుడు స్టార్ హీరోలందరూ ఈ విలన్ వెంటపడుతున్నారు…
చిన్న సినిమాలకు పెద్దగా ఆదరణ ఉండదు. సదరు సినిమాలు విడుదలే చాలా కష్టం. విడుదల తేదీలు లభించవు. పెద్ద సినిమాల మధ్య విడుదల చేస్తే ఎవరూ పట్టించుకోరు. పైగా థియేటర్స్ కూడా దొరకవు. అతితక్కువ థియేటర్స్ లో విదులయ్యే చిన్న సినిమాలు, ప్రేక్షకులకు రీచ్ కాకుండానే వెళ్లిపోతాయి. ఇలాంటి చిత్రాలకు ఓటీటీలో మంచి ఆదరణ లభిస్తుంది. ఓటీటీ ప్రేక్షకులకు చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా ఉండదు. కంటెంట్ ఉంటే నెత్తిన పెట్టుకుంటారు. థియేటర్స్ లో పెద్దగా ఆడని చాలా సినిమాలు ఓటీటీలో అదుర్స్ అనిపించాయి.
అలాంటి టాప్ రేటెడ్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఆ చిత్ర హీరో స్వయానా స్టార్ హీరో రవితేజ మేనల్లుడు కావడం విశేషం. రవితేజ మేనల్లుడు అవినాష్ వర్మ జగమెరిగిన సత్యం చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు. ఈ సినిమా ఏప్రిల్ 18న సమ్మర్ కానుకగా విడుదలైంది. తిరుపతి పాలే జగమెరిగిన సత్యం చిత్రానికి దర్శకుడు. అవినాష్ వర్మకు జంటగా ఆద్య రెడ్డి నటించింది. అచ్చ విజయ భాస్కర్ నిర్మించగా, సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.
ఈ సినిమాను పెద్దగా ప్రమోట్ చేయలేదు. రవితేజ సైతం సపోర్ట్ చేసిన దాఖలాలు లేవు. దాంతో ఎప్పుడు థియేటర్స్ లోకి వచ్చిందో కూడా ప్రేక్షకులకు తెలియదు. కానీ ఈ మూవీ 7.5 IMDB రేటింగ్ సొంతం చేసుకోవడం విశేషం. ఓ చిన్న సినిమాకు ఆ స్థాయిలో రేటింగ్ దక్కిందంటే చెప్పుకోదగ్గ విషయమే. జగమెరిగిన సత్యం మూవీ జులై 4 నుండి ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. సన్ నెక్స్ట్ లో ఈ చిత్రం అందుబాటులో ఉంది.
Also Read : రామ్ చరణ్ పెద్ది మూవీలో ఐటమ్ సాంగ్ చేస్తున్న స్టార్ హీరోయిన్…
జగమెరిగిన సత్యం తెలంగాణ నేపథ్యంలో విలేజ్ రొమాంటిక్ లవ్ డ్రామా. ఓ ప్రేమ జంట చుట్టు కథ నడుస్తుంది. వారి లవ్ స్టోరీ ఊరిలోని కొందరి ఆధిపత్యాన్ని ఎలా ప్రశ్నించింది అనేది కథ. కొత్త వాళ్ళు అయినప్పటికీ అవినాష్ వర్మ, ఆద్య రెడ్డి చక్కగా నటించి మెప్పించారు. ఈ సినిమాను ఓటీటీ లో చూసి ఎంజాయ్ చేయండి.
In a village torn by pride and politics, love dares to survive.
Satyam’s story of heartbreak, betrayal, and quiet strength is now yours to witness.
Streaming now on SunNXT.#SunNXT #JagameriginaSathyamOnSunNXT #NowStreamingOnSunNXT #TeluguCinema #RuralLoveStory #EmotionalDrama… pic.twitter.com/6hTlq4xcd0— SUN NXT (@sunnxt) July 4, 2025