Landslide : 2000 మంది సజీవ సమాధి.. ప్రపంచంలో మరో పెను విషాదగీతిక

ఈ విపత్తును పీఎన్‌జీ ఎమర్జెన్సీ అధికారులు పరిశీలిస్తున్నారని, మంగళవారం (మే 28) పార్లమెంటు తిరిగి ప్రారంభం కావడానికి మరాపే రాజధాని పోర్ట్ మోర్స్ బైలో ఉన్నారని,

Written By: NARESH, Updated On : May 27, 2024 10:14 pm

Landslide

Follow us on

Landslide : గత వారం పపువా న్యూగినియాలో భారీ కొండచరియలు విరిగిపడి 2 వేల మందికి పైగా సజీవ సమాధి అయ్యారని అక్కడి ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ప్రమాదకరమైన భూభాగం, సంఘటనా స్థలానికి సాయం అందకపోవడంలో ఆలస్యం కారణంగా ఎక్కువ ప్రాణాలు పోయాయని తెలిపింది. ఐక్యరాజ్యసమితికి సోమవారం (మే 27) విడుదల చేసిన లేఖలో జాతీయ విపత్తు కేంద్రం మృతుల సంఖ్యను 2 వేలకు పెంచింది. కానీ ఆ సంఖ్య 670కి పైగా ఉండొచ్చని ఐక్యరాజ్యసమితి ప్రత్యేక సంస్థ తెలిపింది.

మారుమూల ప్రదేశం, అక్కడ నివసించే ఖచ్చితమైన జనాభా అంచనా వేయకపోవడమే ఈ వ్యత్యాసానికి కారణమని తెలుస్తోంది. పీఎన్‌జీ జన గణన 2000 సంవత్సరంలో జరిగింది. ఇందులో చాలా మంది ప్రజలు మారుమూల పర్వత గ్రామాల్లో నివసిస్తున్నారని ఉంది.

శుక్రవారం (మే 24) తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో దేశంలోని ఉత్తర ప్రాంతంలోని ‘యాంబలి గ్రామం’లో ప్రజలు నిద్రిస్తున్న సమయంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దాదాపు రెండు అంతస్తుల ఎత్తులో శిథిలాల కింద 150కి పైగా ఇళ్లు కూరుకుపోయాయి. భూమి కింద నుంచి అరుపులు వినిపించాయని సహాయక సిబ్బంది స్థానిక మీడియాకు తెలిపారు.

‘నేను నిలబడి ఉన్న శిథిలాల కింద నా కుటుంబ సభ్యుల్లో 18 మంది చిక్కుకున్నారు, గ్రామంలో చాలా మంది కుటుంబ సభ్యులను నేను లెక్కించలేను’ అని స్థానికుడు ఒకరు ఎవిట్ కంబు రాయిటర్స్ తో చెప్పారు. ‘కానీ నేను మృతదేహాలను బయటకు తీయలేను కాబట్టి నిస్సహాయంగా నిల్చున్నాను.’ అని అన్నారు.

కొండచరియలు విరిగిపడి 72 గంటలు దాటినా శిథిలాలను తొలగించేందుకు వాటి కింద కూరుకుపోయిన వారిని ప్రాణాలతో కాపాడేందుకు స్థానికులు ఇప్పటికీ స్పేడ్లు, కర్రలు, చేతులతో శిథిలాలను తొలిగిస్తున్నారు.

మారుమూల ప్రాంతం కారణంగా సాయం చేసేందుకు భారీ యంత్రాలు, సామగ్రి, సిబ్బంది రావడం కష్టం అవుతుంది. సమీపంలోని యుద్ధ సహాయక సిబ్బంది సైనికుల రక్షణతో కాన్వాయ్ లలో ప్రయాణించి రాత్రి సమయంలో సుమారు 60 కిలో మీటర్ల (37 మైళ్ల) దూరంలో ఉన్న ప్రావిన్షియల్ రాజధానికి తిరిగి వెళ్లవలిసి వచ్చింది.

శనివారం 8 మంది మరణించగా.. 30 ఇళ్లు దగ్ధమైనట్లు ఐక్యరాజ్య సమితి ఏజెన్సీ అధికారి తెలిపారు. మొదటి ఎక్స్‌కవేటర్ ఆదివారం అర్థరాత్రి మాత్రమే ఘటనా స్థలానికి చేరుకుందని ఐక్యరాజ్య సమితి అధికారి తెలిపారు. ఇప్పటి వరకు ఆరు మృతదేహాలను వెలికితీసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రదేశంలో పరిమిత విద్యుత్ కారణంగా దేశంలోని ఇతర ప్రాంతాలతో సంబంధాలకు దూరంగా ఉన్నాయి.

ఈ విపత్తును పీఎన్‌జీ ఎమర్జెన్సీ అధికారులు పరిశీలిస్తున్నారని, మంగళవారం (మే 28) పార్లమెంటు తిరిగి ప్రారంభం కావడానికి మరాపే రాజధాని పోర్ట్ మోర్స్ బైలో ఉన్నారని, అక్కడ ఆయన అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటున్నారని ప్రధాని జేమ్స్ మరాపే కార్యాలయం తెలిపింది.

పనులు నిదానంగా సాగుతాయి.
రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకోగలిగినప్పటికీ.. వర్షం, అస్థిరమైన ప్రదేశం, నీరు నివాసితులు రెస్క్యూ బృందాలకు శిథిలాలను తొలగించడం ప్రమాదకరంగా మారుతోందని పీఎన్ జీలోని ఐక్యరాజ్యసమితి మైగ్రేషన్ ఏజెన్సీ మిషన్ చీఫ్ సెర్హాన్ అక్టోప్రాక్ చెప్పారు. మట్టి, శిథిలాలు మళ్లీ మారే ప్రమాదం ఉందని, ప్రజలను ఖాళీ చేయమని అధికారులు ప్రోత్సహిస్తుండడంతో 250కి పైగా ఇళ్లను వదిలేశారని తెలిపారు. 1,250 మందికి పైగా నిరాశ్రయులయ్యారు.