https://oktelugu.com/

Donald Trump: హిందువులకు అండగా.. భారత్‌తో బంధం మరింత బలంగా.. దీపావళి వేడుకల్లో ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు..!

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా నాలుగు రోజులే గడువు ఉంది. ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రచారం కూడా తుది అంకానికి చేరుకుంది. ప్రచారంలో అభ్యర్థులు ఫినిషింగ్‌ టచ్‌ ఇస్తున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 1, 2024 / 11:48 AM IST

    Donald Trump(7)

    Follow us on

    Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో నాలుగు రోజుల్లో(నవంబర్‌ 5న) జరుగనున్నాయి. ఈమేరకు అగ్రరాజ్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. నూతన అధ్యక్షలు ఎవరో తేల్చేందుకు అమెరికా ఓటర్లు కూడా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వారు ఎవరికి ఓటు వేయాలో డిసైడ్‌ అయ్యారు. బ్యాలెట్‌ ద్వారా తీర్పు ఇవ్వబోతున్నారు. ఇలాంటి తరుణంలో అభ్యర్థులు కూడా ప్రచారానికి ఫైనల్‌ టచ్‌ ఇవ్వబోతున్నారు. ఎక్కడ వీక్‌ ఉందో తెలుసుకుని వారిని ఆకట్టుకునేందుకు హామీలు ఇస్తున్నారు. ఈ క్రమంలో భారతీయ అమెరికన్లు కమలా హారిస్‌వైపే ఉన్నారని సర్వే సంస్థలు తెలిపాయి. దీంతో భారతీయ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ట్రంప్‌ దీపావళి వేడుకలను ఉపయోగించుకున్నారు. సోషల్‌ మీడియా వేదికగా హిందువులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంరద్భంగా బంగ్లాదేశ్‌లో ఇటీవల హిందువులపై జరిగిన దాడిని ఖండించారు. తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే భారత్‌తో బంధాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. హిందువలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్, అధ్యక్ష అభ్యర్థి కమలా హారీస్‌ హిందువులను పట్టించుకోలేదని విమర్శించారు.

    మైనారిటీలపై దాడి అనాగరికం..
    బంగ్లాదేశ్‌లోని మైనారిటీలు అయిన హిందువుల, మైనారిటీలపై దాడిని తీవ్రంగా ఖండిచారు. అల్లరి మూకలు హిందువుల ఇళ్లు, దుకానాలు దోపిడీ చేశారని తెలిపారు. దీంతో ఆ దేశంలో భయానక గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయచంలో ఇలాంటి ఘటనలు జరుగలేదని తెలిపారు. అమెరికాతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులను బైడెన్, కమలా హారిస్‌ విస్మరించారని విమర్శించారు. ఇజ్రాయెల్‌ నుంచి మొదలు కుని ఉక్రెయిన్, అమెరికా దక్షిణ సరిహద్దు వరకు విపత్తులు ఉన్నాయని తెలిపారు. తాను అధికారంలోకి వస్తే అమెరికాను మళ్లీ బలంగా తయారు చేసి శాంతి నెలకొల్పుతానని తెలిపారు. రాడికల్‌ లెఫ్ట్‌ నుంచి ఎదురవుతున్న వ్యతిరేక ఎజెండా నుంచి హిందూ అమెరికన్లకు రక్షణ కల్పిస్తానని హామీ ఇచ్చారు. హిందువుల స్వేచ్ఛ కోసం పోరాడుతానని తెలిపారు.

    ఇండియాతో బలమైన బంధం..
    తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇండియాతో బలమైన బంధం ఏర్పటు చేశానని ట్రంప్‌ తెలిపారు. తన స్నేహితుడు మోదీతో బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నామని పేర్కొన్నారు. కమలా గెలిస్తే అధిక పన్నులు, కఠినమైన నిబంధనలు భారత్‌తో బంధాన్ని దెబ్బతీస్తున్నాయని తెలిపారు. భారత్‌–అమెరికా మైత్రిని అతిపెద్ద వ్యాపార వ్యవస్థగా నిర్మిస్తానని వెల్లడించారు. దీపావళి పండుగ చెడుపై మంచి సాధించేలా చేస్తుందని, తనను కూడా కమలా హారిస్‌పై విజయం సాధించేలా చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
    భారత్‌తో సానుకూల వైఖరి..
    బైడెన్‌ 2015 నుంచి 2019 వరకు ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ సమయంలో భారత్‌తో సానుకూలంగా ఉ న్నారు. ట్రంప్‌ హైడీ మోదీ పేరుతో 2019లో టెక్సాస్‌లో, 2020లో మోదీ.. అహ్మదాబాద్‌లో నమస్తే ట్రంప్‌ పేరుతో భారీ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ రెండు సభలకు ఇరు దేశాల నుంచి భారీగా మద్దతు లభించింది. దీంతో ట్రంప్‌ పట్ల భారతీయుల్లో అభిమానం పెరిగింది. ఈ క్రమంలోనే అమెరికాలో భారీ సంఖ్యలో ఉన్న భారతీయ అమెరికన్లను ఆకట్టుకోవడానికి దీపావళి పండుగను ఇలా వినియోగించుకున్నారు. అమెరికాలో ఉన్న అరబ్‌ అమెరికన్లతోపాటు ఇతర దేశాల నుంచి వచ్చి స్థిరపడిన వారిని తమవైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు కష్టపడుతున్నారు.