Donald Trump (1)
Donald Trump: అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు సంచలన నిర్ణయాలతో అమెరికాలోని అక్రమ వలసాదారులను, ప్రపంచ దేశాలను భయపెడుతున్నారు. బాధ్యతలు స్వీకరించిన 24 గంటల్లోనే అక్రమ వలసదారులను తలించాలని నిర్ణయించారు. జన్మతః వచ్చే అమెరికా పౌరసత్వం రద్దు చేశారు. ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం చేశారు. 80 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను ఇంటికి పంపించే ప్రణాళిక సిద్ధం చేశారు. కెనడా, మెక్సికో, చైనాపై సుంకాలు విధించారు. పనామా కెనాల్ కొనేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా సంచల నిర్ణయాలు తీసుకుంటున్నారు. అక్రమ వలసదారులను అయితే ఖైదీల్లా సైనిక విమానాల్లో సొంత దేశాలకు తరలిస్తున్నారు. తాజాగా భారత్ నుంచి అమెరికాకు అక్రమంగా వెళ్లినవారిని గుర్తించారు. వారితో తొలి విమానం భారత్ బయల్దేరింది. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణలో భాగంగా ఈ అక్రమ వలసదారుల తరలింపు జరుగుతోంది. వలసదారులతో విమానం భారత్‌కు బయల్దేరినట్లు అధికారులు వెల్లడించారని రాయిటర్ పేర్కొంది. సీ17 ఎయిర్ క్రాఫ్ట్‌లో వీరిని తరలిస్తున్నట్లు తెలిసింది. భారత్‌కు చేరుకోవడానికి 24 గంటలు పడుతుందని సమాచారం. అయితే ఎంత మందిని తీసుకువస్తున్నారన్న సమాచారం మాత్రం లేదు.
అతిపెద్ద బహిష్కరణ..
అమెరికాలో అతిపెద్ద బహిష్కరణ కొనసాగుతోంది. ఇందులో బాగంగా అక్రమ వలసదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. తొలుత 538 మందిని అరెస్టు చేసి ఆయా దేశాలకు తరలించారు. ఇక ఎల్ పాసో, టెక్సాస్, శాన్‌డియాగో, కాలిఫోర్నియాలో ఉన్న 5 వేల మంది అక్రమ వలసదారులను ఆయా దేశాలకు తరలించేందుకు పెంటగాన్‌లో సైనిక విమానాలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే గటేమాలా, పెరూ, హోండూరస్ తదితర దేశాలకు విమానాల్లో పలువురిని తరలించారు. ఒక్కో వలసదారుడిని తరలించేందుకు అమెరికా భారీగా ఖర్చు చేస్తోది. గతవారం గటెమాలాకు తరలించినందుకు ఒక్కొక్కరిపై 4,675 డాలర్లు ఖర్చు చేసింది.
ట్రంప్ నిర్ణయానికి భారత్ మద్దతు..
ఇక అక్రమ వలసదారుల తరలింపుపై ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి భారత్ మద్దతు తెలిపింది. తాము అక్రమ వలసదారులకు వ్యతిరేకమని స్పష్టం చేసింది. ఈ అంశం అనేక వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉంటుందని పేర్కొంది. వీసా గడువు ముగిసిన, సరైన పత్రాలు లేకుండా భారతీయులు ఎక్కడ ఉన్నా వారిని తిరిగి తీసుకువచ్చేందుకు వీలు కల్పిస్తామని తెలిపింది. ఇదిలా ఉంటే.. అమెరికాలో సరైన పత్రాలు లేకుండా 7,25,00 మంది ఉంటున్నట్లు సమాచారం. వీరిలో 18 వేల మందిని భాతర్‌కు తరలించేందుకు అమెరికా జాబితా రూపొందించిందని సమాచారం. మెక్సికో, సాల్వెడార్ తర్వాత భారతీయులే ఎక్కువగా అక్రమంగా ఉంటున్నారు.
సుంకాల అమలు వాయిదా..
ఇదిలా ఉంటే.. మెక్సికో, కెనడా, చైనాపై విధించిన 25 శాతం సుంకాల అమలు నిర్ణయాన్ని ట్రంప్ నెల రోజులు వాయిదా వేశారు. మరోవైపు మెక్సికో సరిహద్దు వెంట భద్రతను కట్టుదిట్టం చేవారు. ఇదరు దేశాలు 10 వేల మంది భద్రతా బలగాలను సరిహద్దులకు పంపించి మత్తు పదార్థాలు, మనుషుల అక్రమ రవాణాను అడ్డుకుంటామని పేర్కొంది. ఈ నేపథ్యంలో సుంఖాల అమలును నెల రోజులు వాయిదా వేస్తున్నట్లు వైట్‌హౌస్ ప్రకటించింది.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Donald trump effect us flight with 205 migrants to india
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com