Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్(Donald Trump) బాధ్యతలు చేపట్టాక అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటు ప్రపంచ దేశాలు, అటు అమెరికన్లను తన నిర్ణయాలతో బయపెడుతున్నారు. ప్రపంచ దేశాలపై ఇప్పటికే సుంకాలు పెంచుతామని ప్రకటించారు. తాజాగా ట్రావెల్ బ్యాన్‌కు సిద్ధమవుతున్నారు.
Also Read: దొరకని అమెరికా వీసా ..తెచ్చిన లోన్లకు పెరుగుతున్న వడ్డీలు.. తీవ్ర ఇబ్బందుల్లో స్టూడెంట్స్
మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్(Make America Great Again) నినాదంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గొలిచిన రిపబ్లిక్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్. 47వ అధ్యక్షుడిగా జనవరి 20, 2025న బాధ్యతలు చేపట్టారు. ఆయన 2.0 పాలనలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అక్రమ వలసవాదులపై ఉక్కుపాదం మోపుతున్నారు. వేల మందిని స్వదేశాలకు పంపించారు. భారత్‌కు మూడు విమానాలు వచ్చాయి. ఇక సుంకాల రెంట్టింపు చేస్తామన్నారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనాపై 25 శాతం సుంకాలు విధించారు. ఏప్రిల్ 2 నుంచి అన్ని దేశాల దిగుమతులపై సుంకాలు విధించే ప్రతిపాదన సిద్ధం చేశారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నారు. జాతీయ భద్రత, ఇమ్మిగ్రేషన్(Immigration) కఠిన చర్యల్లో భాగంగా దీనిని పరిశీలిస్తున్నారు. ట్రావెల్ బ్యాన్ విధించే 41 దేశాలను మూడు విభాగాలుగా విభజించారు:
రెడ్ లిస్ట్(Red List):
ఈ జాబితాలోని దేశాల నుంచి వీసాలు పూర్తిగా నిషేధించబడతాయి. ఇందులో ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, సిరియా, క్యూబా, నార్త్ కొరియా, పాకిస్తాన్ వంటి దేశాలు ఉన్నాయని తెలుస్తోంది. మొత్తం 10 లేదా 11 దేశాలు ఈ జాబితాలో ఉండవచ్చు.
ఆరెంజ్ లిస్ట్(Orange List):
ఈ దేశాల నుంచి పరిమిత ట్రావెల్ అనుమతించబడుతుంది. ఉదాహరణకు, వ్యాపారవేత్తలకు అనుమతి ఉండవచ్చు కానీ టూరిస్ట్ లేదా ఇమ్మిగ్రంట్ వీసాలు నిషేధించబడతాయి. ఈ జాబితాలో 5 నుండి 10 దేశాలు ఉండవచ్చు, ఉదాహరణకు ఎరిట్రియా, హైతీ వంటివి.
యెల్లో లిస్ట్(Yellow List):
ఈ దేశాలపై పాక్షిక నిషేధం ఉంటుంది, అంటే కొన్ని రకాల వీసాలపై పరిమితులు విధించబడతాయి. ఇందులో పాకిస్తాన్, బెలారస్ వంటి 26 దేశాలు ఉండవచ్చని అంచనా.
బాధ్యతలు చేపట్టిన రోజే సంతకం..
ఈ బ్యాన్ జనవరి 20, 2025న ట్రంప్ సంతకం చేసిన ‘ప్రొటెక్టింగ్ ది యునైటెడ్ స్టేట్స్ ఫ్రమ్ ఫారిన్ టెర్రరిస్ట్స్ అండ్ అదర్‘ అనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కింద రూపొందుతోంది. ఈ ఆర్డర్ జాతీయ భద్రతా బెదిరింపులను గుర్తించి, 60 రోజుల్లో దేశాల జాబితాను సిద్ధం చేయాలని స్టేట్, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగాలను ఆదేశించింది. ఈ చర్యలు ట్రంప్ మొదటి పదవీకాలంలో (2017–2021) విధించిన ట్రావెల్ బ్యాన్‌లను పునరుద్ధరించి విస్తరించినట్లుగా భావిస్తున్నారు, ఆ బ్యాన్‌లు ముస్లిం దేశాలపై ఎక్కువగా కేంద్రీకృతమై ఉండేవి.
ఈ ప్రతిపాదన ఇంకా అధికారికంగా ఆమోదించబడలేదు, జాబితాలోని దేశాలు మారవచ్చని అధికారులు సూచిస్తున్నారు. ఈ బ్యాన్ అమలులోకి వస్తే, విదేశీ విద్యార్థులు, వ్యాపారవేత్తలు, ఇతర ప్రయాణికులపై తీవ్ర ప్రభావం పడవచ్చు, ముఖ్యంగా భారత్‌లోని కొందరు విద్యార్థులు పాకిస్తాన్ వంటి దేశాల ద్వారా ప్రయాణించే సందర్భాల్లో ఈ విషయంపై మరిన్ని వివరాలు అధికారిక ప్రకటన తర్వాత స్పష్టమవుతాయి.
Also Read: ఒక్క ఆర్డర్ తో 41దేశాలకు షాక్ ఇచ్చిన ట్రంప్.. వాళ్లెవరూ అమెరికాలో అడుగు పెట్టలేరు