Donald Trump: అగ్రరాజ్యం అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్.. అనేక సంచలన నిర్ణయాలతో ఇటు అమెరికన్లను.. అటు ప్రపంచ దేశాలను భయపెడుతున్నారు. ఇప్పటికే ఇమ్మిగ్రేషన్(Immigration) కఠినతరం చేశారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. జన్మతః పౌరసత్వం రద్దుచేశారు. తాజాగా సంకాల విధింపుపై దృష్టి పెట్టారు.
Also Read: కేరళ సీపీఎం నయా ఉదారవాద పంథాకి జై కొడుతుందా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) దూకుడైన పాలనతో అభాసుపాలవుతున్నారు. ఇప్పటికే అనేక సంచల నిర్ణయాలతో ఇటు అమెరికన్లను.. అటు ప్రపంచ దేశాలను భయపెడుతున్నారు. ఇప్పటికే ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం చేశారు. జన్మతః అమెరికా పౌరసత్వం(America Citizenship) రద్దు చేశారు. అక్రమ వలసదారులను సొంత దేశాలకు పంపిస్తున్నారు. మరోవైపు కెనడా, మెక్సికో, చైనాపై భారీగా సుంకాలు(Tariff) విధించారు. ఈ సుంకాల అమలు మార్చి 4 నుంచి అమలులోకి వచ్చాయి. కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం, చైనా(Chaina) దిగుమతులపై 20 శాతం సుంకాలు విధించారు. తాజాగా భారత్‌పైనా ప్రతీకారానికి సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో భారత్, చైనా వంటి దేశాలపై ‘ప్రతీకార సుంకాలు‘ (Retaliatory Tariffs) విధించే ప్రణాళికను ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ సుంకాలు ఏప్రిల్ 2, 2025 నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉందని, దీనివల్ల భారత్(India) నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలు రెట్టింపు కానున్నాయి.
అమెరికాపై సుంకాలను కారణంగా చూపి..
అమెరికా స్థానిక పరిశ్రమలను రక్షించడం, వాణిజ్య లోటును తగ్గించడం ఈ చర్య వెనుక ప్రధాన లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. ట్రంప్ ‘అమెరికా ఫస్ట్‘ విధానంలో భాగంగా, భారత్ వంటి దేశాలు అమెరికా వస్తువులపై అధిక సుంకాలు విధిస్తున్నాయని, దానికి ప్రతిగా ఈ చర్యలు తీసుకుంటామని సూచించినట్లు తెలుస్తోంది. భారత్ అమెరికా వస్తువులపై 100% వరకు సుంకాలు విధిస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. దీనికి ప్రతిస్పందనగా అమెరికా కూడా భారత వస్తువులపై సమాన స్థాయిలో లేదా రెట్టింపు సుంకాలు విధిస్తామని ప్రకటించారు. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే టెక్స్‌టైల్స్(Textiles), ఫార్మాస్యూటికల్స్(FarmaSuticals), ఐటీ ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు వంటి రంగాలు ప్రభావితం కావచ్చు. ఈ సుంకాల వల్ల ఈ వస్తువులు అమెరికా మార్కెట్‌లో ఖరీదైనవిగా మారే అవకాశం ఉంది.
గత నేపథ్యం..
గతంలో ట్రంప్ పరిపాలనలో (2018లో) అమెరికా భారత్ స్టీల్, అల్యూమినియంపై సెక్షన్ 232 సుంకాలు విధించింది. దీనికి ప్రతిగా భారత్ 2019లో అమెరికా నుంచి దిగుమతి అయ్యే 28 ఉత్పత్తులపై (ఆపిల్స్, బాదం, వాల్‌నట్స్ వంటివి) ప్రతీకార సుంకాలు విధించింది. 2023లో ఈ సుంకాలను భారత్ ఎత్తివేసినప్పటికీ, ట్రంప్ మళ్లీ ఈ విషయాన్ని తెరపైకి తెచ్చినట్లు కనిపిస్తోంది.
భారత్ స్థానం..
ప్రస్తుతం భారత్–అమెరికా మధ్య వాణిజ్యం 119.71 బిలియన్ డాలర్లుగా ఉంది, ఇందులో భారత్‌కు 35.31 బిలియన్ డాలర్ల వాణిజ్య ఉపరితలం (Trade Surplus) ఉంది. ఈ లోటును ట్రంప్ తగ్గించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలోలాగే, అమెరికా ఈ సుంకాలను అమలు చేస్తే, భారత్ కూడా ప్రతీకార చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీనివల్ల రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం (Trade War) తలెత్తవచ్చు.
Also Read: నాగబాబు ఎమ్మెల్సీ.. కూటమి ఎట్టకేలకు ఫిక్స్!