https://oktelugu.com/

Donald Trump: 25% టారిఫ్‌తో అమెరికా షాక్.. భారత ఆటో పరిశ్రమ ఏం చేయబోతుంది ?

Donald Trump టారిఫ్‌ల కారణంగా కొత్త ఆటో కంపెనీలు అమెరికాలో ఫ్యాక్టరీలు ఏర్పాటు అవుతాయని డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. దీనివల్ల ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని ఆయన అభిప్రాయపడుతున్నారు.

Written By: , Updated On : March 28, 2025 / 07:06 PM IST
Donald Trump (5)

Donald Trump (5)

Follow us on

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆటో రంగానికి ఊహించని షాక్ ఇచ్చాడు. ఇక మీదట దిగుమతి చేసుకునే కార్లపై ఏకంగా 25 శాతం టారిఫ్‌ను విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆటో కంపెనీలు ఈ టారిఫ్ ప్రభావం నుంచి బయటపడేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల టాటా మోటార్స్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ యూనిట్‌తో పాటు భారత్ ఫోర్జ్, సంవర్ధన మదర్సన్, సోనా బీఎల్‌డబ్ల్యూ, రామకృష్ణ ఫోర్జింగ్స్ వంటి కాంపోనెంట్స్ కంపెనీలు కూడా తీవ్రంగా నష్టపోనున్నాయి. పూర్తిగా అసెంబుల్ చేసిన వాహనాలపై ఈ సుంకాలు ఏప్రిల్ 3 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆ తర్వాత సరిగ్గా ఒక నెల తర్వాత అంటే మే 3 నుంచి ఆటో విడిభాగాలను కూడా ఈ జాబితాలో చేర్చనున్నారు. యూరప్ తర్వాత అమెరికా, భారత్‌కు రెండో అతిపెద్ద ఆటో విడిభాగాల ఎగుమతి మార్కెట్. ఇటువలంటి పరిస్థితుల్లో సుమారు 6.79 బిలియన్ డాలర్ల విలువైన కాంపోనెంట్లను ఎగుమతి చేయడం భారత్‌కు పెను సవాల్ గా మారనుంది.

Also Read: ఆడబిడ్డకు ‘‘హింద్‌’’ పేరు పెట్టిన దుబాయ్‌ క్రౌన్‌ ప్రిన్స్‌.. మన హృదయాన్ని సృషించే ప్రకటన!

టారిఫ్‌ల కారణంగా కొత్త ఆటో కంపెనీలు అమెరికాలో ఫ్యాక్టరీలు ఏర్పాటు అవుతాయని డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. దీనివల్ల ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని ఆయన అభిప్రాయపడుతున్నారు. అయితే, ట్రంప్ టారిఫ్‌పై భారతీయ అధికారులు భిన్నంగా స్పందిస్తున్నారు. ఈ విషయంపై ఒక ఆటో కాంపోనెంట్ సంస్థ అధికారి మాట్లాడుతూ ‘ఈ చర్య ఆమోదయోగ్యం కాదు’ అని అన్నారు.

ఒక ఆటో కాంపోనెంట్ సంస్థ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ.. అమెరికాలో ఉత్పత్తి, శ్రమ వ్యయం చాలా ఎక్కువగా ఉన్నందున ఆటో కంపెనీలు 25శాతం సుంకం చెల్లించి దిగుమతి చేసుకోవడాన్ని కొనసాగిస్తాయని తెలిపారు. ఆటో కంపెనీలు 25 శాతం సుంకం చెల్లించి దిగుమతి చేసుకోవడాన్ని కొనసాగిస్తాయన్నారు. దీని అర్థం ఏమిటంటే.. కంపెనీలపై భారం పడితే, ఆ భారాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తాయి.. అంటే అమెరికాలో కార్ల ధరలు పెరుగుతాయి.

దీనికి ముందు అమెరికా భారత్ నుంచి దిగుమతి చేసుకునే ఆటో విడిభాగాలపై సున్నా సుంకం విధించింది. కానీ ఇప్పుడు టారిఫ్‌లు విధించడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం అమెరికాలో స్థానిక ఉత్పత్తిని ప్రోత్సహించడం. అయితే, అమెరికాలో ఉత్పత్తి చేయడం చాలా ఖరీదైన వ్యవహారం. అమెరికాలో విక్రయించే వాహనాల్లో దాదాపు సగం దిగుమతి చేసుకున్నవే. అంతేకాకుండా, అక్కడ అసెంబుల్ చేసిన వాహనాల్లో ఉపయోగించే విడిభాగాల్లో దాదాపు 60% విదేశాల నుంచి వస్తాయి. ఆటో కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రకారం.. 2024ఆర్థిక సంవత్సరంలో భారత్ అమెరికాకు 6.79 బిలియన్ డాలర్ల విలువైన ఆటో కాంపోనెంట్‌లను ఎగుమతి చేసింది. ఇది గతేడాదితో పోలిస్తే 4.5 శాతం ఎక్కువ. వీటిలో దాదాపు 80శాతం ఇంజిన్, ట్రాన్స్‌మిషన్‌కు సంబంధించిన భాగాలు ఉన్నాయి. భారత ఆటో కాంపోనెంట్ రంగం ఆదాయంలో దాదాపు ఐదో వంతు ఎగుమతుల ద్వారానే వస్తుంది.