Viral Wedding
Viral Wedding: ప్రేమించి పెళ్లి చేసుకుందామంటే రకరకాల ఈక్వేషన్లు.. మంచి జీతం.. ఉన్నతమైన ఉద్యోగం ఉన్నప్పటికీ కొంతమందికి పెళ్లిళ్లు కావడం లేదు. దీంతో చాలామంది ఒంటికాయ సొంటి కొమ్ము జీవితాన్ని గడుపుతున్నారు. జిందగీ నా మిలే నా దోబారా అంటూ సింగిల్ గీతాలను ఆలపిస్తున్నారు.. ఒక నివేదిక ప్రకారం మనదేశంలో పెళ్లికాని వారి సంఖ్య వచ్చే ఐదు సంవత్సరాలలో మరింత పెరుగుతుందని తెలుస్తోంది. యువతులు ఒకపటిలాగా తల్లిదండ్రులు చూసిన సంబంధాలను ఓకే చేయడం లేదు. వారు అన్ని విధాలుగా తమకు నచ్చిన సంబంధం అయితేనే తల ఊపుతున్నారు. వంటింటి కుందేలుగా ఉండడానికి ఇష్టపడటం లేదు. అలాగని అత్తామామలకు సపర్యలు చేయడానికి కూడా ఆసక్తి చూపించడం లేదు. మొత్తంగా వారు ఇండిపెండెంట్ లైఫ్ ని కోరుకుంటున్నారు. దీంతో చాలామంది “మగా”నుభావులకు వివాహాలు జరగడం లేదు. అయితే ఇలాంటి పరిస్థితులున్న ఓ యువకుడు ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్నాడు. అది కూడా వేరువేరుగా కాదు.. ఇద్దరినీ ఒకే మండపం వద్ద పెళ్లి చేసుకున్నాడు. ఆహ్వాన పత్రికల్లోనూ ఇద్దరి యువతుల పేర్లను ముద్రించాడు. ఆ పెళ్లి తంతును ఘనంగా జరుపుకున్నాడు.
Also Read: మొత్తం బయటే.. ఇవేం ప్యాంట్స్ రా బాబూ
తెలంగాణ రాష్ట్రంలోని లింగాపూర్ మండలంలో..
తెలంగాణ రాష్ట్రంలోని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం గుమ్మనూరు గ్రామంలో లాల్ దేవి, జల్కర్ దేవి అనే ఇద్దరు అమ్మాయిలను సూర్యదేవ్ అనే యువకుడు ఏకకాలంలో ప్రేమించాడు. ఇద్దరినీ ఇద్దరికీ తెలిసేలాగానే ప్రేమించి పెళ్లికి ఒప్పించాడు. మొదట్లో దీనికి వారిద్దరు ఒప్పుకోకపోయినప్పటికీ.. ఆ తర్వాత సూర్యదేవ్ తమపై చూపించిన ప్రేమకు పొంగిపోయి ఒప్పుకున్నారు. ఆ తర్వాత వారు ముగ్గురు ఒకే మండపం మీద వివాహం చేసుకున్నారు.. వారి ముగ్గురి వివాహానికి మొదట్లో పెద్దలు ఒప్పుకోలేదు. అయితే సూర్యదేవ్ వారిని ఒప్పించాడు.” మేం ముగ్గురం ప్రేమించుకున్నాం.. కలిసి జీవించాలని నిర్ణయించుకున్నాం. దానికి ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా ఒప్పుకున్నారు. మధ్యలో మీకెందుకు అభ్యంతరం. మాకు జీవితం మీద బలమైన భరోసాలు ఉన్నాయి. అవన్నీ కూడా నెరవేర్చుకునే క్రమంలో మేము ముందడుగు వేస్తున్నాం. వీటికి మీ ఆమోదం కావాలి. మమ్మల్ని ఆశీర్వదిస్తారని భావిస్తున్నామని” సూర్యదేవ్ చెప్పడంతో కుటుంబ పెద్దలు ఒప్పుకున్నారు. ఇక ఈ వివాహ తంతుకు గ్రామంలోని బంధువులు భారీగా తరలించారు. మూడు కుటుంబాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. ముందు లాల్ దేవి మెడలో తాళి కట్టిన తర్వాత.. జల్కర్ దేవి మెడలో సూర్యదేవ్ తాళికట్టాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో తెగ సందడి చేస్తున్నాయి.. ఒక పెళ్లికే ఇక్కడ దిక్కు లేకుంటే.. నువ్వు ఏకంగా ఇద్దరు అమ్మాయిలని పెళ్లి చేసుకున్నావ్. నువ్వు గ్రేట్ బ్రో అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్స్ చేస్తున్నారు.