MG
MG: భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో సంచలనం సృష్టించడానికి JSW MG మోటార్ రెడీ అయింది. పూర్తిగా నిర్మించిన యూనిట్ల (CBU) మొదటి సెట్‌ను తీసుకురావడం ద్వారా ఒక కొత్త అధ్యాయానికి తెరతీయనుంది. గతేడాది చైనాకు చెందిన బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ ఎంజీ, తమ కొత్త ఎంజీ సెలక్ట్ కార్యక్రమం కింద పూర్తిగా దిగుమతి చేసుకున్న మోడల్స్ విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇండియాలో ఎంజీ మొదటి సీబీయూ మోడల్ సైబర్‌స్టర్ కాగా, ఆ తర్వాత ఎం9 విడుదల కానుంది.
Also Read: ఒక్కరికే దిక్కులేదంటే ఇద్దరు అమ్మాయిలతోనా.. నువ్వు లక్కీ బ్రో
తాజాగా ఇండియాలో ఈ రెండు ఎలక్ట్రిక్ కార్ల ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఆసక్తిగల వినియోగదారులు రూ.51,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి, ఎంజీ సెలెక్ట్ డీలర్‌షిప్‌లలో లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ బుకింగ్‌ను నమోదు చేసుకోవచ్చు. ఇప్పటివరకు కంపెనీ ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైతో సహా దేశవ్యాప్తంగా 13 ఎంజీ సెలెక్ట్ డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేసింది.
సైబర్‌స్టర్ అత్యాధునిక ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇందులో 10.25-ఇంచుల సెంట్రల్ టచ్‌స్క్రీన్, దాని ఇరువైపులా 7-ఇంచుల డిస్‌ప్లేలు ఉన్నాయి. ఈ కన్వర్టిబుల్ రోడ్‌స్టర్ ప్రీమియం ఫీచర్స్ తో నిండి ఉంది. దీనిలో 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, 6-వే పవర్-అడ్జస్టబుల్ సీట్లు, 4-వే అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్, విలాసవంతమైన లెదర్ అప్హోల్స్ట్రీ, రెండు యూఎస్బీ పోర్ట్‌లు, ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేతో కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ కన్వర్టిబుల్ కారు రూఫ్‌ను కేవలం 15 సెకన్లలో ఓపెన్ చేయవచ్చు, క్లోజ్ చేయవచ్చు.
సేఫ్టీ కోసం సైబర్‌స్టర్ మోడరన్ ADAS టెక్నాలజీతో వస్తుంది. లేన్-కీపింగ్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఎమర్జెన్సీ బ్రేకింగ్, కొలిషన్ అలర్ట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా ప్రయాణికులు భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), బ్లైండ్ స్పాట్ మానిటర్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉన్నాయి. ఇది లగ్జిరీ డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. ఇండియాలో ప్రీమియం ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ అయిన ఎంజీ సైబర్‌స్టర్‌కు డైరెక్ట్ కాంపిటిటేషన్ లేదు. అయినప్పటికీ BMW Z4కి ఎలక్ట్రిక్ ప్రత్యామ్నాయంగా ఇది నిలవనుంది. కియా EV6, BYD సీల్ వంటి ఇతర ఎలక్ట్రిక్ వాహనాలతో కూడా పోటీ పడవచ్చు.
సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ కారు – M9:
ఎ9 విషయానికి వస్తే… ప్రయాణం కోసం లగ్జరీ కోసం రూపొందించారు. M9 క్యాబిన్ అనేక అద్భుతమైన ఫీచర్లతో నిండి ఉంది. రీక్లైనింగ్ ఒట్టోమన్ సీట్లలో టచ్‌స్క్రీన్లు ఉన్నాయి. బటన్ నొక్కగానే తెరుచుకునే డోర్లు దీని ప్రత్యేకత. అంతేకాకుండా ఈ కారులో మసాజ్ కూడా చేసుకోవచ్చు. దీని ఒట్టోమన్ సీట్లలో 8 మసాజ్ మోడ్‌లు ఉన్నాయి. పనోరమిక్ సన్‌రూఫ్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ఉన్నాయి. కారు అన్ని ఫీచర్లను టచ్‌స్క్రీన్ ప్యానెల్ ద్వారా సులభంగా నియంత్రించవచ్చు. అయితే కంపెనీ ఇప్పటివరకు దీని రేంజ్, బ్యాటరీ కెపాసిటీని వెల్లడించలేదు. ఇండియాలో ఇది కియా కార్నివాల్, టయోటా వెల్‌ఫైర్‌లతో పోటీపడుతుంది.