Dubai: విభిన్న సంస్కృతులు, మతాలకు పుట్టినిల్లు భారత దేశం(India). హిందు, ముస్లిం, క్రిస్టియన్‌తోపాటు సిక్, పార్సీ, బుద్టిస్ట్ ఇలా అనేక మతాలతోపాటు కులాలు మన దేశంలో ఉన్నాయి. సొంత మతాలను ఆచరించేవారు 90 శాతానికిపైగా ఉన్నారు. అయితే కొందరు మాత్రం మత మార్పిడితో వివిధ మతాల్లోకి మారారు. ఈ నేపథ్యంలో పేరు కూడా మార్చుకున్నారు. అయితే దుబాయ్(Dubai) రాజు మాత్రం హిందూ పేరు పెట్టుకోవడం ఆశ్చర్యానికి గురిచేసింది.
Also Read: తాగినంత మద్యం.. తిన్నంత తిండి.. DK ట్రీట్ మామూలుగా లేదు..
దుబాయ్.. పూర్తిగా ముస్లిం.. ఇస్తామిక్ దేశం. కానీ, అక్కడ కూడా మత సమారస్యం పాటిస్తారు. వేల మంది భారతీయులు దుబాయ్‌లో ఉపాధి పొందుతున్నారు. కొందరు దుబాయ్ పౌరసత్వం కూడా పొందారు. మతాలు వేరైనా.. అక్కడ మాత్రం మత ఘర్షణలు లేవు. ఇస్లాం(Islam) మతంలో జోక్యం చేసుకోనంత వరకు, ఇస్లాం నిబంధనలు పాటించే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎవరి మతం వారు ఆచరించే స్వేచ్చ ఉంది. అందుకే దుబాయ్ రాజు హిందూ ఆలయ నిర్మాణానికి కూడా అనుమతి ఇచ్చారు. తాజాగా దుబాయ్ దుబాయ్ క్రౌన్ ప్రిన్స్(Croun Prince) షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తన నాల్లో∙సంతానంగా కుమార్తె జన్మించిన సంతోషవార్తను ప్రపంచంతో పంచుకున్నారు. ఈ కుమార్తెకు ‘‘హింద్ బింట్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్’’(Hind bint Gamdan bin) అని నామకరణం చేసినట్లు ఆయన ఇన్‌స్ట్రాగామ్ ద్వారా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు అందరి హృదయాలను తడమగలిగాయి. భారతీయులను తట్టిలేపాయి. షేక్ హమ్దాన్ తన ఇన్‌స్ట్రాగామ్(Instagram) స్టోరీలో, ‘‘ఓ అల్లాహ్.. నా కుమార్తెకు నీ ప్రేమతో నిండిన హదయాన్ని, నిన్ను స్మరించే నాలుకను ప్రసాదించు. ఆమెను నీ వెలుగులో పెంచి, ఆరోగ్యం, శ్రేయస్సు అనే వస్త్రాలను ధరింపచేయి’’ అని భావోద్వేగంతో రాసుకొచ్చారు. ఈ ప్రకటన అతని కుటుంబ ప్రేమను, ఆధ్యాత్మిక విలువలను ప్రతిబింబిస్తోంది.
తల్లిపై గౌరవార్థం..
‘‘హింద్’’ (Hind)అనే పేరు షేక్ హమ్దాన్ తల్లి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ భార్య షేఖా హింద్ బింట్ మక్తూమ్ బిన్ జుమా అల్ మక్తూమ్ గౌరవార్థం పెట్టబడింది. ఈ పేరు అరబిక్ సంస్కృతిలో గొప్ప చరిత్ర, సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ నామకరణం ద్వారా షేక్ హమ్దాన్ తన తల్లి పట్ల గౌరవాన్ని, కుటుంబ వారసత్వం పట్ల గర్వాన్ని చాటుకున్నారు. షేక్ హమ్దాన్ 2008 నుండి దుబాయ్ క్రౌన్ ప్రిన్స్‌గా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉప ప్రధానిగా, రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన దుబాయ్(Dubai)పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ మరియు షేఖా హింద్ దంపతుల రెండో కుమారుడు. 2019లో షేక్ హమ్దాన్ తన బంధువైన షేఖా షేకా బింట్ సయీద్ బిన్ తానీ అల్ మక్తూమ్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇప్పటికే ఇద్దరు కవలలు (రషీద్, షేకా – 2021), ఒక కుమారుడు (మొహమ్మద్ – 2023) ఉన్నారు.
రాజకుటుంబంలో ఆనందం..
ఈ సంతోషకర వార్త దుబాయ్ రాజ కుటుంబంలో ఆనందాన్ని నింపడమే కాక, షేక్ హమ్దాన్ దాదాపు 17 మిలియన్ల ఇన్‌స్ట్రాగామ్ ఫాలోవర్ల నుండి అభినందనల వర్షంతో సామాజిక మాధ్యమాలను ముంచెత్తింది. ‘‘ఫజ్జా’’గా పిలుచుకునే షేక్ హమ్దాన్ తన నాయకత్వం, సామాజిక కార్యక్రమాలతో యూఏఈలో ఎంతో గౌరవాన్ని పొందారు. ‘‘హింద్’’ రాకతో ఆయన కుటుంబం మరింత విస్తరించింది.