Beauty of Arabians : అరేబియన్ల అందం వెనుక ఉన్న రహస్యం ఏంటో మీకు తెలుసా?

అరేబియన్ల అమ్మాయిలు చర్మానికి రహస్య చిట్కాలు పాటిస్తుంటారు. నిజానికి అవే చిట్కాలు మనం కూడా పాటిస్తుంటాం. కానీ మనం ఎందుకు వాళ్లలా ఉండమంటే.. దానికి కారణం పాటించే విధానం. వాళ్లు పాటించే చిట్కాలతో పాటు ఫుడ్‌ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. కాబట్టి మిగతా వాళ్లతో పోలిస్తే వాళ్లు చాలా అందంగా కనిపిస్తారు.

Written By: NARESH, Updated On : August 22, 2024 9:55 pm

Beauty of Arabians

Follow us on

Beauty of Arabians :  అందంగా ఉండటమంటే అమ్మాయిలకు చాలా ఇష్టం. కొంతమంది హెవీగా రెడీ అవుతారు. మరికొందరు చాలా సింపుల్‌గా రెడీ అవుతారు. ఇదంతా పక్కన పెడితే చాలామంది స్కిన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాగే ఎన్నో చిట్కాలు పాటిస్తుంటారు. అయిన వాళ్ల చర్మం అంత కాంతిమంతంగా ఉండదు. అయితే కొన్ని దేశాల అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. మిగతా దేశాల అమ్మాయిలతో పోలిస్తే అరేబియన్ల అమ్మాయిలు చాలా స్పెషల్‌గా కనిపిస్తారు. వీళ్లు ఎందుకు ఇంత స్పెషల్‌గా కనిపిస్తారు. అసలు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు. ఎలాంటి చిట్కాలు పాటిస్తారనే సందేహం చాలామందిలో ఉంది. అరేబియన్ల అమ్మాయిల చర్మం చాలా అందంగా ఉంటుంది. ఇంత అందంగా ఉండే వీళ్ల రహస్య చిట్కాలు ఏంటి? అసలు చర్మం అంత కాంతిమంతంగా ఎలా ఉంటుంది? దీనికి వాళ్లు ఎలాంటి చిట్కాలు పాటిసున్నారో మనం ఈరోజు స్టోరీలో తెలుసుకుందాం.

అరేబియన్ల అమ్మాయిలు చర్మానికి రహస్య చిట్కాలు పాటిస్తుంటారు. నిజానికి అవే చిట్కాలు మనం కూడా పాటిస్తుంటాం. కానీ మనం ఎందుకు వాళ్లలా ఉండమంటే.. దానికి కారణం పాటించే విధానం. వాళ్లు పాటించే చిట్కాలతో పాటు ఫుడ్‌ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. కాబట్టి మిగతా వాళ్లతో పోలిస్తే వాళ్లు చాలా అందంగా కనిపిస్తారు. సాధారణంగా మనం అవకాడోను తినడానికి లేదా సలాడ్స్‌లో వాడుతుంటాం. కానీ అరేబియన్లు వీటిని తినడానికి ఉపయోగించడంతో పాటు చర్మానికి ప్యాక్‌గా కూడా ఉపయోగిస్తారు. అవకాడోను బాగా మెత్తగా చేసి తేన, నిమ్మరసం, కొబ్బరినూనె కలిపి ప్యాక్‌లా తయారు చేస్తారు. ఈ ప్యాక్‌ను చర్మానికి అప్లై చేసి పది నిమిషాలు ఆరాక చల్లని నీటితో శుభ్రం చేసుకుంటారు. ఈ ప్యాక్‌తో పాటు అవకాడో నూనెతో కూడా మసాజ్ చేస్తుంటారు. దీంతో పాటు తేనెను కూడా చర్మానికి అప్లై చేస్తుంటారు. చర్మం పొడిబారకుండా ఉండటాని తేనె బాగా సహాయపడుతుంది. ఈ తేనెలో కీరదోస రసాన్ని కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటారు. దీంతో చర్మం కాంతిమంతంగా మెరుస్తుందని అంటున్నారు.

అరేబియన్లు ఎక్కువగా ఆర్గన్ ఆయిల్ వాడుతుంటారు. జుట్టు, చర్మానికి ఈ ఆయిల్‌ను అప్లై చేసి మర్దన చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల జుట్టు బలంగా ఉంటుంది. అలాగే చర్మం కూడా నిగారిస్తుంది. గుడ్డులోని తెల్ల సొనతో ప్యాక్ తయారు చేసుకుంటారు. తెల్ల సొన చర్మాన్ని బిగుతుగా మారుస్తుందట. వీళ్లు తమ సౌందర్య ఉత్పత్తుల్లో కెఫిర్ పెరుగును ఉపయోగిస్తారు. కెఫిర్ అనే బ్యాక్టీరియాతో చేసిన పెరుగును ఆహారంగా తీసుకుంటారు. దీనివల్ల చర్మం మెరుస్తూ, అందంగా ఉంటుందని వాళ్లు నమ్ముతారు. అలాగే కలబంద గుజ్జులో ఆర్గన్ ఆయిల్, పసుపు కలిపి చర్మానికి ప్యాక్‌లా వేసుకుంటారు. దీంతో చర్మం గ్లోగా మారడంతో పాటు మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. ఈ చిట్కాలు పాటించడం వలనే మిగతా దేశాల అమ్మాయిలతో పోలిస్తే అరేబియన్లు చాలా అందంగా, స్పెషల్‌గా కనిపిస్తుంటారు.