Court Stay Nimish Priya: సినిమాలలో ఏవైనా నేరాలకు పాల్పడిన వారికి ఉరి శిక్షలు విధిస్తుంటారు.. ఒకవేళ చేయని నేరానికి కథానాయకుడు లేదా కథా నాయక పాల్పడితే చివరి క్షణం వరకు కథను నెట్టుకొస్తుంటారు. వారికి ఉరిశిక్ష అమలు చేసే క్రమంలో అప్పటికప్పుడు కీలక నిర్ణయం వెలువడుతుంది. చివరికి ఉరి శిక్ష రద్దు అవుతుంది..యెమెన్ దేశంలో ఉరిశిక్ష కరారైన నిమిషప్రియ విషయంలో కూడా ఇలాంటిదే ఏదైనా అద్భుతం జరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ అలాంటిదేమీ చోటు చేసుకోలేదు.
కేరళ రాష్ట్రానికి చెందిన నిమిషప్రియ ఇక్కడ నర్సింగ్ కోర్స్ చదువుకుంది. ఆ తర్వాత ఉన్నత ఉద్యోగం నిమిత్తం యెమెన్ దేశానికి వెళ్లిపోయింది. అక్కడ ఓ ఆసుపత్రిలో పనిచేస్తోంది. అంతా బాగుంటుందనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా ఆమె ఓ వ్యక్తి మరణానికి కారణం కావలసి వచ్చింది. ఆమె కావాలని చేసిందా? పొరపాటున జరిగిందా? అనే విషయాలను పక్కన పెడితే అక్కడ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఆమె ఆ నేరం చేసిందని పోలీసులు నిరూపించడంలో విజయవంతమయ్యారు. న్యాయ స్థానానికి కూడా కావలసింది సాక్ష్యాలు మాత్రమే కాబట్టి ఆమె ఒక వ్యక్తి మరణానికి కారణమైందని భావిస్తూ.. అక్కడి చట్టాల ప్రకారం మరణ దండన విధించింది.. దీంతో నిమిష ప్రియ రోజులు లెక్క పెట్టాల్సి వచ్చింది.
నిశప్రియను కాపాడేందుకు అనేక వ్యవస్థలు పనిచేయడం మొదలుపెట్టాయి. కేంద్ర ప్రభుత్వం యెమెన్ ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరిపింది. అయినప్పటికీ అవి విజయవంతం కాలేదు. నిమిష ప్రియాను కాపాడేందుకు ఒక యాక్షన్ కౌన్సిల్ కూడా ఏర్పాటు అయింది. దానికి శామ్యూల్ జెరోన్ నాయకత్వం వహిస్తున్నాడు.. అతడు కూడా అనేక దఫాలుగా యెమెన్ ప్రభుత్వంతో చర్చలు జరిపాడు.. చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడాడు. జరిగిన ఘటన బాధాకరమని.. తనవంతుగా పరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని.. క్షమాభిక్ష ప్రసాదిస్తే మిలియన్ డాలర్ల పరిహారాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ అతడు తన సంసిద్ధతను వ్యక్తం చేశాడు. అయితే శామ్యూల్ చేసిన ప్రతిపాదనను చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు ఆమోదించారా? లేదా? అనేది తెలియ రాలేదు.. దీంతో నిమిషప్రియకు ఉరి తప్పదు అనే వార్తలు రావడం మొదలైంది.
న్యాయస్థానం వెలువరించిన తీర్పు ప్రకారం నిమిష ప్రియకు బుధవారం ఉరి శిక్ష అమలు చేయాలి. కానీ ఉరి శిక్షను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు యెమెన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర విదేశాంగ శాఖ జరుపుతున్న చర్చల వల్ల ఉరిశిక్ష వాయిదా పడిందని తెలుస్తోంది.. సోమవారం నిమిషప్రియ ఉరిశిక్ష పై సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయగా.. ఆ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు.. కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ అడిగింది..”ఇప్పటికే చేయాల్సింది మొత్తం చేసేసాం. నిమిష ప్రియ విషయంలో అనేక దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ ముందడుగు పడలేదు. అక్కడ షరియా చట్టాలు అమలవుతుంటాయని” కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే అలా చెప్పిన ఒక్కరోజులోనే కేంద్ర విదేశాంగ శాఖ యెమెన్ ప్రభుత్వంతో నిరంతరం చర్చలు జరపడం వల్ల నిమిషప్రియ ఉరిశిక్ష వాయిదా పడింది.. అయితే ఈ ఉరిశిక్ష వాయిదా పడుతుందా.. లేకుంటే పూర్తిగా రద్దు అవుతుందా అనేది మరికొద్ది రోజుల్లో తేలుతుంది.
#BREAKING | Execution of Indian national Nimisha Priya in Yemen postponed
So far ther has been no agreement on blood money or pardon
Priya was convicted for the 2017 murder of her business partner@sidhant joins @MollyGambhir with the details pic.twitter.com/EtBZRphwsT
— WION (@WIONews) July 15, 2025