Suhas latest news:ఎలాంటి నేపథ్యం లేని నటులు హీరో స్థాయికి వెళ్లడం గొప్ప విషయం. అలాంటి వారిలో సుహాస్ ఒకడు. కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి, హీరోగా సక్సెస్ అయిన సుహాస్(Suhas)… పరిశ్రమ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేశాడు. అద్భుతమైన స్క్రిప్ట్ సెలక్షన్ తో ఔరా అనిపించాడు. విజయాలు అందుకున్నాడు. అయితే సుహాస్ ఈ మధ్య తడబడుతున్నాడు.
Also Read: ఒకటి కాదు.. రెండు కాదు.. ‘50’ ఏళ్లు.. రజినీ మామూలోడు కాదు…
విజయవాడకు చెందిన ఓ సాదాసీదా కుర్రాడైన సుహాస్ ఇండస్ట్రీకి వచ్చాడు. నటుడిగా నిరూపించుకునే క్రమంలో యూట్యూబ్ వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్ చేశాడు. 2018లో ఫస్ట్ టైం సిల్వర్ స్క్రీన్ పై కనిపించే ఛాన్స్ దక్కింది. శర్వానంద్ హీరోగా నటించిన పడి పడి లేచె మనసు చిత్రంలో ఓ పాత్ర చేశాడు. 2019లో సుహాస్ కి నాలుగు చిత్రాల్లో ఛాన్స్ వచ్చింది. మజిలీ, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, డియర్ కామ్రేడ్, ప్రతిరోజూ పండగే చిత్రాల్లో నటించాడు. డియర్ కామ్రేడ్ మినహాయిస్తే మిగతా మూడు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి.
అనూహ్యంగా 2020లో సుహాస్ కి హీరో ఛాన్స్ వచ్చింది. కథ రీత్యా హీరో నల్లగా ఉండాలి. సుహాస్ చక్కగా సరిపోతాడని భావించిన డైరెక్టర్ సందీప్ రాజ్ అవకాశం ఇచ్చాడు. ఓటీటీలో విడుదలైన కలర్ ఫోటో విశేష ఆదరణ పొందింది. హిట్ స్టేటస్ రాబట్టింది. హీరోగా సుహాస్ మొదటి ప్రయత్నం సక్సెస్ అని చెప్పాలి. లీడ్ రోల్స్ చేస్తూనే సుహాస్ సపోర్టింగ్ రోల్స్ చేశాడు. హిట్ 2 చిత్రంలో విలన్ రోల్ చేయడం మరొక సాహసం. ఆ చిత్రంలో ప్రధాన విలన్ గా సుహాస్ కనిపించాడు.
సుహాస్ లీడ్ రోల్స్ చేసిన రైటర్ పద్మభూషణ్, అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ విజయాలు దక్కించుకున్నాయి. సుహాస్ స్క్రిప్ట్ సెలక్షన్ చూసి మిగతా నటులు ఆశ్చర్యపోయారు. చెప్పుకోదగ్గ అందం, ఆహార్యం లేని సుహాస్… మంచి కథలను ఎంచుకుని హిట్స్ కొడుతున్నాడని పలువురు కొనియాడారు. ఈ క్రమంలో సుహాస్ తన రెమ్యూనరేషన్ పెంచాడని, కోట్లలో తీసుకుంటున్నాడని వార్తలు వచ్చాయి.
అయితే ఈ మధ్యకాలంలో సుహాస్ తడబడుతున్నాడు. గ్యాప్ లేకుండా సినిమాలు వదులుతున్నాడు. అవి అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నాయి. సుహాస్ నటించిన ప్రసన్న వదనం, శ్రీరంగ నీతులు, గొర్రె పురాణం, జనక అయితే గనక ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ ఏడాది ఒకే నెలలో సుహాస్ రెండు చిత్రాలు విడుదల చేశాడు. కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పు రంబు నేరుగా ప్రైమ్ లో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ దక్కలేదు. జులై 11న ఓ భామ అయ్యో రామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాను కూడా జనాలు పట్టించుకోలేదు.
Also Read: చీర కట్టులో అనసూయ అందాలు చూడతరమా… గ్లామరస్ యాంకర్ బెస్ట్ శారీ లుక్స్
సుహాస్ వేగంగా సినిమాలు చేసే క్రమంలో స్క్రిప్ట్ సెలక్షన్ మీద పట్టుకోల్పోయాడు అనిపిస్తుంది. ఒకప్పుడు మంచి కథలతో ప్రేక్షకులను మెప్పించిన సుహాస్, నిరాశపరుస్తున్నాడు. బహుశా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని సుహాస్ భావిస్తున్నాడేమో అనిపిస్తుంది. ఫేమ్ ఉన్నప్పుడే చకచకా సినిమాలు చేసి నాలుగు రాళ్లు వెనకేసుకుంటే… సరి అనుకుంటున్నాడేమో కాబోలు. అయితే కెరీర్ సుదీర్ఘంగా సాగాలి అంటే విజయాలు అవసరం. ఇకపై సుహాస్ సమయం తీసుకుని మంచి కథలను ఎంచుకోవాలని ప్రేక్షకులు సలహా ఇస్తున్నారు.