Strange Punishments : తప్పు చేసిన వారికి శిక్ష కచ్చితంగా పడుతుంది. ఏ తప్పుకు ఎలాంటి శిక్ష పడాలనేది న్యాయస్థానం చెబుతుంది. దొంగతనం, హత్యలు, నేరాలు వంటివాటికి శిక్షలు విధిస్తారు కానీ కొన్ని దేశాల్లో మాత్రం నవ్వకపోవడం, చెట్లు ఎక్కడం, కారు కడగక పోయినా కూడా శిక్షలు విధిస్తారట. మరి ఆ దేశాలు ఏంటి? శిక్షలు ఏంటి అనే వివరాలు తెలుసుకుందామా?
ఇటలీలోని మిలన్‌లో ఓ చట్టం అమలులో ఉంది. దాని పేరే హ్యాపీ లా. ఆస్ట్రో హంగేరియన్లు పరిపాలించే సమయంలో మిలనీస్ ప్రజలు నవ్వాలని ఓ రూల్ పెట్టారట. అదే చట్టం ఇప్పటికీ అమలులో ఉంది. దీన్ని ఫాలో అవకపోతే శిక్ష పడుతుందట. ఎవరైన చనిపోతే, హాస్పిటల్ లో ఉంటే, అనారోగ్యం బాగలేకపోతే మాత్రం నవ్వడానికి మినహాయింపు ఉంటుందట.
అభివృద్ది చెందిన దేశాల్లో సింగపూర్ ఒకటి. కానీ ఇక్కడ మాత్రం చూయింగ్ గమ్ అసలు తినకూడదు.. ఇక్కడ షాపుల్లో ఎక్కడా కూడా చూయింగ్ గమ్ కనిపించదు. అమ్మరు. ఎవరైనా తింటే సంవత్సరం పాటు జైలు శిక్ష విధిస్తారు. అయితే ఈ శుభ్రత కోసం అమలులోకి తెచ్చారట.
కెనడాలోని ఒషావా లో చెట్ల కోసం కూడా చట్టాలు ఉన్నాయి. నగరంలో మున్సిపాలిటీ పరిధిలోని చెట్టు ఎక్కినా, వాటికి ఏమైనా తగిలించినా, ఏ విధంగా చెట్లకు హానీ కలిగించినా నేరమని 2008లో చట్టం తీసుకొచ్చారు. చెట్ల విషయంలో చిన్న తప్పు చేసినా శిక్షలు పడతాయి. ఏకంగా చెట్లు కొట్టేస్తే అది పెద్ద నేరం. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి కెనెడియన్ చట్టం ప్రకారం ఫైన్ భారీగా కట్టాల్సి వస్తుందట.
UAE లో చాలా వింత చట్టం అమలులో ఉంది. దుమ్ము పట్టిన కారు కనిపిస్తే చాలు అధికారులు ఫైన్ వేస్తారట. దుమ్ము పట్టినందుకు ఫైన్ కార్ విడిపించుకోవటానికి మరింత ఫైన్ కట్టాలి. ఇక కారును ఎక్కడంటే అక్కడ కడగటానికి వీల్లేదు. నీళ్లను వృథా చేయకూడదు. రోడ్లకు ఎలాంటి నష్టం కలిగించకూడదు. ఇలా ఏం చేసినా కూడా వేరు వేరుగా శిక్షలు పడతాయి.