Jaya Prada: మీ తాత గుద్దుడికి నాకు జ్వరం వచ్చిందన్న స్టార్ హీరోయిన్… మనవడు జూనియర్ హిలేరియస్ సమాధానం!

కథ రీత్యా ఈ సాంగ్ లో ఎన్టీఆర్-జయప్రద ఒకరినొకరు కొట్టుకుంటారు. ఆ సాంగ్ లో ఎన్టీఆర్ కొట్టిన దెబ్బలకు జయప్రదకు మూడు రోజులు జ్వరం వచ్చిందట. ఓ లమ్మీ తిక్కరేగిందా... సాంగ్ లో మీ తాత గుద్దిన గుద్దుడికి నాకు జ్వరం వచ్చిందని జయప్రద జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ తో అన్నారు. ఇదే సాంగ్ యమదొంగ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ రీమిక్స్ చేశాడు. జూనియర్ ఎన్టీఆర్-మమతా మోహన్ దాస్ నటించారు. అమ్మాయి రూపంలో ఉన్న యముడని తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్.. మమతా మోహన్ దాస్ ని వాయించేస్తాడు.

Written By: S Reddy, Updated On : July 7, 2024 5:27 pm

Jaya Prada

Follow us on

Jaya Prada: నందమూరి తారక రామారావు గొప్ప నటుడు. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన హీరోల్లో ఒకరు. వెండితెర ఇలవేల్పుగా కొలవబడిన ఎన్టీఆర్ పై కొన్ని అపవాదులు కూడా ఉన్నాయి. ఎన్టీఆర్ పాటల్లో హీరోయిన్స్ తో మొరటుగా వ్యవహరించేవాడట. ఆయనతో సాంగ్ చేస్తే ఒళ్ళు హూనమైపోతుందని హీరోయిన్స్ భయపడేవారట. టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా ఉన్న ఆయనతో ఆఫర్ వదులుకోలేక హీరోయిన్స్ సినిమాలు చేసేవారట. ఎన్టీఆర్ తో సాంగ్ చేసిన ఓ స్టార్ హీరోయిన్ కి జ్వరం వచ్చిందట. ఈ విషయాన్ని ఆ హీరోయిన్ ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ తో చెప్పడం విశేషం.

ఆ హీరోయిన్ ఎవరో కాదు జయప్రద. ఎన్టీఆర్-జయప్రద కాంబోలో పదుల సంఖ్యలో చిత్రాలు వచ్చాయి. వాటిలో యమగోల ఒకటి. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన యమగోల బ్లాక్ బస్టర్ మూవీ. తాతినేని రామారావు దర్శకత్వం వహించారు. ఈ మూవీలో జయప్రద ఎన్టీఆర్ ప్రేయసి పాత్ర చేసింది. ఎన్టీఆర్-జయప్రద కాంబోలో ‘ఓ లమ్మి తిక్క రేగిందా’ అనే సాంగ్ ఉంటుంది.

కథ రీత్యా ఈ సాంగ్ లో ఎన్టీఆర్-జయప్రద ఒకరినొకరు కొట్టుకుంటారు. ఆ సాంగ్ లో ఎన్టీఆర్ కొట్టిన దెబ్బలకు జయప్రదకు మూడు రోజులు జ్వరం వచ్చిందట. ఓ లమ్మీ తిక్కరేగిందా… సాంగ్ లో మీ తాత గుద్దిన గుద్దుడికి నాకు జ్వరం వచ్చిందని జయప్రద జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ తో అన్నారు. ఇదే సాంగ్ యమదొంగ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ రీమిక్స్ చేశాడు. జూనియర్ ఎన్టీఆర్-మమతా మోహన్ దాస్ నటించారు. అమ్మాయి రూపంలో ఉన్న యముడని తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్.. మమతా మోహన్ దాస్ ని వాయించేస్తాడు.

ఇదే విషయం తెలియజేస్తూ… యమదొంగ మూవీ నాటికి నేను బక్కగా ఉన్నాను. లేదంటే మమతా మోహన్ దాస్ పని కూడా అయిపోయేదని జూనియర్ ఫన్నీగా అన్నారు. జయప్రద హోస్ట్ చేసిన టాక్ షోలో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనగా ఈ డిస్కషన్ వచ్చింది. అయితే ఎన్టీఆర్ తో నటించడం నా అదృష్టం అని జయప్రద చెప్పారు. యమగోల మాదిరి యమదొంగ కూడా సూపర్ హిట్ కొట్టింది. జూనియర్ ఎన్టీఆర్ ని ప్లాప్స్ నుండి బయటపడేసింది…