Zimbabwe vs India : జింబాబ్వేపై అభిషేక్ శర్మ ఊచకోత.. కెరీర్ 2వ మ్యాచ్ లోనే తొలి సెంచరీ

Zimbabwe vs India సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్.. టీమిండియా యువ సంచలనం అభిషేక్ శర్మ తన ఫాంను కొనసాగించాడు. ఐపీఎల్ లో పరుగల వరద పారించి సిక్సర్ల వీరుడిగా పేరుగాంచిన అభిషేక్ శర్మ జింబాబ్వే పర్యటనలోనూ అదే జోరు కొనసాగించాడు. తన తొలి టీ20 మ్యాచ్ లో నిన్న డకౌట్ అయిన అభిషేక్ రెండో టీ20లో మాత్రం జూలు విదిల్చాడు. సెంచరీతో జింబాబ్వే బౌలర్లను ఊచకోత కోశాడు. ఆదివారం హరారేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జింబాబ్వేతో జరిగిన రెండో ఔట్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ 46 బంతుల్లో తన తొలి T20I సెంచరీని సాధించాడు.

Written By: NARESH, Updated On : July 7, 2024 6:20 pm

Abhishek Sharma

Follow us on

Zimbabwe vs India : సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్.. టీమిండియా యువ సంచలనం అభిషేక్ శర్మ తన ఫాంను కొనసాగించాడు. ఐపీఎల్ లో పరుగల వరద పారించి సిక్సర్ల వీరుడిగా పేరుగాంచిన అభిషేక్ శర్మ జింబాబ్వే పర్యటనలోనూ అదే జోరు కొనసాగించాడు. తన తొలి టీ20 మ్యాచ్ లో నిన్న డకౌట్ అయిన అభిషేక్ రెండో టీ20లో మాత్రం జూలు విదిల్చాడు. సెంచరీతో జింబాబ్వే బౌలర్లను ఊచకోత కోశాడు. ఆదివారం హరారేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జింబాబ్వేతో జరిగిన రెండో ఔట్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ 46 బంతుల్లో తన తొలి T20I సెంచరీని సాధించాడు.

మొదట టీమిండియా టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్‌కు బయలుదేరిన అభిషేక్ 33 బంతుల్లో తన అర్ధ సెంచరీని సాధించాడు. అంతకు ముందు కెప్టెన్ శుభ్‌మాన్ గిల్‌ త్వరగా అవుట్ కావడంతో మొదట్లో కాస్తా జాగ్రత్తగా ఆట ప్రారంభించాడు.

శనివారం జరిగిన అరంగేట్ర మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరగడంతో అభిషేక్ తన క్రికెట్ కెరీర్‌కు బాధాకరమైన ప్రారంభాన్ని ఇచ్చినట్టైంది. మొదటి మ్యాచ్ లో భారత్ 13 పరుగుల తేడాతో జింబాబ్వే చేతిలో ఓటమిని చవిచూసింది. ఎంఎస్ ధోని, కేఎల్ రాహుల్ , పృథ్వీ షా తర్వాత టీ20 అరంగేట్రంలో డకౌట్ అయిన నాల్గొవ భారతీయ క్రికెటర్ అభిషేక్ శర్మ కావడం గమనార్హం.

అయితే 2వ టీ20లో మాత్రం అభిషేక్ చెలరేగాడు. రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి విరుచుకుపడ్డాడు. ఆఫ్ స్పిన్నర్ బ్రియాన్ బెన్నెట్‌పై అభిషేక్ డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్‌తో తన ఖాతా తెరిచాడు. ఎనిమిదో ఓవర్లో 24 పరుగుల వద్ద వెల్లింగ్టన్ మసకద్జా చేతిలో ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తర్వాత 11వ ఓవర్‌లో మూడు ఫోర్లు మరియు రెండు సిక్సర్ల సాయంతో 26 పరుగులతో అభిషేక్ చెలరేగాడు.

ఆఫ్ సెంచరీ తర్వాత అభిషేక్ త్వరగా తన స్కోరును రెట్టింపు చేసాడు, అత్యంత వేగంగా T20I సెంచరీ చేసిన భారతీయుడిగా నిలిచాడు. ఐర్లాండ్‌పై తన మూడవ ఇన్నింగ్స్‌లో తన తొలి T20I శతకం సాధించిన దీపక్ హుడాను అధిగమించాడు. మసకద్జా బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాదిన అభిషేక్ ఈ మార్కును చేరుకున్నాడు. తర్వాతి బంతికే బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో క్యాచ్‌తో ఔటయ్యాడు.

అభిషేక్ అరంగేట్రంలో తన రెండవ మ్యాచ్ లోనే తొలి T20I శతకాలు నమోదు చేసిన అత్యంత వేగవంతమైన బ్యాటర్‌ లలో దక్షిణాఫ్రికాకు చెందిన రిచర్డ్ లెవీ , వెస్టిండీస్‌కు చెందిన ఎవిన్ లూయిస్‌లతో సమంగా నిలిచాడు..

అభిషేక్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తరుఫున గత IPL 2024 సీజన్‌ లో పరుగుల వరద పారించాడు. 16 మ్యాచ్‌లలో 204.22 స్ట్రైక్ రేట్‌తో 484 పరుగులు చేశాడు. అతను ఈ సీజన్‌లో 42 సిక్సర్లు కొట్టాడు. టోర్నమెంట్ ఎడిషన్‌లో ఒక భారతీయుడు కొట్టిన అత్యధిక సిక్సర్లు ఈ ఎడిషన్ లోనే కావడం గమనార్హం.

టీ20ల్లో సెంచరీ సాధించిన యువ భారతీయ క్రీడాకారులు వీరే.. పురుషుల T20Iలో సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కులు వీరే

21y 279d – యశస్వి జైస్వాల్ vs నేపాల్, 2023
23y 146d – శుభ్‌మన్ గిల్ vs న్యూజిలాండ్, 2023
23y 156d – సురేష్ రైనా vs సౌతాఫ్రికా, 2010
23y 307d – అభిషేక్ శర్మ vs జింబాబ్వే, 2024