
ప్రపంచ వ్యాప్తంగా కరోనా సృష్టించిన అల్లకల్లోలం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా అగ్రదేశమైన అమెరికాను అస్తవ్యస్తం చేసింది. లక్షలాది కేసులు విస్తరించగా.. అదే స్థాయిలో ప్రజలు ప్రాణాలు వదిలారు. ఆ సంఖ్య ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా అక్కడి ప్రజలు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. సగటున రోజుకు 2500కు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. ఇక దయనీయమైన విషయం ఏంటంటే.. లాస్ ఏంజెల్స్ నగరంలో అయితే.. అంత్యక్రియల కేంద్రాల్లో మృతదేహాల నిల్వకూ చోటు సరిపోవట్లేదట. తమ వల్ల కాదంటూ నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు.
Also Read: రెండు వ్యాక్సిన్లకు డీసీజీఐ అనుమతి.. కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని..!
‘నేను 40 ఏళ్లుగా అంత్యక్రియలకు సంబంధించిన రంగంలో ఉన్నాను. మృతదేహాలను తీసుకొచ్చే కుటుంబాలను.. మేం అంత్యక్రియలు నిర్వహించలేమంటూ వెనక్కి పంపే రోజులు వస్తాయని ఎన్నడూ ఊహించలేదు’ అని స్థానిక కాంటినెంటల్ ప్యునరల్ హోం యజమాని మగ్దా మాల్డొనాడో తెలిపారు. ప్రస్తుతం తమ కేంద్రంలో సగటున రోజుకు 30 డెడ్‌బాడీలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సాధారణ రోజులతో పోలిస్తే ఈ సంఖ్య ఆరు రెట్లు ఎక్కువ అని పేర్కొన్నారు.
Also Read: కరోనా టీకా రాష్ట్రానికి ఎప్పుడొస్తుందంటే?
అయితే.. లాస్ ఏంజెల్స్‌లోని అన్ని అంత్యక్రియల కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. అక్కడి ఆస్పత్రులకు కరోనా బాధితుల వేలాదిగా వస్తున్నారు. రోగులకు సరిపడా ఆక్సిజన్ అందుబాటులో లేదు. లూసియానా, టెక్సాస్ సహా పలు ఇతర రాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ల్యారీ కింగ్ కూడా కరోనా బారిన పడ్డారు. వైరస్ లక్షణాలతో వారం రోజులుగా ఆయన లాస్ ఏంజెల్స్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు
మొత్తంగా మిగితా దేశాల్లో కరోనా క్రమక్రమంగా తగ్గుముఖం పట్టినా.. అగ్రదేశ వైఫల్యంతో అమెరికాలో కంట్రోల్‌లోకి రావడం లేదని తెలుస్తోంది. ఓ వైపు వ్యాక్సిన్ కోసం అహోరాత్రులు శ్రమించినా.. ఇటీవలే పలు వ్యాక్సిన్లకు అనుమతులు వచ్చినా.. ఇంకా ఆ దేశంలో వైరస్‌ను కట్టడి చేయలేకపోతున్నారు. ఇంకా మున్ముందు ఎన్ని మరణాలను చూడాల్సి వస్తుందో తెలియకుండా ఉంది.