https://oktelugu.com/

అన్నదమ్ముల సవాల్.. కోమటిరెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి..!

కోమటిరెడ్డి బ్రదర్స్ చెరోదారిలో వెళుతుండటం కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ ఎంపీగా కొనసాగుతుండగా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. వీరిద్దరు కాంగ్రెస్ రాజకీయాల్లో కొన్నేళ్లుగా యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. అయితే వీరిద్దరి మధ్య గత ఏడాదికాలంగా గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది. నల్గొండ జిల్లాలో ఏ కార్యక్రమం జరిగిన కోమటిరెడ్డి బ్రదర్స్ ముందుండే వాళ్లు. కొంతకాలంగా వీరిద్దరు ఏ కార్యక్రమంలో పాల్గొన్న దాఖలేవు. దీంతో వారి మధ్య గ్యాప్ వచ్చిందనే ప్రచారం […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 4, 2021 / 11:50 AM IST
    Follow us on


    కోమటిరెడ్డి బ్రదర్స్ చెరోదారిలో వెళుతుండటం కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ ఎంపీగా కొనసాగుతుండగా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. వీరిద్దరు కాంగ్రెస్ రాజకీయాల్లో కొన్నేళ్లుగా యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు.

    అయితే వీరిద్దరి మధ్య గత ఏడాదికాలంగా గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది. నల్గొండ జిల్లాలో ఏ కార్యక్రమం జరిగిన కోమటిరెడ్డి బ్రదర్స్ ముందుండే వాళ్లు. కొంతకాలంగా వీరిద్దరు ఏ కార్యక్రమంలో పాల్గొన్న దాఖలేవు. దీంతో వారి మధ్య గ్యాప్ వచ్చిందనే ప్రచారం జరుగుతోంది.

    కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల తిరుపతిలో చేసిన వ్యాఖ్యలు వీరిమధ్య గ్యాప్ వచ్చిందనే మాటలను నిజంచేసేలా ఉన్నాయి. కాంగ్రెస్ లో టీపీసీసీ కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధిష్టానం వద్ద తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు.  టీపీసీసీ రేసులో రేవంత్ తర్వాత వెంకట్ రెడ్డి పేరే ప్రముఖంగా విన్పిస్తోంది.

    రేపోమాపో టీపీసీసీపై ప్రకటన వస్తుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను త్వరలోనే బీజేపీలో చేరుతానంటూ ప్రకటించడం సంచలనంగా మారింది. వెంకట్ రెడ్డికి చెక్ పెట్టేందుకే రాజగోపాల్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? అన్న సందేహాలు కాంగ్రెస్ శ్రేణుల్లో కలుగుతున్నాయి.

    టీపీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్న సమయంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఆయనను తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రస్తుతం పీసీసీ చీఫ్ గా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెరపైకి వస్తున్న తరుణంలో రాజగోపాల్ రెడ్డి ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతుండటంతో వీరిద్దరి మధ్య సయోధ్య లేదని విషయాన్ని తేటతెల్లం చేస్తుంది.

    రేవంత్ వ్యతిరేకంగా సీనియర్లంతా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మద్దతు ఇస్తున్న సమయంలో రాజగోపాల్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు కోమటిరెడ్డికి తలనొప్పిగా మారాయి. సొంత తమ్ముడినే కంట్రోల్ చేయలేనివాడు కాంగ్రెస్ పార్టీని ఎలా నడిపిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. తమ్ముడి విషయాన్ని వెంకట్ రెడ్డి ప్రస్తుతం ఎలా డీల్ చేస్తారనేది ఆసక్తిని రేపుతోంది.