తెలంగాణలోని రైతాంగానికి సీఎం కేసీఆర్ మాటే వేదవాక్కు. ఆయన గీసినగిరి దాటే ప్రయత్నం ఎన్నడూ చేయరు. ఇదేక్రమంలో కేసీఆర్ కూడా వారికి తగిన గుర్తింపునిస్తూనే వస్తున్నాయి. ఈ ఏడాది కేసీఆర్ తెచ్చిన నియంత్రిత సాగు విధానం రైతాంగానికి తీరని నష్టాన్ని.. ఇబ్బందులు తెచ్చిపెట్టింది. దీంతో రైతన్నలు సీఎం కేసీఆర్ పై గుర్రుగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.
సీఎం కేసీఆర్ సైతం తాను కూడా రైతునేనని.. రైతుల కష్టం తనకు తెలుసని పదేపదే చెప్పడం వారికి కనెక్ట్ అయింది. కేసీఆర్ సైతం తన ఫాంహౌజ్ లోని పంటలను పండించడం అందరికీ తెల్సిందే. అల్లం.. ఆలు.. తదితర పంటల ద్వారా కేసీఆర్ ఎకరానికి కోటి రూపాయాల వరకు ఆదాయాన్ని సంపాదిస్తుంటారనే ప్రచారం గతంలో జరిగింది.
సీఎం కేసీఆర్ ఎకరానికి కోటి రూపాయాలను ఆర్జిస్తుంటే.. తెలంగాణ రైతాంగానికి మాత్రం కనీస గిట్టుబాటు ధర కూడా లభించక అల్లాడిపోతున్నారు. దీనికితోడు కేసీఆర్ సర్కార్ ఈసారి అమలు చేసిన నియంత్రిత సాగు విధానం తెలంగాణ రైతాంగానికి తీవ్ర నష్టాన్ని కలిగించినట్లు తెలుస్తోంది.
ప్రతీయేటా మాదిరిగానే ఈసారి రైతన్నలు కేసీఆర్ మాట జై కొట్టి సన్నరకం ధాన్యం పండించారు. కేవలం సీఎం కేసీఆర్ చెప్పడనే కారణంతోనే మెజార్టీ రైతాంగం సన్నరకాన్ని అధికంగా పండించారు. సన్నరకం పండించేందుకు అధిక భారం అయినప్పటికీ ప్రభుత్వం కొనుగోలు చేసి మద్దతు ధర ఇస్తుందనే నమ్మకంతోనే ఖర్చుకు వెనుకడకుండా సాగు చేశారు.
తీరా పంట చేతికొచ్చి కొనుగోళ్ల కోసం మార్కెట్ తీసుకెళ్లక ప్రభుత్వం చేతిలేత్తేసింది. సన్నరకం ధాన్యానికి మద్దతు ధర ఇవ్వకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈసారి కొనుగోళ్లను పరిశీలిస్తే సగం కూడా కొనుగోళ్లు చేయలేదని తెలుస్తోంది. దీనికితోడు వచ్చే ఏడాది నుంచి కొనుగోలు కేంద్రాలను ఎత్తేస్తామని కేసీఆర్ ప్రకటించారు.
దీంతో ఇప్పటి నుంచి ఒక్కొక్కటిగా మూతపడుతున్నారు. ఇదే అదనుగా రైస్ మిల్లర్లు.. మధ్య దళారులు రంగంలోకి దిగి మద్దతు ధర కంటే తక్కువ ధరకు రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. వాస్తవానికి సన్నరకానికి ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ ఉండటంతో కొందరు వ్యాపారులు ఇక్కడికి వచ్చి ప్రభుత్వ మద్దతు ధర కంటే ఎక్కువగా ఇచ్చి కొనుగోళ్లు చేసినట్లు తెలుస్తోంది.
అయితే ప్రభుత్వం కొనుగోళ్లను ఎత్తివేస్తామని ప్రకటించడం వ్యాపారులకు కలిసొచ్చింది. నిన్నటి వరకు పెట్టిన రేటును తగ్గించి కొనుగోళ్లు చేస్తున్నారు. రైతులు సైతం గత్యంతరం లేక వచ్చిన ధరకు ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు.
ప్రభుత్వం వచ్చే ఏడాది నుంచి కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తామంటూ ఇప్పటి నుంచి కొందరు ఎత్తివేస్తుండటంతో రైతులు గ్రామాల్లో ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై సీఎం కేసీఆర్ దృష్టిసారించాలని అన్నదాతలు కోరుతున్నారు. ఇది ఇలానే కొనసాగితే అన్నదాత ఆగ్రహాన్ని కేసీఆర్ చవిచూడాల్సి రావచ్చనే టాక్ విన్పిస్తోంది.