Homeఅంతర్జాతీయంThree Gorges Dam China: దాంతో ఏకంగా భూమి గమనాన్నే మార్చేస్తున్న చైనా.. ఏం ఉప్రదవం...

Three Gorges Dam China: దాంతో ఏకంగా భూమి గమనాన్నే మార్చేస్తున్న చైనా.. ఏం ఉప్రదవం వస్తుందో?

Three Gorges Dam China: చైనా.. ప్రపంచంపై ఆధిపత్యం కోసం ఉవ్విళ్లూరుతోంది. ఆర్థికంగా మూడో పెద్ద దేశమైన చైనా.. అన్ని దేశాలను ప్రభావితం చేసేలా దొడ్డిదారిన ప్రయత్నాలు చేస్తోంది. ఫేక్‌ యాప్స్‌ ద్వారా ఇతర దేశాల రహస్యాలు తెలుసుకుంటోంది. ఆ దేశంలో తయారు చేసే ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో ప్రత్యేక చిప్‌లు, యాప్స్‌ ఉంచి ఎగుమతి చేస్తోంది. లోక్‌ యాప్స్‌ ద్వారా అభివృద్ధి చెందే దేశాల ఆర్థిక వ్యవస్థలను కుప్ప కూల్చాలని చూస్తోంది. ఇక చిన్న దేశాలకు రుణాలు ఇస్తూ ఆ దేశాలను తమ చెప్పు చేతల్లో పెట్టుకుంటోంది. ఈ క్రమంలోనే వియత్నాం, సింగపూర్, తైవాన్, శ్రీలంక, పాకిస్తాన్‌ దేశాలకు ఇప్పటికే ఆర్థికసాయం చేసింది. ఆదేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోంది. ఇలాంటి చైనాలో ప్రపంచంలోనే అతిపెద్దదైన త్రీగోర్జెస్‌ డ్యామ్‌ ఉంది. 2.33 కి.మీ పొడవు, 181 మీటర్ల ఎత్తుతో దీనిని నిర్మించింది. దీంతో యాంగ్లి నదిలో పెద్ద మొత్తంలో నీరు నిల్వ ఉంటోంది. అయితే ఈ డ్యామ్‌తో ఇప్పుడు మానవాళికి ముప్పు పొంచి ఉందని బ్రిటన్‌ శాస్త్రవ్తేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ డ్యామ్‌ కారణంగా భూ పరిభ్రమణ వేగం 0.06 మైక్రె సెకెన్లు తగ్గిపోయిందని తేల్చారు. సూర్యుడి చుట్టూ భూమి దూరం 2 కిలోమీటర్లు జరిగిందని వెల్లడించారు. దీని ప్రభావం ఇంకా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భూమిపై మార్పులతోనే..
భూమిపై భారీగా మార్పులు జరిగితే దాని ప్రభావం భూ గమనంపై పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కూడా ఇదే విషయం పదే పదే చెబుతోంది. 20004లో హిందూ మహా సముద్రంలో భూకంపం సభవించి సునామీ వచ్చింది. దీని ప్రభావంతో భూగమనంలో మారుప వచ్చిందని నాసా తెలిపింది. ఫలితంగా రోజు నిడివి 2.68 మైక్రో సెకన్లు తగ్గిపోయినట్లు గుర్తించింది. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు త్రీ గోర్జెస్‌ డ్యామ్‌ కారణంగా కలుగుతోందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.

డ్యాం పరిస్థితి ఇదీ..
త్రీగోర్జెస్‌ డ్యామ్‌లోకి మూడు నదుల నీరు చేరుతుంది. సుమారు 10 ట్రిలియన్‌ గ్యాలన్ల నీరు డ్యామ్‌లో నిల్వ ఉంటుంది. అంతభారీగా నీరు ఒకేచోట ఉండడంతో భూమిపై ప్రభావం చూపుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతరిక్షం నుంచి సాధారణంగా కంటికి కనిపించే అతి తక్కువ కట్టడాల్లో త్రీగోర్జెస్‌ డ్యామ్‌ ఒకటి. ఈ డ్యామ్‌లో 22,500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. ప్రపంచంలో మూడు అతిపెద్ద అణు విద్యుత్‌ కేంద్రాల ఉత్పత్తికి సమానం. ఈ డ్యామ్‌ నీటి కారణంగా భూమిపై ఒత్తిడి పెరిగి భూకంపాలు సంభవించే అవకాశం ఉందని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం 1994లో ప్రారంభించారు. 2006లో పూర్తి చేశారు. దీని నిర్మాణం కోసం 114 పట్టణాలను, 1,680 గ్రామాలను నేలమట్టం చేసింది. 14 లక్షల మందికి పునరావాసం కల్పించింది. ఇప్పటికీ యాంగ్జీ నదికి వరదలు వచ్చిన ప్రతీసారి లక్షల మంది నిరాశ్రయులవుతున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version