spot_img
Homeఅంతర్జాతీయంChina : చైనాలో ఫ్లయింగ్‌ టాక్సీలు. ఇక ఎగిరిపోవడమే

China : చైనాలో ఫ్లయింగ్‌ టాక్సీలు. ఇక ఎగిరిపోవడమే

China : చైనా తన రవాణా రంగంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. చైనా సివిల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (CAAC) దేశంలోని మొట్టమొదటి స్వయంచాలక ప్యాసింజర్‌ డ్రోన్‌లు లేదా ‘ఫ్లయింగ్‌ టాక్సీల‘(Flying Taxi) వాణిజ్య ఉపయోగానికి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో, చైనా ప్రపంచంలోనే మొదటి స్వయంచాలక ఎలక్ట్రిక్‌ వర్టికల్‌ టేకాఫ్‌ అండ్‌ ల్యాండింగ్‌ (eVTOL) వాహనాల వాణిజ్య సేవలను ప్రారంభించే దిశగా ముందడుగు వేసింది. EHang అనే సంస్థ అభివృద్ధి చేసిన EH216– మోడల్‌కు ఈ ఆమోదం లభించింది.

Also Read : భారత్‌–చైనా సంబంధాల్లో మరో కీలక మలుపు

ప్రత్యేకతలు ఇవీ..
ఈ రెండు సీట్ల ఫ్లయింగ్‌ టాక్సీ పూర్తిగా ఎలక్ట్రిక్‌(Elictric)తో నడుస్తుంది. 16 ప్రొపెల్లర్లతో రూపొందించబడింది. ఇది గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు గరిష్ఠంగా 3 వేల మీటర్ల ఎత్తు వరకు ఎగరగల సామర్థ్యం కలిగి ఉంది. ఈ వాహనం పైలట్‌ లేకుండా స్వయంచాలకంగా నడుస్తుంది, దీనిని ఎయిర్‌ టాక్సీ సేవలు, ఏరియల్‌ టూరిజం, విమానాశ్రయ షటిల్‌లు మరియు ద్వీపాల మధ్య రవాణా కోసం ఉపయోగించాలని EHang యోచిస్తోంది.

2024లోనే మాస్‌ ప్రొడక్షన్‌ సర్టిఫికెట్‌..
ఈ ఫ్లయింగ్‌ టాక్సీలకు 2024లోనే మాస్‌ ప్రొడక్షన్‌ సర్టిఫికేట్‌ లభించింది. 2025 నాటికి వాణిజ్య వినియోగం కోసం పూర్తి అనుమతి లభించింది. చైనా ఈ రంగంలో ‘లో–ఆల్టిట్యూడ్‌ ఎకానమీ‘ని ప్రోత్సహిస్తోంది, ఇది 1,000 మీటర్ల ఎత్తు వరకు వాణిజ్య అవకాశాలను సృష్టించే లక్ష్యంతో పనిచేస్తోంది. ఈ ఆర్థిక వ్యవస్థ 2025 నాటికి 1.5 ట్రిలియన్‌ యువాన్‌ల విలువైనదిగా, 2035 నాటికి 2.5 ట్రిలియన్‌ యువాన్‌ల వరకు విస్తరించవచ్చని అంచనా వేయబడింది.

విప్లవాత్మక మార్పు..
ఈ పరిణామం చైనా టెక్నాలజీ, రవాణా రంగంలో ఒక విప్లవాత్మక మార్పును సూచిస్తుంది. అయితే దీనికి సంబంధించిన నియంత్రణలు, భద్రతా ప్రమాణాలు, బీమా పథకాలను రూపొందించడం ఇంకా కీలక సవాళ్లుగా మిగిలి ఉన్నాయి. చైనా ఈ దిశగా వేగంగా అడుగులు వేస్తుండగా, భారతదేశం వంటి ఇతర దేశాలు ఈ టెక్నాలజీని ఎప్పుడు, ఎలా స్వీకరిస్తాయనేది ఆసక్తికరంగా మారింది

Also Read : అమెరికా ప్రతీకార సుంకాలు.. భారత్‌పై కీలక నిర్ణయం!

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Naga Chaitanya

Naga Chaitanya: పెళ్ళైన రెండేళ్ల తర్వాత నాగచైతన్య సంచలన పోస్ట్.. ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు..

Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య , శోభిత జంట పెళ్లి చేసుకొని అప్పుడే రెండేళ్లు కావొస్తుంది. నిన్న గాక మొన్ననే వీళ్ళు పెళ్లి చేసుకున్నట్టు అనిపిస్తోంది కదూ , కాలం ఎంత వేగంగా...
Hardik Pandya

Hardik Pandya: నిండా మునిగాక హార్దిక్ కు క్రికెట్ గుర్తుకొచ్చింది..

Hardik Pandya: మనం ఎంతటి గొప్ప స్థానాలకు వెళ్లినా సరే దానికి కారణమైన మూలాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు. పైగా దానిని ఏమాత్రం విస్మరించకూడదు. కొమ్ములు వచ్చాయి కదా అని చెవులను విస్మరిస్తే మొదటికే...
Team India

Team India: బంగారు పళ్లెంలో పెట్టి ఇస్తే కిందపడేసుకున్నారు.. ఈ నలుగురి కెరియర్ గోదారిలో కలిసినట్టే..

Team India: టీమిండియాలో చోటు లభించడమే చాలా కష్టం. పైగా ఒక స్థానానికి చాలామంది పోటీ పడుతున్నారు. ఈ ఫార్మాట్ అయినా సరే పోటీ అత్యంత ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో...
AP Rain Forecast

AP Rain Forecast: మళ్లీ నైరుతి.. ఏపీకి చల్లటి కబురు!

AP Rain Forecast: రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. గత ఏడాదికంటే సాధారణ వర్షపాతం తక్కువగానే నమోదయింది.. జూన్లో లోటు కనిపించింది. జూలైలో సైతం కొనసాగింది....
Oktelugu Epaper