Eating : ఒక పనిని కొందరు రకరకాలుగా చేస్తూ ఉంటారు. కొందరు నెమ్మదిగా పనిని పూర్తి చేస్తారు. మరికొందరు ఫాస్ట్ గా చేయాలని అనుకుంటారు. ఈ పద్ధతిని ఆహార విషయంలో కూడా పాటిస్తారు. అయితే పనుల విషయంలో ఇది సరైన పద్ధతే. కానీ ఆహార విషయంలో మాత్రం మార్చి ఉండాలని అంటున్నారు. అంటే ఆహారాన్ని నెమ్మదిగా తినాలని.. పనులు స్పీడ్ గా చేయాలని అంటున్నారు. అలా కాకుండా ఆహారాన్ని స్పీడ్ గా తినడం వల్ల అనేక రకాల రోగాలను ఎదుర్కొంటారని కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అసలు స్పీడ్ గా ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి అనర్ధాలు వస్తాయో ఇప్పుడు చూద్దాం..
Also Read : కొబ్బరి నీళ్లు ఏ సమయంలో తాగుతున్నారు? ఇలా చేస్తే అధిక ప్రయోజనాలు..
ఉద్యోగ బాధ్యతలు, వ్యాపార నిర్వహణ వంటివి కారణంగా నేటి కాలంలో చాలామందికి సమయం ఉండడం లేదు. దీంతో తక్కువ సమయంలోనే అన్ని పనులు చెక్క పెట్టాలని చూసుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి సమయంలో ఆరోగ్యం పై నిర్లక్ష్యం చేస్తారు. అంటే ఆహారం తినే విషయంలో కొన్ని పద్ధతులు పాటించకుండా ఉంటారు. మీ తాత్కాలికంగా బాగానే అనిపించినా.. దీర్ఘకాలంలో అనేక వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
స్పీడ్ గా ఆహారం తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆహారం నమలకుండా వెంటనే తినడం వల్ల శరీరంలోకి వెళ్లిన తర్వాత త్వరగా జీర్ణం కాకుండా ఉంటుంది. ఇది అలాగే ఉండిపోయిన తర్వాత కొంతమంది వెంటనే నీరు తాగుతూ ఉంటారు. ఈ నీటితో ఆహారం మెత్తగా కాకుండా పైకి తేలుతూ ఉంటుంది. ఇలా అది జీర్ణం కాకుండా అలాగే ఉండిపోయి కొవ్వు పేరుకుపోతుంది. అందువల్ల ఆహారాన్ని నోటిలోని మెత్తగా నమిలి ఆ తర్వాత మింగాలి. ఆహారం నమ్మలే సమయంలో నోటిలో లాలాజలం ఉత్పత్తి అవుతుంది. ఈ లాలాజలంతో కలిపి మింగడం వల్ల త్వరగా జీర్ణం అవుతుంది.
నేటి కాలంలో చాలామంది బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ బరువు సమస్యకు ప్రధాన కారణం గబగబా ఆహారాన్ని తినడమేనని అందరూ ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. స్పీడ్ గా ఆహారాన్ని తినడం వల్ల మనం ఎంత తింటున్నామో తెలియకుండా పోతుంది. అంటే ఒక ముద్ద ఆహారం లోపలికి వెళ్లిన తర్వాత మరో ముద్దని రాగానే అది అలాగే పేరుకు పోతుంది. ఈ విషయం మెదడుకు చేరేవరకు సమయం పడుతుంది. ఈ సమయంలో అప్పటికే పరిమితికి మించి ఆహారాన్ని తీసుకుంటారు. ఇది జీర్ణం కావడానికి సమయం పడుతుంది. ఇది జీర్ణం కాకుండానే మరోసారి ఆహారాన్ని తీసుకోవడం వల్ల అలాగే ఉండిపోయి బరువు పెరుగుతారు.
ఆత్రంగా ఆహారం తినడం వల్ల మధుమేహం వ్యాధి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇలాంటివారు తొందరగా ఆహారాన్ని తీసుకోవడం వల్ల చక్కెర నిల్వల స్థాయి పెరిగిపోతుంది. ముఖ్యంగా ఆహారంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుంది. ఇది మితిమీరిపోయి రక్తంలో కలిసిపోతుంది. దీంతో మధుమేహం వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా త్వరగా ఆహారాన్ని తీసుకోవడం వల్ల పేగుల్లో ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. దీంతో ఇవి సమస్యగా మారి కిడ్నీలపై ప్రభావం పడుతుంది.