Today horoscope in telugu : ద్వాదశ రాశులపై బుధవారం కృత్తికా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే రోజు చంద్రుడు రోహిణి నక్షత్రంలో సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా కొన్ని రాశుల వారు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు పొందనున్నారు. మరికొన్ని రాసిన వారు దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి వారికి ఈ రోజు ఖర్చులు పెరిగే అవకాశం. విద్యార్థుల కెరీర్ పైకి ఇలాగ నిర్ణయం తీసుకుంటారు. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యుల మధ్య బంధాలు క్షీణించే అవకాశం ఉంటుంది. అయితే మాటలను అదుపులో ఉంచుకోవడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధించడం కష్టతరం అవుతుంది
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : జీవిత భాగస్వామి ఆరోగ్యం అందరకాలంగా ఉంటుంది. ప్రియమైన వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అయితే మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఆర్థిక పరిస్థితి అనుకున్నంత బాగానే ఉంటుంది. వ్యాపారాలు కొన్ని ప్రణాళికల ద్వారా ఆర్థిక వ్యవహారాలను నిర్వహించాలి. లేకుంటే నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇష్టం లేని కార్యక్రమాల్లో పాల్గొనొద్దు. ఉద్యోగులు ఒత్తిడిని ఎదుర్కొంటారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ప్రియమైన వారితో గందరగోళం వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇంటికి అతిథులు వస్తారు. దీంతో సందడిగా మారుతుంది. బంధువుల నుంచి ప్రోత్సాహకరమైన వాతావరణం వింటారు. విలాసాలకు అధికంగా ఖర్చు చేస్తారు. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. దీంతో మానసికంగా సంతృప్తిగా ఉంటారు. ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని పొందేందుకు మార్గం ఏర్పడుతుంది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉండలు ఉన్నాయి. ఉద్యోగులు కొత్త అవకాశాలను చేజిక్కించుకుంటారు. వ్యాపారులకు ఇబ్బందులు పెట్టే వారి నుంచి బయటపడే మార్గం ఏర్పడుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దల సలహా తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కొత్త వ్యక్తులను కలవడం వల్ల కీలక నిర్ణయం తీసుకుంటారు. సామర్ధ్యాన్ని బట్టి కొన్ని విజయాలను అందిపుచ్చుకుంటారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు మాటలను అదుపులో ఉంచుకోవాలి. కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. స్నేహితుల్లో ఒకరి ప్రవర్తన కారణంగా ఆందోళన చెందుతారు. వైవాహిక జీవితంలో కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగులు కార్యాలయాల్లో ఒకరితో గొడవపడే అవకాశం ఉంటుంది. అయితే ఓపికతో పనులు నిర్వహించుకోవాలి. ప్రయాణాలు చేసేటప్పుడు ఆర్థికంగా జాగ్రత్తలు పాటించాలి. కొత్త వ్యక్తులు కలిసినప్పుడు వారితో సంబంధాలు పెట్టుకోవడం అంత మంచిది కాదు. కుటుంబ విషయాల్లో ఇతరుల జోక్యం చేసుకొని వద్దు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. అనుకోకుండా స్నేహితులతో ప్రయాణాలు చేస్తారు. వ్యాపారులు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. అయితే ఆరోగ్యం ఆందోళన వాతావరణంగా ఉంటుంది. వ్యాపారులు నైపుణ్యాలతో కొత్త పెట్టుబడులు పెడతారు. వి భవిష్యత్తులో లాభాలను తీసుకొస్తాయి. ఉద్యోగులు అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. దీంతో కార్యాలయాల్లో ప్రశంసలు అందుతాయి. అందరికీ జీతం పెరుగుతుంది. సోదరుల మద్దతుతో కొత్తపెట్టబడులు పెడతారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. మానసికంగా ఒత్తిడిని ఎదుర్కొంటారు. నైపుణ్యమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి. తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. ఇంత వ్యాపారాలు అధిక లాభాలు పొందుతారు. సోదరుల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రయాణాల్లో వాయిదా వేసుకోవడమే మంచిది. జీవిత భాగస్వామితో ఉల్లాసంగా ఉంటారు. స్నేహితులతో కలిసివ పార్టీలో పాల్గొంటారు. వ్యాపారుల సమస్యలు ఎదుర్కొంటే ఈరోజుతో పరిష్కారం అవుతాయి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈరోజు కుటుంబంలో గందరగోళాన్ని ఎదుర్కొంటారు. ఆరోగ్యం పై ప్రత్యేకత వహించాలి. ప్రయాణం చేయాలనుకునే వారికి నిరాశ వార్త ఎదురవుతాయి. ఊహించని ఖర్చులు ఉంటాయి. మానసికంగా ఒత్తిడికి ఎదురవుతారు ఏదైనా మాట మాట్లాడే సమయంలో ఓపికతో ఉండాలి. నిజాయితీ తో ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది. ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆదాయ వనరులను పెరుగుతాయి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే అనారోగ్యానికి గురై అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల మద్దతుతో ఉద్యోగులు కొన్ని లక్ష్యాలను పూర్తి చేస్తారు. వ్యాపారులు ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్తారు. ఈ ప్రకారంగా పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు పెరిగిన ఉపశమనం లభిస్తాయి. కుటుంబ సంబంధించిన విషయాలను రహస్యంగా ఉంచాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. ముందుగానే ప్రణాళిక వేసుకొని ఖర్చులు చేయాలి. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ జీవితం ఉద్రిక్తంగా ఉంటుంది. ఆదాయం పెరిగిన ఖర్చులు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నిర్ణయాల వల్ల వీరు ప్రశంసలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) :. ఈ రాజు వారి ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. వీరికి అదనపు ఆదాయం రావడంతో ధనవంతులుగా మారే అవకాశం ఉంది. వ్యాపారులు పెట్టుబడును పెడితే వాటికి అధిక లాభాలు వస్తాయి. ప్రియమైన వారితో ఉల్లాసంగా ఉంటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. సమాజంలో గౌరవం లభిస్తుంది. దీంతో మాటలను అదుపులో ఉంచుకోవాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. ఖర్చులను తగ్గించుకోవడం వల్ల కాస్త ఉపశమనం తగ్గుతుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తులు పరిచయమైతే వారితో ఆర్థిక వ్యవహారాలు జరపొద్దు. ఇంటికి బంధువుల రాకతో సందడిగా ఉంటుంది.