Canada: రెండేళ్ల క్రితం వరకు భారత్(India)కు మంచి మిత్రదేశమైన కెనడా(Canada). ఇప్పుడు రాజకీయ, ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది. రాజకీయంగా కెనడాలో తాత్కాలిక ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం.. కెనడాపై అధికంగా ఉంది. ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. కెనడా కూడా ఆ ప్రయత్నాల్లో ఉంది. ఈ తరుణంలో మరో వార్త కలకలం రేపింది.
Also Read: ట్రంప్ సుంకాలు.. అమెరికన్ ఆర్థిక వ్యవస్థకు ముప్పు.. చైనా ఏఐ వీడియో వైరల్!
ఒట్టావా పోలీసులు కెనడా పార్లమెంట్ భవనంలోకి గుర్తు తెలియని వ్యక్తి అక్రమంగా ప్రవేశించడంతో భవనాన్ని తాత్కాలికంగా మూసివేసినట్లు వెల్లడించారు. శనివారం రాత్రి పార్లమెంట్ హిల్(Parlament Hill)లోని ఈస్ట్ బ్లాక్‌లోకి చొరబడిన ఈ వ్యక్తి రాత్రంతా అక్కడే ఉన్నట్లు తెలిసి అధికారులు అప్రమత్తమయ్యారు. ఆదివారం ఉదయం దుండగుణ్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. అయితే, అతడి వద్ద ఆయుధాలు ఉన్నాయా లేదా అనే విషయంపై స్పష్టత లేదని తెలిపారు. ఈ సంఘటనతో ఒట్టావాలో ఒక్కసారిగా కలకలం రేగింది.
భద్రతా చర్యలు, రోడ్ల మూసివేత
ఈ ఘటన నేపథ్యంలో పార్లమెంట్ భవనం చుట్టూ పోలీసులను భారీగా మోహరించారు. వెల్లింగ్టన్ స్ట్రీట్‌లో బ్యాంక్ స్ట్రీట్(Bank Street) నుండి సస్సెక్స్ డ్రైవ్ వరకు అన్ని రోడ్లను మూసివేశారు. తూర్పు బ్లాక్‌లోని సిబ్బంది అంతా ఒకే గదిలోకి చేరి తాళాలు వేసి Asc
ఆదివారం ఉదయం తాజా సమాచారం ప్రకారం, ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, సహకరించిన ప్రజలకు పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు.
ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అనుమానాలు
కెనడాలో ఏప్రిల్ 28న ముందస్తు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఘటనపై అధికారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ 27న జరగాల్సిన ఎన్నికలను ఆరు నెలల ముందుగానే నిర్వహించేందుకు ప్రధాన మంత్రి మార్క్ కార్నీ పార్లమెంటును రద్దు చేశారు. ఈ కీలక సమయంలో దుండగుడు దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని అపహరించేందుకు ప్రయత్నించి ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.
భద్రతపై ప్రశ్నలు
ఈ సంఘటన కెనడా పార్లమెంట్ భద్రతా వ్యవస్థపై పలు ప్రశ్నలను లేవనెత్తింది. గుర్తు తెలియని వ్యక్తి రాత్రంతా భవనంలో ఉండగలిగిన తీరు అధికారుల దృష్టిని ఆకర్షించింది. దీనిపై పూర్తి విచారణ జరిపి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.