Homeఅంతర్జాతీయంTrump Tariffs: ట్రంప్‌ సుంకాలు.. అమెరికన్‌ ఆర్థిక వ్యవస్థకు ముప్పు.. చైనా ఏఐ వీడియో వైరల్‌!

Trump Tariffs: ట్రంప్‌ సుంకాలు.. అమెరికన్‌ ఆర్థిక వ్యవస్థకు ముప్పు.. చైనా ఏఐ వీడియో వైరల్‌!

Trump Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) అన్నంత పని చేశాడు. ప్రపంచ దేశాలన్నింటిపైనా ప్రతీకార సుంకాలు విధించారు. కొనిన దేశాలపై ఎక్కువగా, కొన్ని దేశాలపై తక్కువగా సుంకాలు ఉన్నాయి. మిత్ర, శత్రు అనే తేడా లేకుండా సుంకాలు అమలు చేస్తున్నారు. అయితే ఈ సంకాల ప్రభావం ప్రపంచ దేశాలతోపాటు ఆ దేశానికి నష్ట కలిగిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read: ట్రంప్‌ టారిఫ్‌ ఎదురుదెబ్బ.. అమెరికన్న హ్యాండ్స్‌ ఆఫ్‌.. ఉలిక్కిపడ్డ అగ్రరాజ్యం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చిన్నా–పెద్ద, మిత్ర–ప్రత్యర్థి దేశాలనే తేడా లేకుండా సుంకాల బాంబును పేల్చారు. ఏప్రిల్‌ 2 అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చాయి. దీంతో ప్రపంచ దేశాల అర్థిక వస్యస్థలు అస్తవ్యస్తమయ్యాయి. స్టాక్‌ మార్కెట్‌(Stack Markets)లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఇదే సమయంలో అమెరికా స్టాక్‌ మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. మరోవైపు ట్రంప్‌ విధానాలపై అమెరికాలో వ్యతిరేకత పెరుగుతోంది. ఈ క్రమంలో శనివారం హ్యాండ్‌ ఆఫ్‌(Hands off) పేరుతో 50 రాష్ట్రాల్లో నిరసన తెలిపారు. ఈ తరుణంలో అమెరికన్‌ వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయని చైనాకు చెందిన సీజీటీఎన్‌ వార్తా సంస్థ వ్యంగ్యంగా ఓ వీడియోను రూపొందించింది. 2 నిమిషాల 45 సెకన్ల నిడివితో ఉన్న ఈ వీడియోలో, ట్రంప్‌ పాలనలో ప్రకటించిన ’లిబరేషన్‌ డే’ అనేది అమెరికన్ల జీతాలను తగ్గించి, ఖర్చులను పెంచే రోజుగా చిత్రీకరించింది.

అల్పాదాయ కుటుంబాలపై ప్రభావం..
అల్పాదాయ కుటుంబాలపై ఈ సుంకాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, స్టాక్‌ మార్కెట్లు ఇప్పటికే దెబ్బతిన్నాయని గుర్తుచేసింది. నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలు, ఆటోమొబైల్‌(Auto Mobile) ఉత్పత్తుల ధరలు ఆకాశాన్నంటడంతో వినియోగదారులు నానా ఇబ్బందులు పడుతున్నారని వివరించింది. ఇదే సమయంలో, మరో మీడియా సంస్థ విడుదల చేసిన వీడియోలో ఈ సుంకాలను ఒక ఏఐ రోబో ’టారిఫ్‌’గా పేర్కొంది. వాణిజ్య యుద్ధం, ఆర్థిక అశాంతికి దారితీసే ఈ అధిక సుంకాలను తట్టుకోలేక, ఆ రోబో(Robo) తనను తాను నిర్వీర్యం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వ్యంగ్యంగా చూపించింది.

అన్ని దేశాలపై సుంకాలు..
ఈ సుంకాలు కేవలం చైనా(China)పైనే కాకుండా, భారత్‌తో సహా పలు దేశాలపైనా పరస్పరంగా విధించడం గమనార్హం. దీంతో అమెరికాలో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థ నిరుద్యోగ సమస్య, ద్రవ్యోల్బణంతో సతమతమవుతోంది. ఈ సుంకాలు ఆర్థిక మాంద్యం వైపు దారితీసే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దిగుమతి సరుకులపై సుంకాలు పెరగడంతో స్థానిక ఉత్పత్తిదారులు కూడా ధరలను పెంచే పరిస్థితి ఏర్పడింది. ఇది సామాన్య ప్రజల జీవన వ్యయాన్ని మరింత భారీగా మార్చనుంది. అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా ప్రతిష్ట కూడా దెబ్బతినే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్‌ ఈ చర్యలను దేశ ఆర్థిక పునరుద్ధరణకు ఉద్దేశించినట్లు చెప్పినప్పటికీ, వాస్తవంలో ఇది అమెరికన్‌ పౌరులకు(American Public) శాపంగా మారుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular