Canada : అమెరికా, కెనడా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. బైడెన్‌తో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(Jastin Trudo)లక్ష్యంగా అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) పావులు కదుపుతున్నాడు. బైడెన్–ట్రూడో కలిసి భారత్‌ను కూడా టార్గెట్ చేశారు. కెనడాలో ఖలిస్థానీ(Khalisthani) ఉగ్రవాది హత్యతో భారత్‌కు సంబంధాలు అంటగట్టి భారత్ ప్రతిష్ట దెబ్బతీసే ప్రయత్నాలు చేశారు. ఇంతలో అమెరికాలో ప్రభుత్వం మారడంతో ఇప్పుడు కెనడాకు కష్టాలు మొదలయ్యాయి. కెనడా నుంచి అక్రమ వలసలపై ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నారు. కెనడా దిగుమతులపై సుంకాలు పెంచారు. ఈ తరుణంలో కెనడా ప్రతిపక్ష ఎన్డీపీ(నేషనల్ డెమోక్రటిక్ పార్టీ)నేత, ఖలిస్థానీ సానుభూతిపరుడు జగ్మీత్‌సింగ్(Jagmeth singh) అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను నేరస్థుడిగా ప్రకటించారు. ఆయనను జీ–7 దేశాల సదస్సు కోసం కెనడాలో అడుగు పెట్టనీయకుండా బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ట్రంప్‌పై గతంలోనే నేర నిర్ధారణ జరిగిన అంశం, ప్రపంచ దేశాలకు ఆయన బెదింరుపులను ఇందుకు ఓ కారణంగా పేర్కొన్నారు. కెనడాలోని మాట్రియాల్ కౌన్సిల్ ఆన్ ఫారెన్ రిలేషన్స్ సమావేశంలో జగ్మీత్ సింగ్ మాట్లాడారు.
Also Read : కెనడాలో కీలక పరిణామాలు… రాజీనామా యోజనలో ప్రధాని ట్రూడో? అసలేమైందంటే?
జీ–7 దేశాలకు పిలవొద్దని వినతి..
కెనడాలో నిర్వహించే జీ–7 దేశాల సదస్సుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను పిలవొద్దని జగ్మీత్‌సింగ్ కోరారు. నేర నిర్ధారణ జరిగిన వ్యక్తిని కెనడాలోకి ఎందుకు రానివ్వాలని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యానికి, సార్వభౌమత్వానికి ముప్పుగా మారి, మన ఆర్థిక వ్యవస్థను, మిత్రులను, ప్రపంచాన్ని బెదిరిస్తున్న వ్యక్తిపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. ట్రంప్ రాకుండా ఎలా అడ్డుకోవాలో చూడాలన్నారు. ప్రభుత్వం కూడా ట్రంప్‌ను ఆపేందుక జీ–7 వేదికను వాడుకోవాలని కోరారు. ట్రంప్‌ను అడ్డుకునేందుకు మెక్సికో(Mexico), న్యూజిలాండ్(Newziland), ఆస్ట్రేలియా(Australia) వంటి దేశాలతో జట్టు కట్టాలని సూచించారు.
సైన్యం బలోపేతానికి మద్దతు..
ఇదిలా ఉంటే కెనడా సైన్యం బలోపేతానికి ప్రతిపక్ష ఎన్డీపీ(NDP) మద్దతు ఇస్తుందని జగ్మీత్‌సింగ్ స్పష్టం చేశారు. అయితే సింగ్ 6పకటపై ఇప్పటి వరకు కెనడా ప్రభుత్వం స్పందించలేదు. ప్రధాని కార్యాలయ ప్రతినిధి సైమన్ లాపార్చ్యూ స్పందించారు. సింగ్ వ్యాఖ్యలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని ప్రకటించారు. ఆ దేశ ఇంధన శాఖ మంత్రి జోనాథన్ విల్కిన్సన్ మాట్లాడుతూ జగ్మీత్ ప్రతిపాదనకు అంత ప్రాధాన్యం లేదన్నారు. ట్రంప్ వ్యాఖ్యలు సింగ్‌కు కోపం తెప్పించాయని, కానీ, అందరినీ కలుపుకుపోవాల్సి ఉంటుందని గుర్తు చేశారు. ఇదిలా ఉంటే జూన్ 15 నుంచి 17 వరకు అల్బర్జాలో జీ7 సమావేశాలు జరుగనున్నాయి.