Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » World » Canada indian student tragedy

Canada: మిస్ ఫైర్.. కెనడాలో భారతీయ విద్యార్థినిని వెంటాడిన విషాదం

Canada విదేశాల్లో భారతీయుల మరణ మృదంగం కొనసాగుతోంది. కొందరు ఆత్మహత్య చేసుకుంటుండగా, మరికొందరు ప్రమాదాల్లో మృతిచెందుతున్నారు. ఇంకొందరు.. అక్కడి దాడుల్లో మృత్యువాతపడుతున్నారు. తాజాగా కెనడాల్లో భారతీయ విద్యార్థినిపై తూటా పేలింది.

Written By:Ashish D, Updated On : April 19, 2025 / 02:38 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Canada Indian Student Tragedy

Canada (3)

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Canada: కెనడా(Canada)లోని హామిల్టన్‌లో జరిగిన దారుణ సంఘటనలో భారతీయ విద్యార్థిని హర్సిమ్రత్‌ రంధవా(21) అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయింది. బస్టాప్‌ వద్ద బస్సు కోసం ఎదురుచూస్తున్న సమయంలో, రెండు వాహనాల మధ్య జరిగిన కాల్పుల్లో లక్ష్యం తప్పిన తూటా ఆమె ఛాతీలో దిగడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటన భారతీయ విద్యార్థి సమాజంలో గుండెలను కలిచివేసింది, అంతర్జాతీయ విద్యార్థుల భద్రతపై స్థానికంగా తీవ్ర చర్చలను రేకెత్తించింది.

Also Read: విద్యా రుణాలపై ట్రంప్‌ ఎఫెక్ట్‌.. వ్యాపారంలో ఒడిదుడుకులు!

బస్టాప్‌ వద్ద అనూహ్య ఘటన..
ఏప్రిల్‌ 17, 2025 సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో, హామిల్టన్‌(Hamiltan)లోని అప్పర్‌ జేమ్స్‌ స్ట్రీట్‌ మరియు సౌత్‌ బెండ్‌ రోడ్‌ సమీపంలో ఈ ఘటన జరిగింది. మోహాక్‌ కాలేజీలో ఆక్యుపేషనల్‌ థెరపీ అసిస్టెంట్‌/ఫిజియోథెరపీ అసిస్టెంట్‌ కోర్సు చదువుతున్న హర్సిమ్రత్‌ రంధవా, పార్ట్‌–టైమ్‌ ఉద్యోగానికి వెళ్లేందుకు బస్టాప్‌(Bus Stop) వద్ద నిలబడి ఉంది. ఈ సమయంలో, సమీపంలోని రెండు వాహనాలు ఒక బ్లాక్‌ మెర్సిడెస్‌ SUV, ఒక వైట్‌ సెడాన్‌ మధ్య జరిగిన కాల్పుల్లో లక్ష్యం తప్పిన ఒక తూటా ఆమె ఛాతీలో దిగింది. సమాచారం అందుకున్న హామిల్టన్‌ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే, తీవ్ర రక్తస్రావం కారణంగా ఆమె ఆస్పత్రికి చేరేలోపే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

హోమిసైడ్‌ దర్యాప్తు..
హామిల్టన్‌ పోలీసులు ఈ ఘటనను హోమిసైడ్‌గా వర్గీకరించి, తీవ్రస్థాయిలో దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా, బ్లాక్‌ మెర్సిడెస్‌ ్ఖVలోని ఒక వ్యక్తి వైట్‌ సెడాన్‌లోని వ్యక్తులపై కాల్పులు జరిపినట్లు గుర్తించారు. కాల్పుల అనంతరం, వైట్‌ సెడాన్‌ అప్పర్‌ జేమ్స్‌ స్ట్రీట్‌ దిశగా, మెర్సిడెస్‌ SUV సౌత్‌ బెండ్‌ రోడ్‌ దిశగా పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో విడుదలైన తూటాలు సమీపంలోని అలెన్‌బై అవెన్యూలో ఒక ఇంటి వెనుక కిటికీని ఛిద్రం చేశాయి, అయితే అదృష్టవశాత్తూ ఇంట్లో ఎవరికీ గాయాలు కాలేదు. ఏప్రిల్‌ 17 సాయంత్రం 7:15 నుంచి 7:45 గంటల మధ్య సంఘటనా స్థలం సమీపంలో డాష్‌క్యామ్‌ లేదా సెక్యూరిటీ కెమెరా ఫుటేజీ ఉన్నవారు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

భారతీయ కాన్సులేట్‌ స్పందన..
టొరంటో(Toranto)లోని భారతీయ కాన్సులేట్‌ జనరల్‌ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ‘‘హామిల్టన్‌లో భారతీయ విద్యార్థిని హర్సిమ్రత్‌ రంధవా దుర్మరణం మమ్మల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. స్థానిక పోలీసుల ప్రకారం, ఆమె రెండు వాహనాల మధ్య జరిగిన కాల్పుల్లో లక్ష్యం తప్పిన తూటాకు అమాయక బాధితురాలైంది. మేము ఆమె కుటుంబంతో సంప్రదింపుల్లో ఉన్నాము, అవసరమైన అన్ని సహాయాలను అందిస్తున్నాము,’’ అని ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. మోహాక్‌ కాలేజీ కూడా హర్సిమ్రత్‌ మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆమె కుటుంబం, స్నేహితులకు మద్దతు అందిస్తామని ప్రకటించింది.

విద్యార్థుల భద్రతపై ఆందోళనలు
ఈ ఘటన కెనడాలో అంతర్జాతీయ విద్యార్థుల భద్రతపై తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది. గత నాలుగు నెలల్లో కెనడాలో నాలుగు భారతీయ విద్యార్థుల మరణ ఘటనలు నమోదయ్యాయని, ఇది భారతీయ సమాజంలో భయాందోళనలను కలిగిస్తోందని నివేదికలు పేర్కొన్నాయి. 2023 చివరి నాటికి కెనడాలో ఒక మిలియన్‌ అంతర్జాతీయ విద్యార్థులు ఉన్నారని, వీరిలో 41% భారతీయులేనని కెనడియన్‌ బ్యూరో ఫర్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌(Canadian Buro For International Education) తెలిపింది. ఈ ఘటన హామిల్టన్‌ సమాజంలో గన్‌ వైలెన్స్, గ్యాంగ్‌ సంబంధిత కార్యకలాపాలపై చర్చను రేకెత్తించింది.

కుటుంబానికి సంఘీభావం..
హర్సిమ్రత్‌ రంధవా మరణం ఆమె కుటుంబం, స్నేహితులతోపాటు మోహాక్‌ కాలేజీ సమాజాన్ని కలిచివేసింది. భారతీయ కాన్సులేట్‌ ఆమె కుటుంబానికి అన్ని రకాల సహాయం అందిస్తున్నప్పటికీ, ఈ విషాదం నుంచి కోలుకోవడం సవాలుతో కూడుకున్నది. కెనడాలో అంతర్జాతీయ విద్యార్థుల భద్రతను మెరుగుపరచడానికి, గన్‌ వైలెన్స్‌ను అరికట్టడానికి కఠిన చర్యలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఘటన కెనడా ప్రభుత్వం, విద్యాసంస్థలు విద్యార్థుల భద్రతకు మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని హైలైట్‌ చేసింది.

 

Also Read: ఆధునిక అరేంజ్డ్‌ మ్యారేజ్‌.. పే స్లిప్‌ నుంచి హెచ్‌ఐవీ టెస్ట్‌ వరకు.. కొత్త డిమాండ్లు

Ashish D

Ashish D Author - OkTelugu

Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Read More

Web Title: Canada indian student tragedy

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • amiltan
  • canada
  • Harsimrat Randhawa
Follow OkTelugu on WhatsApp

Related News

Canada elections 2025 : కెనడా ఎన్నికల్ని తారుమారు చేసిన ట్రంప్ ప్రకటనలు

Canada elections 2025 : కెనడా ఎన్నికల్ని తారుమారు చేసిన ట్రంప్ ప్రకటనలు

Canada: మిస్ ఫైర్.. కెనడాలో భారతీయ విద్యార్థినిని వెంటాడిన విషాదం

Canada: మిస్ ఫైర్.. కెనడాలో భారతీయ విద్యార్థినిని వెంటాడిన విషాదం

Justin Trudeau: ట్రంప్ దెబ్బకు మీడియా ముందు బోరుమని ఏడ్చేసిన కెనడా ప్రధాని.. వైరల్ వీడియో

Justin Trudeau: ట్రంప్ దెబ్బకు మీడియా ముందు బోరుమని ఏడ్చేసిన కెనడా ప్రధాని.. వైరల్ వీడియో

Trade war : అమెరికాపై ప్రతీకారం.. అగ్రరాజ్యం ఉత్పత్తులపై సుంకాలు!

Trade war : అమెరికాపై ప్రతీకారం.. అగ్రరాజ్యం ఉత్పత్తులపై సుంకాలు!

Canada : ట్రంప్‌ ఓ నేరస్థుడు.. కెనడాలో అడుగు పెట్టనివ్వొద్దు.. ఖలిస్థానీ సానుభూతిపరుడి హెచ్చరిక!

Canada : ట్రంప్‌ ఓ నేరస్థుడు.. కెనడాలో అడుగు పెట్టనివ్వొద్దు.. ఖలిస్థానీ సానుభూతిపరుడి హెచ్చరిక!

Trump : ట్రంప్ రాకతో చకచకా మారుతున్న ప్రపంచ రాజకీయాలు

Trump : ట్రంప్ రాకతో చకచకా మారుతున్న ప్రపంచ రాజకీయాలు

Delta Airline crash : విమానం తలక్రిందులుగా ల్యాండ్ అయినా  ప్రయాణికులు ఎలా బతికారు ?

Delta Airline crash : విమానం తలక్రిందులుగా ల్యాండ్ అయినా ప్రయాణికులు ఎలా బతికారు ?

Donald Trump : బైడెన్ కు భారీ షాక్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్.. ఆ అనుమతులు రద్దు చేస్తూ ఉత్తర్వులు

Donald Trump : బైడెన్ కు భారీ షాక్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్.. ఆ అనుమతులు రద్దు చేస్తూ ఉత్తర్వులు

Rupee Record Low : డాలర్ తో పోలిస్తే తొలిసారిగా రూ.87కి పడిపోయిన రూపాయి.. మనకు పాకిస్తాన్ పరిస్థితులు తప్పవా ?

Rupee Record Low : డాలర్ తో పోలిస్తే తొలిసారిగా రూ.87కి పడిపోయిన రూపాయి.. మనకు పాకిస్తాన్ పరిస్థితులు తప్పవా ?

ఫొటో గేలరీ

Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

Anasuya How Many Crores Does Anchor Anasuyas New House Cost

Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priyanka Jawalkar Viral Photos And Facts

Krithi Shetty: కిరాక్ అనిపిస్తున్న కృతి శెట్టి ఫోటోలు.. చూస్తే మతిపోవాల్సిందే..

Krithi Shetty Stunning Instagram Pictures

Photo Gallery: ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు మాత్రం సూపర్ హీరోయిన్..

Anikha Surendran Latest Saree Pics
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.