Sachein and Good Bad Ugly : ప్రస్తుతం తమిళనాడు లో నెంబర్ 1 హీరో ఎవరు అని అడిగితే కళ్ళు మూసుకొని విజయ్(Thalapathy Vijay) పేరు చెప్పొచ్చు. రెండు మూడేళ్ళ క్రితం విజయ్ కి పోటీగా అజిత్ ఉండేవాడు కానీ, ఇప్పుడు విజయ్ కి ఓవర్సీస్ లో భారీ మార్కెట్ ఏర్పడడంతో ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఒకప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ డామినేషన్ తమిళనాట ఏ రేంజ్ లో ఉండేదో. ఇప్పుడు విజయ్ డామినేషన్ ఆ రేంజ్ లో కొనసాగుతుంది. రీసెంట్ గానే రాజకీయ అరంగేట్రం చేసి TVK అనే పార్టీ ని స్థాపించిన విజయ్, వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయబోతున్నాడు. అదే విధంగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఆయన నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ విడుదల కాబోతుంది. ఇదంతా పక్కన పెడితే నిన్న ఆయన హీరో గా నటించిన పాత చిత్రం ‘సచిన్'(Sachein Movie) ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదలైంది.
Also Read : ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కి 200 కోట్లు వచ్చినా ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వలేదా..?
నిన్న తమిళనాడు లో ఈ చిత్రానికి పడిన హౌస్ ఫుల్స్ ని చూసి ప్రతీ ఒక్కరు ఆశ్చర్యానికి గురయ్యారు. రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతున్న అజిత్(Thala Ajith) ‘గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly) చిత్రం తో సమానంగా ఈ సినిమా అనేక ప్రాంతాల్లో హౌస్ ఫుల్స్ ని నమోదు చేసింది. కొన్ని చోట్ల ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రాన్ని కూడా దాటేసింది. ‘మాయాజల్’, రోహిండి సిల్వర్ స్క్రీన్’ వంటి థియేటర్స్ లో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రానికి కేటాయించిన షోస్ ని ‘సచిన్’ షిఫ్ట్ చేయడం అందరినీ షాక్ కి గురి చేసింది. గ్రాస్ వసూళ్లు కూడా నిన్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రాన్ని మించి రాబట్టింది కొందరు ప్రచారం చేసారు కానీ, అందులో ఎలాంటి నిజం లేదు.
‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రానికి ఆన్లైన్ షోస్ ద్వారా దాదాపుగా 5 కోట్ల రూపాయిలు ట్రాక్ కాగా, ‘సచిన్’ చిత్రానికి దాదాపుగా 2 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు ట్రాక్ అయ్యాయి. పాత సినిమాకు ఈ రేంజ్ గ్రాస్ రావడం అనేది సాధారణమైన విషయం కాదు, కొన్ని మల్టీప్లెక్స్ థియేటర్స్ లో ఈ చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రాన్ని కూడా డామినేట్ చేసింది అనేది వాస్తవమే. కానీ ఓవరాల్ గా డామినేట్ చేసింది అనడంలో ఎలాంటి నిజం లేదని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. రెండవ రోజు కూడా ‘సచిన్’ కి మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 2 వేల మూడు వందల టికెట్స్ అమ్ముడుపోతుండగా, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రానికి గంటకు 5 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఓవరాల్ గా సచిన్ రీ రిలీజ్ కి క్లోజింగ్ లో 20 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది.
Also Read : ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మొదటి వారం వసూళ్లు..తెలుగు లో దుమ్ములేపేసిందిగా!