Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. ఘన విజయం సాధించారు. 300లకుపైగా ఎలక్టోరల్‌ఓట్లతో వైట్‌హౌస్‌లో అడుగు పెట్టనున్నారు. 2025, జనవరి 20న అదికార మార్పిడికి అధికారుల ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ట్రంప్.. తన కేబినెట్, వైట్‌హౌస్ కార్యవర్గం కూర్పు పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే కీలక పదవులకు విధేయులను, సమర్థులను ఎంపిక చేశారు. భారత సంతతికి చెందిన వ్యక్తులకు కూడా కీలక పదవులు దక్కాయి. ఇక మరో రెండు నెలల్లో బాధ్యతలు చేపట్టబోతున్న ట్రంప్‌కు అక్కడి కోర్టు భారీ ఊరటనిచ్చింది. 2020 నాటి ఎన్నికల కేసు కొట్టివేస్తున్నట్లు న్యాయస్థానం తీర్పు చెప్పింది.
కేసు కొట్టివేయాలని…
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌పై 2020 ఎన్నికల నాటి కేసు కొట్టేయాలని ఆయన తరఫు న్యాయవాది జాక్‌స్మిత్ కోర్టును అభ్యర్థించారు. ఈ అభ్యర్థనను న్యాయమూర్తి తాన్య చుట్కాన్ అంగీకరించారు. కేసు తొలగింపు ట్రంప్ అధ్యక్ష పదవిలో ఉన్నంత వరకు మాత్రమే అని స్పష్టం చేశారు. పదవి ముగిసిన వెంటనే గడువు ముగుస్తుందని తీర్పులో పేర్కొన్నారు. ఎన్నికల కేసు కొట్టివేయడంపై ట్రంప్ కూడా స్పందించారు. ఈ కేసులు చట్ట విరుద్ధమైనవని, ప్రత్యర్థులు అయిన డెమొక్రట్లు 100 మిలియన్ డాలర్లు వృథా చేశారని పేర్కొన్నారు. ఈమేరకు ట్రూత్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
2020లో ఓటమి తర్వాత..
కాగా, 2020 అధ్యక్ష ఎన్నికల్టో రిపబ్లికన్ పార్టీ భ్యర్థిగా పోటీచేసిన ట్రంప్ ఓడిపోయారు. అనంతరం ఆయన బాధ్యతల నుంచి వైదొలుగుతున్నప్పుడు వైట్‌హౌస్ నుంచి కీలక దస్త్రాలు తరలించారని ఆరోపిస్తూ కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసు ఎప్పుడూ కోర్టులో విచారణ జరుగలేదు. అమెరికాలో న్యాయశాఖ నిబంధనల ప్రకారం సిట్టింగ్ అధ్యక్షుడు క్రిమినల్ విచారణ ఎదుర్కొనకుండా వారికి రక్షణ ఉంటుంది. ప్రనస్తతం ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో ఆయనపై నమోదైన కేసుల విచారణ నిలిపివేస్తూ.. ఊరట లభిస్తుంది. ఇటీవల హష్ మనీ కేసులో ట్రంప్‌కు శిక్ష ఖరారైనా ఆ శిక్షను కూడా నిరవధికంగా వాయిదా వేస్తూ న్యూయార్క్ జడ్జి తీర్పు ఇచ్చారు.