If I have to beat that hero, I can't beat him at all, Prabhas says he is equal to God...so who is that hero..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నప్పటికి ప్రభాస్ కి మాత్రం చాలా ప్రత్యేకమైన గుర్తింపైతే ఉంది. ఎందుకంటే ఆయన బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియాలోకి తీసుకెళ్లిన హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు…ఇక ఇప్పుడు పాన్ ఇండియాలో కూడా స్టార్ హీరోగా గుర్తింపు పొందుతున్నాడు…
ఈశ్వర్ సినిమాతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతూ తనకంటూ మంచి మార్కెట్ ను క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను అందుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ మేనియాని కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇక వరుసగా సలార్, కల్కి లాంటి రెండు భారీ సక్సెస్ లను అందుకున్న ఆయన ఈ రెండు సినిమాలతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించాడు. కల్కి సినిమాతో వెయ్యి కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్న ఈ స్టార్ హీరో రాబోయే సినిమాలతో మరిన్ని రికార్డులను బద్దలు కొట్టాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ రాబోయే సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధిస్తేనే ఆయన బాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతాడు. లేకపోతే మాత్రం ఆ స్థానాన్ని మరొక హీరో రీప్లేస్ చేసే అవకాశాలైతే ఉన్నాయి… ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ప్రభాస్ కమల్ హాసన్ గురించి మాట్లాడుతూ ఆయన తన సినిమాలో విలన్ గా నటించడం తన అదృష్టమని చెప్పాడు.
ఇక చిన్నప్పటి నుంచి కమల్ హాసన్ సినిమాలను చూస్తూ పెరిగిన ప్రభాస్ ఆయన సినిమాలన్నా కమల్ హాసన్ నటన అన్న కూడా అతనికి అమితమైన ఇష్టమని చెప్పాడు. ఇక కల్కి సినిమాలో విలన్ గా చేసినంత మాత్రాన కల్కి 2 సినిమాలో కమల్ హాసన్ కి ప్రభాస్ కి మధ్య ఫైటింగ్ సీన్ ఉంటే మాత్రం ప్రభాస్ కమల్ హాసన్ ని అసలు కొట్టనని ఆయన తనకు యాక్టింగ్ లో దేవుడితో సమానమని చెబుతున్నాడు.
మరి ఈ విషయాన్ని నాగ్ అశ్విన్ ఎలా డీల్ చేస్తాడు.ఇక ఇప్పటికే వీళ్ళిద్దరి మధ్య భారీ ఫైట్ సీక్వెన్స్ ని అరేంజ్ చేస్తున్న ఆయన ఈ ఫైట్ ను మార్చే సిచువేషన్స్ ఏమైనా ఉన్నాయా అనే రీతిలో అలోచిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో చాలా రకాల ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా రెబల్ స్టార్ ప్రభాస్ తొందర్లోనే కల్కి 2 సినిమాతో కూడా భారీ ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు…