Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. 300లకుపైగా ఎలక్టోరల్ ఓట్లతో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో 2025, జనవరి 20న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అధికార మార్పిడి సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రనస్తుత అధ్యక్షుడు బైడెన్ కూడా తెలిపారు. ఇక బాధ్యతల స్వీకరణకు గడువు ఉండడంతో ట్రంప్ తన కేబినెట్ కూర్పులో నిమగ్నమయ్యారు. విధేయులను కీలక పదవులకు ఎంపిక చేస్తున్నారు. ఇదే సమయంలో వైట్‌హౌస్ కార్యవర్గాన్ని కూడా ఎంపిక చేస్తున్నారు. అధికారుల సామర్థ్యం ఆధారంగా ఎంపిక జరుగుతోంది. ఇప్పటికే భారత సంతతికి చెందిన ముగ్గురిని కీలక పదవులకు ఎంపిక చేసిన ట్రంప్.. మరో కీలక పదవిని భారత సంతతి అమెరికన్‌కు అప్పగించాలని భావిస్తున్నారు.
వైద్య పరిశోధన బాధ్యతలు..
అమెరికాలో వైద్య పరిశోధనలను పర్యవేక్షించే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కు నూతన డైరెక్టర్‌గా భారత మూలాలు ఉన్న జై భట్టాచార్యను నియమించాలనే ఆలోచనలో ట్రంప్ ఉన్నారు. ఈ విషయాన్ని అమెరికా పత్రిక వాషింగ్‌టన్ పోస్టు పేర్కొంది. ఈమేరకు కథనం ప్రచురించింది. రేసులో మొత్తం ముగ్గురు ఉండగా, జై భట్టాచార్యవైపే ట్రంప్ మొగ్గు చూపుతున్నట్లు వెల్లడించింది. ఆయన స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఫిజీషియన్, ఆర్థిక వేత్తగా శిక్షణ కూడా పొందారు. జై భట్టాచార్య గత వారం ట్రంప్ కార్యవర్గంలో ఆర్థిక మంత్రిగా ఎంపికైన రాబర్ట్ ఎఫ్.కెన్నీని కలిశారు. ఎన్‌ఐహెచ్‌పై తన ఆలోచనలను పంచుకున్నారు. దీనికి కెన్నడీ కూడా సానుకూలంగా స్పందించారు. దాదాపు 50 బిలియన్ డాలర్ల విలువైన ఈ సంస్థ అమెరికా బయోమెడికల్ రీసెర్చ్‌ని పర్యవేక్షిస్తుంది. ఇతర ఏజెన్సీలతో కలిసి అమెరికా వైద్య విభాగం కింద పనిచేస్తుంది.
సంస్కరణలపై ట్రంప్ దృష్టి..
ఇదిలా ఉంటే.. అమెరికాలో సంస్కరణలు తీసుకురావాలని కాబోయే అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నారు. ఈమేరకు సృజనాత్మక అంశాలపై ఎన్‌ఐహెచ్ దృష్టి సారించాలని వాదిస్తున్నారు. ఎప్పటి నుంచో ఆ సంస్థలో పాతుకుపోయినవారిని తప్పించాలని భావిస్తున్నారు. కెన్నడీ సారథ్యంలోని ఎన్‌ఐహెచ్ ట్రంప్ కార్యవర్గంలో అత్యంత కీలకమైనది. ఇది అమరికా వైద్య సేవలను చూసుకుంటుంది. జై భట్టాచార్య నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చిలో అసోసియేట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. సెంటర్ ఫర్ డేమోగ్రఫీ అండ్ ఎకనామిక్ ఆఫ్ హెల్త్ అండ్ ఏజినింగ్ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు.