https://oktelugu.com/

BGT 2024: పెర్త్‌లో కోహ్లీ సిక్స్‌.. సెక్యూరిటీ తలకు గాయం.. కింగ్‌ ఏం చేశాడో తెలుసా?

బోర్డర్‌–గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా.. తొలి టెస్టు మ్యాచ్‌ పెర్త వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ పట్టు భిగించింది. ప్రస్తుతం 400లకుపైగా పరుగుల లీడ్‌లో ఉంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 24, 2024 / 01:06 PM IST

    BGT 2024

    Follow us on

    BGT 2024: బోర్డర్‌–గవాస్కర్‌ ట్రోఫీ అనగానే ఇటు భారతీయులు, అటు ఆస్ట్రేలియా క్రికెట్‌ అభిమానుల్లో.. ప్రత్యేక ఆసక్తి నెలకొంటుంది. ఈ ట్రోఫీలో తమ జట్టు పైచేయి సాధించాలని ఎవరికి వారు కోరుకుంటారు. అభిమానుల ఆకాంక్షలకు తగిటనుల్గానే ఆటగాళ్లు కూడా తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. ఆస్ట్రేలియా–ఇంగ్లండ్‌ మధ్య జరిగే యాషెస్‌ సిరీస్‌ తర్వాత అంత క్రేజీ ఉన్న సిరీస్‌ బోర్డర్‌–గవాస్కర్‌ ట్రోఫీనే. తాజాగా ఈ ట్రోఫీ ఆస్ట్రేలియాలో జరుగుతోంది. తొలి టెస్టు పెర్త్‌ స్టేడియంలో రెండు రోజుల క్రితం ప్రారంభమైంది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 150 పరుగులకే ఆలౌట్‌ అయిన టీమిండియా.. తర్వాత ఆతిథ్య ఆసీస్‌ జట్టును 104 పరుగులకే కట్టడి చేసింది. భారత తాత్కాలిక కెప్టెన్‌ బూమ్రా ఐదు వికెట్లు తీయగా, హర్షిత్‌ రాణా 3 వికెట్లు, సిరాజ్‌ 2 వికెట్లు తీశారు. ఇక రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ ప్రస్తుతం పటిష్ట స్థితిలో ఉంది. 400లకుపైగా లీడ్‌ సాధించింది. ప్రస్తుతం కోహ్లీ, వాషింగ్‌టన్‌ సుందర్‌ క్రీజ్‌లో ఉన్నారు.

    100వ ఓవర్‌లో కోహ్లీ సిక్స్‌..
    కొన్ని రోజులుగా కింగ్‌ కోహ్లీ పేలవమైన ప్రదర్శనతో అభిమానులను నిరాశపరుస్తున్నాడు. తాజాగా పెర్త్‌లో జరిగిన తొలి ఇన్నింగ్స్‌లోనూ విఫలమయ్యాడు. అయితే సెకండ్‌ ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడుతున్నాడు. ప్రస్తుతం వాషింగ్‌టన్‌ సుందర్‌తో కలిసి మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో మ్యాచ్‌ 100వ ఓవర్‌ ఐదో బంతికి కోహ్లి భారీ సిక్స్‌ కొట్టాడు. ఆసిస్‌ బౌలర్‌ స్టార్క్‌ వేసిన బంతిని కోహ్లీ కట్‌షాడ్‌ ఆడారు. దీంతో బంతి బౌండరీ లైన్‌ దాటింది. అయితే బండరీ వద్ద కూర్చున్న సపెక్యూరిటీ బంతిని గమనించలేదు. దీంతో బంతి నేరుగా వెళ్లి సెక్యూరిటీ తలకు తాకింది.

    అతడి గురించి కోహ్లీ..
    ఇక బంతి సెక్యూరిటీ తలకు తాకిన విషయం గమనించిన కోహ్లీ కొద్దిసేపు అక్కడే ఆగాడు. ఆట ఆపేశాడు. అతడి పరిస్థితి ఎలా ఉందని ఆరా తీశాడు. మరోవైపు ఆస్ట్రేలియా టీం ఫిజియో అక్కడకు పరిగెత్తుకెళ్లి సెక్యూరిటీతో మాట్లాడారు. పరిస్థితి ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. అంతా నార్మల్‌గా ఉందని తెలిసిన తర్వాతనే కోహ్లీ తిరిగి బ్యాటింగ్‌ చేశాడు.

    టీటైం..
    ఇదిలా ఉండగా తొలిటెస్ట్‌ మూడో రోజు కూడా టీమిండియా స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. తొలి సెషన్‌లో రాహల్‌ వికెట్‌ కోల్పోయినా జైశ్వాల్, వడిక్కల్‌తో కలిసి, ఇన్నింగ్‌ ఆడాడు. లంచ్‌ వరకు ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయింది. తర్వాత వడిక్కల్‌ స్లిప్‌లో దొరికిపోయాడు. తర్వాత వచ్చి కోహ్లీ కలిసి జైశ్వాల్‌ ధాటిగా ఆడాడు. అయితే అనవసర షాట్‌ కొట్టిన జైశ్వార్‌ క్యాచ్‌ ఔట్‌ అయ్యాడు. తర్వాత పంత్‌.. కూడా అనవసర షాట్‌ కోసం క్రీజ్‌ నుంచి ముందుకు వచ్చి స్టంప్‌ ఔట్‌ అయ్యాడు. తర్వాత టీ సమయానికి టీమిండియా 350 పరుగుల చేసింది. 400ల పరుగుల లీడ్‌ సాధించింది.