https://oktelugu.com/

Iran-Israel War : ఇరాన్ ఊరుకోదు.. ఇజ్రాయిల్ ఆగదు.. మరో యుద్ధం తప్పదా?

ఇరాన్ దేశానికి సమర్థవంతమైన రక్షణ వ్యవస్థ ఉంది. మాపై ప్రయోగించిన డ్రోన్లను కూల్చేశాం. క్షిపణి దాడి జరిగినట్టు పెద్దగా నివేదికలు లేవని" ఇరాన్ ప్రతినిధి హుస్సేన్ దాలిరియన్ ట్విట్టర్ ఎక్స్ లో ప్రకటించారు.

Written By:
  • NARESH
  • , Updated On : April 19, 2024 / 11:05 PM IST
    Follow us on

    Iran-Israel War ఇప్పటికే రష్యా -ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచం తీవ్రంగా ప్రభావితమైంది. యూరప్ దేశాలు ఇంకా కోలుకోలేదు. ఉక్రెయిన్ ఎప్పుడు బాగుపడుతుందో తెలియదు. రష్యా ఆర్థిక పరిస్థితి గాడిలో పడుతుందో, లేదో అవగతం కావడం లేదు. ఈ పరిస్థితులు ఇలా ఉండగానే.. ఇరాన్ చేసిన నిర్వాకం ప్రపంచాన్ని మరో పెను విపత్తు ముందు నిలిపింది.. సైనిక శక్తిలో, రక్షణ వ్యవస్థలో బలమైన దేశంగా ఉన్న ఇజ్రాయిల్ పైకి ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు, రాకెట్లు వదిలింది. ఇజ్రాయిల్ ముందుగానే మేల్కొని వాటిని ఆకాశంలోనే అడ్డుకుంది. సాధారణంగానే విపరీతమైన శత్రు దేశాలను కలిగి ఉన్న ఇజ్రాయిల్.. తన జోలికి ఎవరైనా వస్తే అంత సులభంగా వదిలిపెట్టే రకం కాదు. అందుకే ఇరాన్ లోని ఇస్ఫాహాన్ నగరంలో భారీగా దాడులు చేసింది. దీనిని అమెరికా కూడా ధ్రువీకరించింది. మిస్సైళ్లతో ఇజ్రాయిల్ విరుచుకుపడిందని అమెరికా అధికారులు ప్రకటించారు. మరోవైపు ఇరాన్ మేకపోతు గాంభీర్యం లాంటి మాటలు చెబుతున్నప్పటికీ.. ఆ దేశంలో దాడులు జరిగినట్టు తెలుస్తోంది.

    ఇజ్రాయిల్ ఇరాన్ రాజధాని తెహరాన్ కు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇస్ఫాహాన్ నగరంలోని అతిపెద్ద మిలిటరీ ఎయిర్ బేస్, పలు న్యూక్లియర్ సైట్లపై లక్ష్యంగా చేసుకుని ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఈ దాడుల వల్ల ఎంత నష్టం జరిగిందనేది తెలియక పోయినప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం వీడియోలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. మరోవైపు ఈ దాడులను ఇరాన్ కొట్టిపారేసింది. ఇదే క్రమంలో ఇజ్రాయిల్ కూడా దాడులపై ఎటువంటి ప్రకటనా చేయలేదు. దాడుల నేపథ్యంలో ఇరాన్ దేశానికి సంబంధించి పలు విమానాల రాకపోకలను రద్దు చేశారు. “ఇప్పటికైతే మాకు ఎలాంటి ప్రమాదం ఎదురుకాలేదు. ఇరాన్ దేశానికి సమర్థవంతమైన రక్షణ వ్యవస్థ ఉంది. మాపై ప్రయోగించిన డ్రోన్లను కూల్చేశాం. క్షిపణి దాడి జరిగినట్టు పెద్దగా నివేదికలు లేవని” ఇరాన్ ప్రతినిధి హుస్సేన్ దాలిరియన్ ట్విట్టర్ ఎక్స్ లో ప్రకటించారు.

    మరోవైపు ఇస్పహాన్ సమీపంలో వైమానిక స్థావరంలో పేలుళ్ల శబ్దం వినిపించినట్టు కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. “కీలకమైన ఎయిర్ బేస్ సైట్లను ఇజ్రాయిల్ లక్ష్యంగా చేసుకొని ఉండవచ్చు. డ్రోన్లను ప్రయోగించి ఉండవచ్చని” ఇరాన్ ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. అదే ఇటీవల ఇజ్రాయిల్ దేశంపై ఇరాన్ దాడులకు పాల్పడింది. అప్పటి నుంచి పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.. ఒకవేళ యుద్దం గనుక మొదలైతే.. అది ప్రపంచం మొత్తం వ్యాపిస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.