LSG vs CSK : ఎప్పుడొచ్చాడనేది కాదు.. ధోని కొడితే బంతి స్టాండ్స్ లోకి వెళ్లిందా? లేదా?..

మొత్తంగా 9 బంతుల్లో 28 పరుగులు చేసి తనకు తానే సాటి అని ధోని నిరూపించుకున్నాడు. ముఖ్యంగా ఠాకూర్ వేసిన మూడో బంతిని ధోని భారీ షాట్ కొట్టడంతో.. అది 103 మీటర్ల ఎత్తులో ఎగిరి స్టాండ్స్ లో పడింది. ఈ షాట్ మ్యాచ్ మొత్తానికే హైలైట్ గా నిలిచింది.

Written By: NARESH, Updated On : April 19, 2024 10:56 pm

MS Dhoni's heroics with sixes in the LSG vs CSK match

Follow us on

LSG vs CSK ధోని వయసు నాలుగు పదులు. జాతీయ జట్టుకు ఎప్పుడో గుడ్ బై చెప్పాడు. తన హయాంలో టీమిండియా కు వరల్డ్ కప్, టి20 కప్, ఛాంపియన్స్ ట్రోఫీ అందించాడు. టీమిండియాలో ఏ కెప్టెన్ కూడా అందుకోలే ని ఘనతలు ధోని సాధించాడు. జార్ఖండ్ డైనమేట్ గా.. జెంటిల్మెన్ క్రికెటర్ గా.. క్రికెట్లో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పాడు. ఐపీఎల్ లో చెన్నై జట్టును ఐదుసార్లు విజేతగా నిలిపాడు. అటువంటి ధోని.. ఐపీఎల్ 17వ సీజన్లో దుమ్ము రేగ్గోడుతున్నాడు. తన విషయంలో వయసు అనేది కేవలం నెంబర్ మాత్రమే అని.. ఆట లో ఎప్పటికీ అదే జోరు అని నిరూపిస్తున్నాడు.

చెన్నై జట్టు ప్రస్తుతం పాయింట్లు పట్టికలో మూడవ స్థానంలో కొనసాగుతోంది. ఢిల్లీ, హైదరాబాద్ జట్ల మీద మినహా ఆడిన అన్ని మ్యాచ్ ల్లోనూ విజయం సాధించింది. శుక్రవారం రాత్రి లక్నో జట్టుతో తలపడింది. ఇందులో భాగంగా ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఆరు వికెట్లకు 176 రన్స్ చేసింది. చెన్నై ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా 40 బంతుల్లో 57 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అజింక్య రహనే 24 బంతుల్లో 36 పరుగులు సాధించాడు. మోయిన్ అలీ 20 బంతుల్లో 30 పరుగులు చేశాడు. అయితే చెన్నై ఇన్నింగ్స్ లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ధోని బ్యాటింగ్ గురించి.

చివర్లో వచ్చిన ధోని చెన్నై జట్టు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 9 బంతులు ఎదుర్కొన్న అతడు 28 పరుగులు చేశాడు. ఇందులో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. అప్పటిదాకా నిదానంగా సాగుతున్న చెన్నై ఇన్నింగ్స్.. ధోని రాకతో ఒక్కసారిగా ఊపందుకుంది. మైదానం చెన్నై అభిమానుల కేరింతలతో సందడిగా మారిపోయింది. ముఖ్యంగా చివరి ఓవర్ వేసిన యష్ ఠాకూర్ బౌలింగ్ ను ధోని
తునాతునకలు చేశాడు. ఇతడి ఓవర్ లో నాలుగు బంతులు ఎదుర్కొన్న ధోని.. 6, 4, 2, 4 రూపంలో 16 పరుగులు పిండుకున్నాడు. అంతకుముందు ఓవర్లో 12 పరుగులు సాధించాడు. మొత్తంగా 9 బంతుల్లో 28 పరుగులు చేసి తనకు తానే సాటి అని ధోని నిరూపించుకున్నాడు. ముఖ్యంగా ఠాకూర్ వేసిన మూడో బంతిని ధోని భారీ షాట్ కొట్టడంతో.. అది 103 మీటర్ల ఎత్తులో ఎగిరి స్టాండ్స్ లో పడింది. ఈ షాట్ మ్యాచ్ మొత్తానికే హైలైట్ గా నిలిచింది.