Horoscope Today: 2024 ఏప్రిల్ 20 శనివారం రోజున ద్వాదశ రాశులపై పూర్వ పాల్ఘుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు సింహ రాశిలో సంచరించనున్నాడు. దీంతో మిథున రాశి ఉద్యోగులు శుభవార్తలు వింటారు. మీన రాశి వారు రోజంతా ఉల్లాసంగా ఉంటారు. అలాగే మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఈ రాశి వారు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అయితే ప్రశాంత జీవితం కోసం ప్రయత్నించాలి. గతంలో నష్టాలు ఉన్నట్లయితే లాభాల బాట పడుతారు.
వృషభ రాశి:
వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఏ పని చేసినా ఓర్పు తో ఉండాలి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు.
మిథునం:
కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉంటారు. ఉద్యోగార్థులు కొన్ని శుభవార్తలు వింటారు. ఖర్చులను నియంత్రించుకోవాలి. వ్యాపారులకు అధిక లాభాలు వస్తాయి.
కర్కాటకం:
కొన్ని అద్భుతమైన అవకాశాలు వస్తాయి. ఆరోగ్యానికి సంబంధించి శుభవార్త వింటారు. ఆదాయాన్ని పెంచుకోవడంలో ప్రణాళికలు వేస్తారు. కోరికలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు.
సింహ:
ఏ పనిచేసినా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని అసాధారణ సమస్యలు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.
కన్య:
ఈ రాశి వారికి కొన్ని కష్టాల తప్పవు. ఈ సమయంలో వీరికి ఓర్పు అవసరం. కుటుంబ వివాదాలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు. కొత్త వారిని గుడ్డినా నమ్మొద్దు.
తుల:
ఉద్యోగులకు ప్రశంసలు దక్కుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. ఆరోగ్యం గురించి పెద్దగా చింతాల్సిన అవసరం లేదు. ఆదాయం పెరుగుతుంది.
వృశ్చికం:
వ్యాపారులు గతంలో పెట్టిన పెట్టుబడులపై ఇప్పుడు లాభాలు పొందుతారు. కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి. కొన్ని విషయాల్లో అనవసరవ వాదనలకు దిగొద్దు.
ధనస్సు:
ఈ రాశి వారికి ఈరోజు ప్రతికూల వాతావరణం ఉంటుంది. కొన్ని విషయాలో ఏం మాట్లాడకుండా ఉండడమే మంచిది. కుటుంబం కోసం కొంత సమయం కేటాయించండి.
మకర:
వీరికి ఈ రోజు ఆర్థిక ఫలాలు ఎక్కువగా ఉంటాయి. కోరికలను నెరవేర్చుకుంటారు. తగిన ఆదాయం రావడంతో ఉల్లాసంగా ఉంటారు. కొన్ని లక్ష్యాలను పూర్తి చేస్తారు.
కుంభం:
ఆర్థిక కార్యకలాపాలపై జాగ్రత్తగా వ్యవహరించాలి. డబ్బు సంపాదించడంలో ఎటువంటి పొరపాట్లు చేయకుండా ఉండాలి. జీవిత భాగస్వామికి సంబంధించిన విషయంలో సున్నితంగా మెలగాలి.
మీనం:
కుటుంబం కోసం సమయాన్ని కేటాయించాలి. లక్ష్యాలను పూర్తి చేయడానికి తీవ్రంగా కష్టపడుతారు. ఈరోజంతా ఆహ్లదంగా ఉంటారు. అంకిత భావంతో పనులు చేస్తారు.