Joe Biden: బైడెన్‌కు గడ్డుకాలం.. ఓపీనియన్‌ పోల్‌లో వెనుకబడ్డ అమెరికా అధ్యక్షుడు!

ఆల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ ఒపీనియన్‌ పోల్‌ నిర్వహించిన పెన్సిల్వేనియా, మిషిగన్, అరిజోనా, జార్జియా, నెడవా, ఉత్తర కరోలినా, విస్కాన్సిన్‌ రాష్ట్రాలో అధ్యక్ష ఎన్నికల్లో ఫలితాలను ప్రభావితం చేస్తాయి.

Written By: Raj Shekar, Updated On : April 4, 2024 12:35 pm

Joe Biden

Follow us on

Joe Biden: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది చివరన జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత అధ్యక్షుడు జోబైడెన్, రిపబ్లికన్స్‌ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోమారు తలపడనున్నారు. బరిలో నిలిచే అభ్యర్థులు ఖరారు కావడంతో ఎన్నికల్లో గెలిచేది ఎవరు అన్న అంచనాల్లో సర్వే సంస్థలు నిమగన్నమయ్యాయి. తాజాగా ఓ కీలక సంస్థ ఓపినీయన్‌ పోల్‌ నిర్వహించింది. ఇందులో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. కీలక రాష్ట్రాల్లో ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి ట్రంప్‌ కన్నా వెనుకనపడ్డాడు. ఏడు రాష్ట్రాల్లో ఓపీనియన్‌ పోల్‌ నిర్వహించగా, ఆరు రాష్ట్రాల్లో ట్రంప్‌కే మద్దతు ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

బైడెన్‌పై అసంతృప్తి..
డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడి పనితీరుపై కొన్ని అంశాల్లో అమెరికన్లు అసంతృప్తిగా ఉన్నట్లు ఓటర్లు తెలిపారు. దేశ ర్థిక వ్యవస్థ, ఉపాధి కల్పన వంటి సమస్యల పరిష్కారంలో ఆయన సామర్థ్యంపై సందేహాలు వ్యక్తం చేసినట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ నిర్వహించిన ఒపీనియన్‌ సర్వేలో తేలింది.

ట్రప్‌కు ఆధిక్యం..
ఇక ఒపీనియన్‌ పోల్‌ నిర్వహించిన ఏడు రాష్ట్రాల్లో, ఆరు రాస్ట్రాల్లో ట్రంప్‌కు 6 నుంచి 8 శాతం బైడెన్‌ కన్నా ఆధిక్యం లభించిందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ తెలిపింది. పెన్సిల్వేనియా, మిషిగన్, అరిజోనా, జార్జియా, నెడవా, ఉత్తర కరోలినా, విస్కాన్సిన్‌ రాష్ట్రాల్లో సర్వే నిర్వహించారు

ఫలితాలను ప్రభావితం చేసేవి వివే..
ఆల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ ఒపీనియన్‌ పోల్‌ నిర్వహించిన పెన్సిల్వేనియా, మిషిగన్, అరిజోనా, జార్జియా, నెడవా, ఉత్తర కరోలినా, విస్కాన్సిన్‌ రాష్ట్రాలో అధ్యక్ష ఎన్నికల్లో ఫలితాలను ప్రభావితం చేస్తాయి. విజేతను నిర్ణయిస్తాయి. అందుకే ఒపీనియన్‌ పోల్‌ ఇక్కడే నిర్వహించింది. ఈ సర్వేలో ఒక్క విస్కాన్సిన్‌లో మాత్రమే బైడెన్‌ ట్రంప్‌కన్నా ముందు ఉన్నారు. మిగతా ఆరు రాష్ట్రాల్లో ట్రంప్‌ స్పష్టమైన ఆధిక్యం కనబర్చాడు.